E-Paper
Advertisement

Starlink Internet: స్టార్​లింక్ ఇంటర్ నెట్ సేవలు.. ధర తక్కువే, ఇన్‌స్టలేషన్ మాటేంటి?

Starlink Internet: స్టార్​లింక్ ఇంటర్ నెట్ సేవలు.. ధర తక్కువే, ఇన్‌స్టలేషన్ మాటేంటి?

Starlink Internet: ఇండియా మార్కెట్‌పై ఎలాన్‌ మస్క్​ కన్నేశాడా? రేపో మాపో స్టార్​లింక్ ఇంటర్ నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయా? అదే జరిగితే ఇండియా కంపెనీల మాటేంటి? ఇంటర్ నెట్ సేవలు కేవలం గ్రామీణ ప్రాంతాలకు పరిమితం అవుతుందా? లేకుంటే నగరాలకు విస్తరిస్తాయా? దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది.

ఇండియాలో స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్ నెట్ సేవలు రేపో మాపో అందుబాటులోకి రానున్నాయి.  కార్యకలాపాలను మొదలు పెట్టడానికి అడుగు దూరంలో ఉంది ఆ కంపెనీ. ఇండియాలో నెలకు 10 డాలర్లు అంటే సుమారు రూ. 850తో సేవలను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కార్యకలాపాలను ప్రారంభించడానికి అనుమతిని మంజూరు చేసింది టెలి కమ్యూనికేషన్స్ విభాగం. దీనికి సంబంధించి స్టార్​లింక్ కంపెనీ ఇటీవల లెటర్ ఆఫ్ ఇంటెంట్ పొందింది. రెగ్యులేటరీ, లైసెన్స్ సవాళ్ల జాప్యాన్ని ఎదుర్కొంది.

స్టార్ లింక్ తన సేవలు ప్రారంభించడానికి ముందు స్పెక్ట్రమ్ కేటాయింపుతోపాటు ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్-IN-SPACe నుండి ఆమోదం పొందాల్సివుంది. ఇక్కడే ఆలస్యమవుతుందని అంటున్నారు. స్టార్‌లింక్ సేవలు ప్రపంచవ్యాప్తంగా 100 కి పైగా దేశాల్లో ఉంది. వాటిలో భూటాన్, బంగ్లాదేశ్ ఉన్నాయి కూడా.

ALSO READ: అస్థిరంగా సాగుతున్న మార్కెట్, పెట్టుబడులకు సిప్ లేదా లంప్ సమ్ ఏది ఉత్తమం

సాంప్రదాయ బ్రాడ్‌బ్యాండ్ సదుపాయాలు లేని ప్రాంతాలలో హై స్పీడ్, తక్కువ లేటెన్సీ ఇంటర్నెట్‌ను అందిస్తోంది. ధరల విషయానికి వస్తే అమెరికాలో స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలు వినియోగదారునికి నెలకు దాదాపు రూ. 10,200 ఖర్చు అవుతుంది. భారతదేశంలో ధర గణనీయంగా తగ్గవచ్చని అంటున్నారు.  ప్రమోషనల్ ఆఫర్‌లు ముగిసిన తర్వాత ఒక్కసారిగా రేటు పెంచే అవకాశముందని వినియోగదారుల అంచనా.

స్టార్ లింక్ ఇన్‌స్టలేషన్‌కు దాదాపుగా 30 వేలు అవుతుందని అంటున్నారు. నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు స్టార్‌లింక్ హార్డ్‌వేర్ కిట్‌ను వినియోగదారులు కొనుగోలు చేయాల్సివుంది. శాటిలైట్ డిష్,  Wi-Fi రౌటర్ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా రూ. 21,300 నుండి రూ. 32,400 మధ్య ఉంది. బ్రాడ్‌బ్యాండ్ సేవలతో పోలిస్తే వన్ టైమ్ ఖర్చు దేశీయ వినియోగదారులకు అడ్డంకిగా మారడం ఖాయం.

ఇండియాలో మాత్రం ధర తగ్గే అవకాశముంది. ప్రస్తుతం స్టార్ లింక్‌లో డౌన్ లోడ్ స్పీడ్ 25 నుంచి 220 ఎంబీపీఎస్ వేగం ఉంటోంది. ఇండియాలోని కంపెనీలు 100 ఎంబీపీఎస్ వేగంతో నెట్ ఇస్తున్నాయి. ప్రస్తుతం ఆ కంపెనీ 10 మిలియన్ల ఖాతాదారులను లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా-ట్రాయ్ ఆలోచన మరోలా ఉందంటూ వార్తలు వస్తున్నాయి. పట్టణాల్లో ఆయా సేవలను ఉపయోగించే వినియోగదారులకు అదనపు సుంకాలను సిఫారసు చేసినట్టు సమాచారం. నెలకు రూ.500 సర్ చార్జీని ప్రతిపాదించారని తెలుస్తోంది. ఈ లెక్కన మామూలు ఇంటర్నెట్‌తో పోలిస్తే శాటిలైట్ బ్రాడ్ బ్యాండ్ ఖర్చు పెరగడం ఖాయం.

Related News

ప్రధాని నరేంద్రమోదీ ‘బంగారం’ మాటలు.. ఆపై గృహాలు, దేవాలయాల వంతు

ఆయిల్ తర్వాత గ్యాస్ వంతు మొదలు.. మరోసారి కమర్షియల్‌గా బాదుడు.. సిలిండర్‌కు రూ.42

బాలికలకు వరం… సుకన్య సమృద్ధి యోజనలో ఇలా పెట్టుబడి పెడితే మీ కూతురుకి 50 లక్షలు పక్కా

నెలలో ఏ తేదీన సిప్ వేస్తే ఎక్కువ లాభం… 30 ఏళ్ల అధ్యయనం చెప్పిన షాకింగ్ నిజం

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 5 పొరపాట్లు చేస్తే భారీ ఆర్థిక నష్టం తప్పదు

డాలర్లు అమ్మడం ద్వారా ఆర్‌బీఐకి లక్షల కోట్ల లాభం… రూపాయి విలువను కాపాడే వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఇదే

దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల నమోదు, ఇక హైదరాబాద్‌ మాటేంటి?

బంగారం-వెండి ధరలు తగ్గుముఖం.. కొనుగోలు ఇదే సరైన సమయం, మార్కెట్లో ధరల మాటేంటి?

Big Stories

×