BigTV English
Advertisement

Tata Discount Offers: కార్ కొనే టైమ్ వచ్చేసినట్లే.. టాటా 2023 మోడళ్లపై లక్షల్లో డిస్కౌంట్లు!

Tata Discount Offers: కార్ కొనే టైమ్ వచ్చేసినట్లే.. టాటా 2023 మోడళ్లపై లక్షల్లో డిస్కౌంట్లు!

Tata Discount Offers: టాటా కార్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంటుంది. సేఫ్టీ పరంగా కూడా ప్రజల నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ముచేయలేదు టాటా. ఈ క్రమంలో టాటా మోటార్స్ డీలర్‌షిప్‌లు 2023 సంవత్సరంలో తయారు చేయబడిన కార్లు, SUVలపై బంపర్ డిస్కౌంట్‌లను అందిస్తున్నాయి. ఇందులో నెక్సాన్, హారియర్, సఫారీ, పంచ్, టియాగో, టిగోర్ తదితర కార్లు ఉన్నాయి. మీరు కూడా టాటా కార్లను కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లయితే.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్ అందిస్తున్నారు. తదితర వివరాలు తెలుసుకోండి.


Tata Harrier
2023లో ఉత్పత్తి చేయబడిన టాటా  హారియర్‌పై కస్టమర్‌లు మంచి తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. హారియర్ అమ్ముడుపోని స్టాక్‌పై రూ. 75,000 నుండి రూ. 1.45 లక్షల వరకు తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్‌లు ఉన్నాయి. SUV 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా ఆప్షనల్ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోతో జతచేయబడిన 2.0-లీటర్, నాలుగు-సిలిండర్ టర్బో డీజిల్ ఇంజిన్‌తో 170hp పవర్. 350Nm టార్క్ రిలీజ్ చేస్తుంది.

Also Read: Tata Punch Discounts: ఇది విన్నారా.. పంచ్‌పై మామూలు డిస్కౌంట్ ఇవ్వలేదు..!


Tata Safari
టాటా SUVలలో ఒకటైన Safari 1.65 లక్షల రూపాయల వరకు తగ్గింపును పొందుతోంది. సఫారీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 16.19 లక్షల నుండి రూ. 27.34 లక్షల మధ్య ఉంటుంది. హారియర్ వలె సఫారిలో FCA బేస్ 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ ఉపయోగించారు.

Tata Nexon
2023 సంవత్సరంలో తయారు చేసిన నెక్సాన్‌పై తగ్గింపులను అందిస్తోంది. కారుపై ఈ తగ్గింపు రూ.31,000 నుండి రూ.1.15 లక్షల వరకు ఉంటుంది. నెక్సాన్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 8 లక్షల నుండి రూ. 15.80 లక్షల మధ్య ఉంటుంది.

Nexon 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ 115hp పవర్ రిలీజ్ చేస్తోంది. ఇది కాకుండా 120hp పవర్ రిలీజ్ చేసే 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ అందుబాటులో ఉంది. Nexon కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, మారుతి బ్రెజ్జాతో సహా ఇతర కాంపాక్ట్ SUV కార్లతో మార్కెట్లో ప్రత్యక్ష పోటీ ఉంది.

Tata Tiago
టాటా హ్యాచ్‌బ్యాక్ కారు టియాగోపై కస్టమర్లు గొప్ప తగ్గింపులను పొందుతున్నారు. 2023 సంవత్సరంలో తయారు చేయబడిన టియాగో మోడళ్లపై రూ.90,000 వరకు తగ్గింపు లభిస్తోంది. టియాగో ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.65 లక్షల నుండి రూ. 8.90 లక్షల మధ్య ఉంటుంది. మార్కెట్లో టియాగో ప్రత్యక్ష పోటీ మారుతి స్విఫ్ట్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్‌లతో ఉంది. ఇది 1.2-లీటర్, మూడు-సిలిండర్ NA పెట్రోల్ ఇంజన్ మరియు CNG ఆప్షన్‌తో అందుబాటులో ఉంది.

Tata Tigor
డీలర్‌షిప్ 2023 సంవత్సరంలో తయారు చేయబడిన టిగోర్ యూనిట్లపై తగ్గింపులను కూడా ఇస్తోంది. ఈ టిగోర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.6.30 లక్షల నుండి రూ.9.55 లక్షల వరకు ఉంది. 85,000 వరకు తగ్గింపుతో ఈ కారును విక్రయిస్తున్నారు. ఈ కారు 1.2-లీటర్ NA పెట్రోల్, పెట్రోల్+CNG పవర్‌ట్రెయిన్‌తో కూడా నడుస్తుంది.

Also Read: Royal Enfield New Classic 350: క్లాసిక్ 350 అప్‌‌డేట్ వెర్షన్‌.. ఆగస్టు 12న లాంచ్.. లుక్ అదిరింది!

Tata Punch
టాటా కాంపాక్ట్ SUV ప్యూర్ రిథమ్ మినహా అన్ని టాటా పంచ్ వేరియంట్‌లపై తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. 2023 సంవత్సరంలో ఉత్పత్తి చేయబడిన స్టాక్‌పై కస్టమర్‌లు రూ. 18,000 వరకు తగ్గింపును పొందవచ్చు. పంచ్ నేరుగా హ్యుందాయ్ ఎక్సెంట్, సిట్రోయెన్ C3తో పోటీపడుతుంది. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ.6.13 లక్షల నుంచి రూ.10.20 లక్షల వరకు ఉంది.

Related News

JioMart Offers: జియో మార్ట్‌ ఆఫర్లు రేపటితో లాస్ట్.. ఫ్రీ హోమ్ డెలివరీతో గ్రాసరీ వెంటనే కొనేయండి

Earbuds At Rs 749: ఫ్లిప్‌కార్ట్‌లో మాస్ ఆఫర్.. రూ.749లకే అద్భుతమైన బ్లూటూత్ ఇయర్‌బడ్స్

Amazon November 2025 Offers: రూ.25వేలలోపే డబుల్‌ డోర్‌ ఫ్రిజ్‌ .. ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ కూడా ఉంది బ్రో..

Suzuki Hayabusa 2025: లాంగ్ జర్నీకి నో టెన్షన్.. హై స్పీడ్‌తో దూసుకువస్తోన్న సుజుకి హయబూసా బైక్..

Gold Rate: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

EPFO Withdrawal: ఈపీఎఫ్ఓ విత్ డ్రా నిబంధనలతో కొత్త చిక్కులు.. కాలపరిమితి పెంపుపై చందాదారుల్లో అసంతృప్తి

Elite Black Smartwatch: అమెజాన్‌ బంపర్‌ ఆఫర్‌.. రూ.9 వేల స్మార్ట్‌వాచ్‌ ఇప్పుడు కేవలం రూ.2,799లకే!

Fastest Electric Bikes: ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ బైక్‌లు, ఒక్కోదాని స్పీడ్ ఎంతో తెలుసా?

Big Stories

×