BigTV English

Happy Valentine Day: వాలంటైన్ డే.. చాలా కాస్ల్టీ గురూ..!

Happy Valentine Day: వాలంటైన్ డే.. చాలా కాస్ల్టీ గురూ..!
Valentine Day

Valentine’s Day Gifts cost: ప్రేమ అంటే రెండు హృదయాల మధ్య చిగురించే గొప్ప ఫీల్. ఇప్పుడు ఆ రెండక్షరాల ఫీల్.. ప్రపంచమార్కెట్‌కు ఆక్సిజన్‌గానూ మారుతోంది. ఏటికేడు ప్రేమికుల రోజు బహుమతులు, వేడుకల కోసం పెడుతున్న ఖర్చు లక్షల కోట్ల రూపాయలు దాటిపోతోంది. దీనిని వ్యాపార సంస్థలు కూడా చక్కగా క్యాష్‌ చేసుకోవటంతో వాలెంటైన్స్‌ డే సేల్స్‌ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆ లెక్కలేంటో మనమూ ఓసారి తెలుసుకుందాం.


నేషనల్ రిటైల్ ఫౌండేషన్ ప్రకారం.. 2023లో అమెరికన్లు ఈ రోజున గిఫ్ట్‌ల కోసం వెచ్చించిన మొత్తం.. రూ.3 లక్షల కోట్లు. ఇందులో అబ్బాయిలు రూ.40 వేలకు పైగా ఖర్చు చేస్తుంటే.. అమ్మాయిల ఖర్చు.. రూ.12,750. ఇక.. 2019లో మన దేశంలో యువత పెట్టిన ఖర్చు 30వేల కోట్ల రూపాయలు కాగా.. 2023 నాటికి ఇది రూ.50 వేల కోట్లకు చేరింది.

ఈ రోజున ఎక్కువమంది కొనే బహుమతుల్లో తొలిస్థానం.. క్యాండీలు. వీటిమీదనే ఈ ఒక్కరోజు సుమారు రూ. 25000 కోట్ల వ్యాపారం జరుగుతుంది. తర్వాతి స్థానాల్లో వరుసగా చాక్లెట్లు, గ్రీటింగ్‌ కార్డ్స్‌, రిసార్టులు, హోటళ్ల ఖర్చులు, తాజా పువ్వులు, రకరకాల ఆభరణాలు, బ్రాండెడ్‌ బట్టలు, బార్బీ బొమ్మలు ఉన్నాయి.


ఈ రోజున ఎంత కాస్ట్లీ గిఫ్టయినా.. ఎర్ర గులాబీ ముందు వెలవెలబోవాల్సిందే. అందుకే ఫిబ్రవరిలో గులాబీల ధర కొండెక్కుతుంది. ఈ రోజు మనదేశంలో పెద్ద నగరాల్లో గులాబీ రూ. 150 నుంచి రూ. 200లకు చేరుతోంది. విదేశాల్లోనూ మన గులాబీలకు డిమాండ్ పెరగటంతో నిరుడు వాలంటైన్ రోజున మనదేశం నుంచి రూ. 30 కోట్ల విలువైన గులాబీలు ఎగుమతి అయ్యాయి.

ఏటా ఈ వేడుక కోసం ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్ల ఎర్ర గులాబీలు, 14.5 కోట్ల గ్రీటింగ్ కార్డులు రెడీ అవుతాయి. క్రిస్‌మస్ తర్వాత అత్యధికంగా గ్రీటింగ్ కార్డులు అమ్ముడయ్యే రోజుగా వాలంటైన్ డే రికార్డుకెక్కింది.

వాలంటైన్ డే సందర్భంగా అమెరికాలో 85 శాతం మంది పేరెంట్స్.. తమ పిల్లలకూ గిఫ్ట్‌లు కొంటున్నారు. పిల్లలకే కాదు.. పెట్స్‌కి కూడా ఈ రోజు బహుమతులు ఇచ్చే సంప్రదాయం ఉంది. 8 కోట్ల మంది అమెరికన్స్ ఈ రోజున తమ పెట్స్‌(పిల్లులు,కుక్కలు) కోసం రూ. 17,545 కోట్ల విలువైన గిఫ్ట్‌లు కొంటున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఈ రోజునే పెళ్లి నిశ్చితార్థం చేసుకునే వారి సంఖ్య దాదాపు 60 లక్షలు. ప్రపోజ్ చేయడానికి ప్రేమికుల రోజే బెస్ట్ టైం అని ప్రపంచవ్యాప్తంగా 40 శాతం అబ్బాయిలు భావిస్తున్నారు.

క్యాడ్బరీ సంస్థ 1861లో హార్ట్ షేపులోని చాక్లెట్ బాక్సులను తీసుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా నిరుడు ప్రేమికుల రోజున 2.7 కోట్ల కేజీల చాక్లె్ట్ ఉండే 3.6 కోట్ల హార్ట్ షేప్ చాక్లెట్ బాక్సులు సేల్ అయ్యాయి.

జపాన్ అమ్మాయిలు.. ఈ రోజు తమకు నచ్చిన అబ్బాయిలకు చాక్లెట్లు ఇస్తారు. అబ్బాయిలు.. ఓ నెల తర్వాత (మార్చి 14న) దానికి స్పందిస్తారు.
ఫిన్లాండ్‌లో ఈ రోజును స్నేహితుల దినోత్సవంగా జరుపుకుంటారు.

4వ శతాబ్దంలో రోమన్లు ‘ఎరోస్’ అనే ప్రేమ దేవతని ఆరాధించేవారు. ధనస్సుతో, రెక్కలతో ప్రేమ బాణం గురిపెడుతూ కనిపించే ఆయన పేరును తర్వాతి రోజుల్లో ‘క్యుపిడ్’ గా మారినా.. గ్రీటింగ్ కార్డుల మీద నేటికీ ఆ బొమ్మనే వాడుతున్నారు.

Related News

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

D-Mart: కొనేది తక్కువ, దొంగతనాలు ఎక్కువ.. డి-మార్ట్ యాజమాన్యానికి కొత్త తలనొప్పి!

JIO Super Plans: జియో నుంచి సూపర్ ఆఫర్లు.. ఏది ఫ్రీ, ఏది బెస్ట్ అంటే?

SEBI – Foreign Funds: భారతీయ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. విదేశీ ఫండ్స్‌కి SEBI గ్రీన్ సిగ్నల్

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Big Stories

×