Kannappa Hard Disc : మంచు వారి వివాదం మళ్లీ ముదిరినట్టు కనిపిస్తుంది. ఇప్పటికే ఆస్తుల వివాదం తారా స్థాయికి చేరి… మంచు వారి పరువు బజార్లోకి వచ్చేసింది. ఇప్పుడు మరోసారి ఈ మంచు అన్నదమ్ములు తమ పరువును బజార్లో పెట్టడానికి సిద్ధమవుతున్నారా అంటే అవును అనే ఆన్సర్ వస్తుంది ఇండస్ట్రీ వర్గాల నుంచి.
కన్నప్ప మూవీకి సంబంధించిన అత్యంత కీలకమైన హార్డ్ డిస్క్ మిస్ అయింది అంటూ నిన్న రాత్ర నుంచి ఇండస్ట్రీలో హంగామా నడుస్తుంది. కన్నప్ప మూవీని నిర్మించిన 24 ఫ్రేమ్స్ సంస్థ ఆఫీస్ బాయ్ రఘు, అదే సంస్థలో పని చేస్తున్న సరిత అనే మహిళ కలిసి తమ హార్డ్ డిస్క్ ను చోరీ చేసినట్టు నిన్న రాత్రి కన్నప్ప మూవీని నిర్మించిన 24 ఫ్రేమ్స్ ఫిలం నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
మార్నింగ్ నుంచి దీనికి సంబంధించిన న్యూసే వైరల్ అవుతుంది.
మిస్సింగ్ వెనక ఉన్నది వాడే..?
అయితే.. ఈ హార్డ్ డిస్క్ మిస్సింగ్ తర్వాత దీనిపై చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మూవీ టీం. మంచు విష్ణు కూడా కొన్ని అనుమానాలను పోలీసుల దగ్గర వ్యక్తం చేశారట.
అది ఏంటంటే… తన మూవీ హార్డ్ డిస్క్ ను ఓ పెద్ద వ్యక్తి కావాలని మిస్ అయ్యేలా చేశాడని, అందుకు ఆఫీస్ బాయ్ రఘు, సరితను వాడుకున్నాడు అంటూ అనుమానం వ్యక్తం చేశారట.
అసలు హార్డ్ మిస్ అవ్వలేదు.?
ఈ నేపథ్యంలో తాజాగా మరో వార్త కూడా వైరల్ అవుతుంది. అసలు హార్డ్ డిస్క్ మిస్ అవ్వలేదు అని అంటున్నారు మనోజ్ అభిమనులు, మద్దతుదారులు. మంచు విష్ణునే కావాలనే ఈ డ్రామా ఆడుతున్నాడు అంటూ మనోజ్ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు.
భైరవంపై ఎఫెక్ట్ పడటానికే…
మంచు మనోజ్ ఇప్పుడు హీరోగా చేసిన భైరవం మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. మే 30న ఇది రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. చాలా రోజుల నుంచి మంచు మనోజ్ పేరు గట్టిగా వినిపిస్తుంది. దీన్ని దెబ్బ తీయడానికే మంచు విష్ణు ఇలాంటి పనులు చేస్తున్నారు అంటూ మనోజ్ వర్గం ఆరోపిస్తుంది. పోలీసులతో కూడా ఈ విషయాన్ని చెప్పినట్టు కూడా సమాచారం.
అనుమానాలు ఎన్నో….
హార్డ్ డిస్క్ మిస్ అవ్వడంపై మార్నింగ్ నుంచి చాలా అనుమానాలు వస్తున్నాయి. కన్నప్ప మూవీని దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అంటే ఇది చాలా పెద్ద మూవీ అని చెప్పొచ్చు. అలాంటి పెద్ద సినిమాకు సంబంధించిన అత్యంత కీలకమైన సమచారం ఉన్న హార్డ్ డిస్క్ ను ఎవరైనా… కొరియర్ చేస్తారా.?? అది కూడా ముంబై నుంచి…? అనే క్వశ్చన్స్ బయటికి వస్తున్నాయి.
ఇన్నేళ్ల ఇండస్ట్రీ చరిత్రలో మూవీ సీన్స్ ఉన్న హార్డ్ డిస్క్ మిస్ అవ్వడం ఇదే మొదటి సారి అని కూడా అంటున్నారు. ఈ మిస్సింగ్ వెనక కచ్చితంగా కుట్రా దాగి ఉందని మనోజ్ వర్గం వాళ్లు అనుమానిస్తున్నారు.
ఇప్పటికే మంచు వారి ఇంట్లో జరిగుతున్న వ్యవహారాలన్నీ చూస్తూనే ఉన్నాం. జనరేటర్ లో పంచదార పోయడం, కార్లు దొంగలించడం వాటితో పాటు ఎలుగుబంటి, పంది ***** లాంటి డైలాగ్స్ కూడా అక్కడి నుంచే విన్నాం.. ఇప్పుడు ఇండస్ట్రీ చరిత్రలో ఎప్పుడూ వినలేని హార్డ్ డిస్క్ మిస్సింగ్ కూడా ఇప్పుడు మంచు వారి ఫ్యామిలీ లోనే వింటున్నాం… అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి.
ఏది ఏమైనా… ఈ పుకార్లను నమ్మలేం. ఇంతకి ఈ హార్డ్ డిస్క్ నిజంగానే చోరీకి గురి అయిందా..? అయితే ఎవరు చేశారు..? ఎందుకు చేశారు??? అనే విషయాలు తెలియాలంటే… పోలీసుల విచారణ పూర్తి అయ్యే వరకు వెయిట్ చేయాల్సింది.