Stock Markets in Heavy Losses sensex and Nifty Today: భారత స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లుకు నేడు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.. ఓపెనింగ్‌లోనే సెన్సెక్స్, నిఫ్టీ ఏకంగా రెండేసి శాతం నష్టపోయాయి. సెన్సెక్స్ దాదాపు 1600 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 500 పాయింట్లు నష్టపోయింది. మెటల్, క్యాపిటల్ గూడ్స్ సెక్టార్లకు అత్యధిక నష్టాలు వచ్చాయి. అంతర్జాతీయ పరిణామాల ప్రభావం మన మార్కెట్లపై పడింది. వెంటనే కాస్త కోలుకున్నట్టు కనిపించినా.. ఆ నష్టాలు మరింత పెరిగాయి. ఏకంగా సెన్సెక్స్ 2 వేల 300 పాయింట్లు నష్టపోయింది. ఇంట్రాడేలో నిఫ్టీ 700 పాయింట్లు కోల్పోయింది. టోక్యో మార్కెట్లు 10 శాతం పడిపోయాయి. తొలి రెండుగంటల్లోనే మదుపరులు 14 కోట్లకు పైగా నష్టపోయారు. అంతర్జాతీయ మార్కెట్లన్ని నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. జపాన్ ఏకంకా 7 శాతం నష్టపోయింది.
ఐసీఐసీఐ బ్యాంక్, HDFC బ్యాంక్, యాక్సెస్ బ్యాంక్, మారుతి, టాటాస్టీల్, టాటా మోటార్స్,అదానీ పోర్ట్స్, తదితర కంపెనీలు, నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అమెరికా ఆర్థికమాంద్యంలోకి జారిపోతోదంనే ప్రచారం జరుగుతోంది. జులైలో అక్కడ నియామకాలు బాగా తగ్గిపోయాయి. ఎంతలా అంటే.. సగానికి పడిపోయింది. నిరుద్యోగిత రేటు విపరీతంగా పెరిగింది. 2021 అక్టోబర్ తర్వాత మళ్లీ అంతకంటే ఎక్కువ రేంజ్‌కు చేరింది. అమెరికాలోనే కాదు.. జపాన్ ఆర్థిక వ్యవస్థ కూడా కష్టాల్లో కనిపిస్తోంది. అక్కడి రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచింది. దీంతో స్టాక్ మార్కెట్ నుంచి పెట్టుబడులు వెనక్కి వెళ్లాయి. దీంతో నిక్కీ దారుణంగా పడిపోయింది.
ఇజ్రాయెల్‌పైకి కాలు దువ్వుతోంది ఇరాన్. తమ దేశ రాజధాని నడిబొడ్డున హమాస్ చీఫ్‌ను ఇజ్రాయెల్ మట్టుపెట్టడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. ఏ క్షణంలోనైనా ఆ దేశంపై దాడికి రెడీ అయింది. అమెరికా ఇంటెల్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించాయి. ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగితే అది ఒకరోజుతో ఆగిపోదనే భయాలు ఉన్నాయి. మూడో ప్రపంచ యుద్ధానికి సైతం దారితీయవచ్చనే అంచనాల మధ్య స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లు అలర్ట్ అయ్యారు. ముందు జాగ్రత్త పడుతున్నారు.
Also Read: కార్ కొనే టైమ్ వచ్చేసినట్లే.. టాటా 2023 మోడళ్లపై లక్షల్లో డిస్కౌంట్లు!
మరోవైపు.. బడ్జెట్ లాంటి పెద్ద ఈవెంట్స్ దేశంలో ముగిశాయి. కంపెనీల త్రైమాసిక ఫలితాలు విడుదల అయ్యాయి. ఇప్పట్లో మరో ట్రిగ్గర్ పాయింట్ కనిపించడం లేదని.. మార్కెట్ల పతనానికి ఇది కూడా కారణంగా చెప్తున్నారు. ఇప్పటికే భారీ ర్యాలీ తీసిన స్టాక్ మార్కెట్లు, ఓవర్ బాట్ స్థాయికి చేరాయని, ఈ సమయంలో కరెక్షన్ అనివార్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.