BigTV English

Salary Hike: అటు ఉద్యోగుల తొలగింపు, ఇటు జీతాల పెంపు.. TCSతో మామూలుగా ఉండదు

Salary Hike: అటు ఉద్యోగుల తొలగింపు, ఇటు జీతాల పెంపు.. TCSతో మామూలుగా ఉండదు

ఇటీవల కాలంలో ఉద్యోగుల తొలగింపుతో టాక్ ఆప్ ది డౌన్ గా మారింది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ. టాటా గ్రూప్ అంటే ఓ భరోసా, ఓ బాధ్యత అనుకున్నారంతా. అయినా కూడా ఆ గ్రూప్ ఏకంగా 12 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతోందనే సరికి ఉద్యోగులతో సహా అందరూ షాకయ్యారు. రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. ఖర్చులు పెరిగితే 12వేలమందిపై వేటు వేసే బదులు.. ఉన్నత స్థాయి ఉద్యోగుల కొందరు జీతాలు తగ్గించుకుంటే సరిపోతుంది కదా అని కూడా సూచనలు చేశారు. కానీ TCS మాత్రం స్పందించలేదు. విడతలవారీగా 12,261మందిని సాగనంపే కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. అయితే అంతలోనే అదే కంపెనీ ఉన్న ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది. కంపెనీలో ఉన్న దాదాపు 80శాతం మందికి సెప్టెంబర్-1 నుంచి జీతాలు పెంచుతున్నట్టు ప్రకటించింది. అదే కంపెనీ మొన్నటి ప్రకటనతో ఉద్యోగుల్లో కలవరం కలిగించింది, తాజా ప్రకటనతో వారికి సంతోషాన్నిచ్చింది.


CHRO ఈమెయిల్స్..
జూనియర్, మధ్య స్థాయి ఉద్యోగుల్లో దాదాపు 80 శాతం మందికి వేతనాల పెంపు ఉంటుందని TCS తాజాగా ప్రకటించింది. అయితే ఎంతమేర వేతనాల పెంపు ఉంటుందనే విషయంపై కంపెనీ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. C3A, దానికి సమానమైన గ్రేడ్‌లలో అర్హులైన అసోసియేట్స్‌కు వేతన పెంపు ఉంటుందని ఉద్యోగులకు పంపిన ఈమెయిల్స్ లో TCS చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింద్‌ లక్కడ్, కాబోయే CHRO కె.సుదీప్‌ పేర్కొన్నారు. గత నెలలో CHRO వేతనాల పెంపుపై ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు. రోజుల వ్యవధిలోనే జీతాలు పెంచుతున్నట్టు ప్రకటించడం విశేషం. మీ అంకిత భావం, కృషికి ధన్యవాదాలు అంటూ ఉద్యోగులకు పంపిన ఈమెయిల్ లో CHRO పేర్కొన్నారు.

ఎందుకిలా?
ఖర్చులు పెరిగాయి, ఏఐ వల్ల ఇబ్బందులున్నాయి అనుకుంటే.. కచ్చితంగా దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకోవలసిందే. ఆ క్రమంలో ఉద్యోగులను తొలగించే నిర్ణయాలు కూడా కంపెనీలు తీసుకుంటాయి. అయితే ఆ నిర్ణయం తీసుకున్న కొన్ని రోజులకే మరికొంతమంది ఉద్యోగుల జీతాలు పెంచుతూ TCS తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యకరంగా ఉందని అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. ఓవైపు ఉద్యోగులను తొలగిస్తూనే, మరోవైపు ఉన్న ఉద్యోగులు కంపెనీ పట్ల నిబద్ధత చూపేలా యాజమాన్యం ప్రవర్తిస్తోందని అంటున్నారు. TCS తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనా అంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. కొంతమంది ఈ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు కూడా. ఉద్యోగుల్ని తొలగించడం ఎందుకు? ఉన్నవారికి జీతాలు పెంచడం ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారు.


ఇతర కంపెనీల సంగతేంటి?
TCS బాటలో ఇతర కంపెనీలు కూడా లే ఆఫ్స్ కి సిద్ధమవుతున్నాయనే అనుమానాలున్నాయి. దాదాపుగా అన్ని కంపెనీల పరిస్థితి ఇలాగే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్థిక అనిశ్చితి, అమెరికా సుంకాల మోత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఎంట్రీ లెవల్ ఉద్యోగాలపై ప్రభావం.. బలమైన కారణాలుగా ఉన్నాయి. ఇప్పటి వరకు TCS లాగా ఇతర కంపెనీలు భారీ లే ఆఫ్స్ పై ప్రకటన చేయలేకపోయినా దాదాపుగా అదే రిపీట్ అవుతుందని అంటున్నారు.

Related News

BSNL Rs 1 Plan: వావ్ సూపర్.. రూ.1కే 30 రోజుల డేటా, కాల్స్.. BSNL ‘ఫ్రీడమ్ ఆఫర్’

Wholesale vs Retail: హోల్‌సేల్ vs రిటైల్ మార్కెట్.. ఏది బెటర్? ఎక్కడ కొనాలి?

Gold Rate: వామ్మో.. దడ పుట్టిస్తున్న బంగారం ధరలు.. రికార్డ్ బ్రేక్.

D-Mart: డి-మార్ట్ లోనే కాదు, ఈ స్టోర్లలోనూ చీప్ గా సరుకులు కొనుగోలు చెయ్యొచ్చు!

Trump: ట్రంప్ నిర్ణయాలు.. కంప్యూటర్ల ధరలకు రెక్కలు, వాటితోపాటు

Big Stories

×