BigTV English

CM Chandrababu: అధికారులకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. స్పీడ్ పెంచాలంటూ.. త్వరలో తనిఖీలు..

CM Chandrababu: అధికారులకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. స్పీడ్ పెంచాలంటూ.. త్వరలో తనిఖీలు..

CM Chandrababu: రానున్న ఐదేళ్లలో తాము నిర్ధేశించుకున్న లక్ష్యాలు, అమలు చేసే బాధ్యత అధికారులపై ఉందన్నారు సీఎం చంద్రబాబునాయుడు. సెప్టెంబర్ 20 నాటికి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతుందన్నారు. సూపర్ సిక్స్ హామీలు ఇచ్చామని, దానికి కమిటై ఉన్నామన్నారు.


సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ మా విధానమన్నారు. పరదాలు కట్టడం, చెట్లు నరకడాలు ఉండ కూడదన్నారు ముఖ్యమంత్రి. తాను అందర్నీ కంట్రోల్ చేస్తున్నానని, పరిపాలన అనేది సర్వీసు మూడ్‌లో ఉండాలని, అధికారాన్ని చెలాయించే పద్దతిలో ఉండడం సరికాదని సున్నితంగా హెచ్చరించారు.

1995 నాటి చంద్ర‌బాబును చూస్తార‌ని అంటున్నానని, మీరు ఇంకా ఆ స్పీడ్ రాలేదని చురకలు అంటించా రు ముఖ్యమంత్రి. త్వరలో ఆకస్మిక తనిఖీలకు తాను వస్తానని చెప్పకనే చెప్పారు. ఆనాడు.. మంత్రులు, అధికారులు ప‌రిగెత్తారు.. ప‌రిగెత్తించామన్నారు. మేం ప‌ని చేస్తామని, మీతో ప‌ని చేయిస్తామన్నారు. విజ‌న్ 2020ని ఆనాడు చాలామంది ఎగ‌తాళి చేశారని, ఇప్పుడు విజ‌న్ 2047 టార్గెట్ అని గుర్తుచేశారు.


ALSO READ: జగన్‌కు మరిన్ని కష్టాలు, మరో పార్టీ ఆఫీసు మూసివేత

సోమవారం అమరావతిలో జిల్లాలో కలెక్టర్లతో సమావేశం జరిగింది. దీనికి మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు హాజరయ్యారు. ఇన్నాళ్ల మారిదిగా రాజకీయాలు లేవని, ఇప్పుడు మారాయని గుర్తు చేశారు సీఎం చంద్రబాబునాయుడు.

ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నవారిని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. విష ప్రచారం చేస్తున్నవారికి కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. 36 మందిని చంపేశారని ఢిల్లీకి వెళ్లి ధర్నా చేశారని దుయ్యబట్టారు. ఆ పేర్లు అడిగితే ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. ఈ క్రమంలో భట్టిప్రోలు వ్యవహా రాన్ని వివరించారు. ఇలాంటి విషయాలపై రైట్ టైమ్‌లో చెప్పకపోతే ఫేక్ వ్యక్తులు సోషల్‌మీడియా‌లో ఇష్టానుసారంగా బురద జల్లే అవకాశం ఉందన్నారు.

ప్రతీ విషయాన్ని హ్యూమన్ యాంగిల్‌లో చూస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు సీఎం చంద్ర బాబు. వల్గర్ లాంగ్వేజ్ వాడడం, అధికారం ఉందని పెత్తందారిగా వ్యవహరించడం ఉండకూదన్నారు. ప్రతి నెలా ఒకటిన ‘పేదల సేవలో’ పేరుతో కొత్త కార్యక్రమం చేస్తున్నామన్నారు. మనందరం ప్రజల కష్టాలు తెలుసుకుని, పేదరికం లేని సమాజం కోసం పని చేయాలన్నారు.

 

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×