Top 10 safest cities in India 2025: దేశంలో ఆయా ప్రభుత్వాలు చేపడుతున్న చర్యల కారణంగా నేరాల సంఖ్య ప్రతి ఏటా ఎంతో కొంత తగ్గుతూ వస్తున్నది. ఒకప్పుడు కల్లోలానికి నిదర్శనంగా ఉన్న ప్రాంతాలు కూడా ఇప్పుడు అల్లర్లకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా దేశంలోని టాప్ 10 సురక్షిత నగరాలకు సంబంధించిన లిస్టు విడుదల అయ్యింది. నంబియో ఇండెక్స్ తాజాగా ఈ లిస్టును విడుదల చేసింది.
నెంబర్ వన్ గా మంగళూరు
అటుఈ లిస్టులో మంగళూరు అత్యంత సురక్షితమైన నగరంగా నిలించింది. 74.2 సేఫ్టీ స్కోర్ తో నెంబర్ వన్ గా నిలిచింది. గుజరాత్ లో, వడోదర, అహ్మదాబాద్, సూరత్ అనే నగరాలు వరుసగా 69.2, 68.2, 66.6 సేఫ్టీ స్కోర్ తో టాప్ 10 సురక్షితమైన భారతీయ నగరాల్లో స్థానం పొందాయి. ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన దేశాలలో భారత్ 67వ స్థానంలో నిలిచింది. 55.8 సేఫ్టీ స్కోర్ తో ఈ ప్లేస్ దక్కించుకుంది. సూచిక స్కోరును సాధించింది. నోయిడా, ఘజియాబాద్ తో పాటు దేశ రాజధాని నగరం న్యూఢిల్లీ అత్యంత అన్ సేఫ్ ఇండియన్ సిటీస్ లో స్థానం దక్కించుకున్నాయి. ముఖ్యంగా మహిళల భద్రత విషయంలో ఈ నగరాలు వెనుకబడి ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. ఢిల్లీ క్రైమ్ స్కోర్ లో 59.03, ఘజియాబాద్ 58.44, నోయిడా 55.1 అట్టడుగున నిలిచాయి.
భారతదేశంలో టాప్ 10 సురక్షితమైన నగరాలు
గ్లోబల్ ర్యాంక్ ఇండియా ర్యాంక్ నగరం, రాష్ట్ర భద్రతా సూచిక నేర సూచిక
⦿ మంగళూరు, కర్ణాటక 74.2 భద్రతా సూచికతో నెంబర్ 1గా నిలిచింది.
⦿ వడోదర, గుజరాత్ 69.2 భద్రతా సూచికతో నెంబర్ 2గా నిలిచింది.
⦿ అహ్మదాబాద్, గుజరాత్ 68.2 భద్రతా సూచికతో 3వ స్థానంలో నిలిచింది.
⦿ సూరత్, గుజరాత్ 66.6 భద్రతా సూచికతో 4వ స్థానంలో నిలిచింది.
⦿ జైపూర్, రాజస్థాన్ 65.2 భద్రతా సూచికతో 5వ స్థానంలో నిలిచింది.
⦿ నవీ ముంబై, మహారాష్ట్ర 63.5 భద్రతా సూచికతో 6వ స్థానంలో నిలిచింది.
⦿ తిరువనంతపురం, కేరళ 61.1 భద్రతా సూచికతో 7వ స్థానంలో నిలిచింది.
⦿ చెన్నై, తమిళనాడు 60.3 భద్రతా సూచికతో 8వ స్థానంలో నిలిచింది.
⦿ పూణే, మహారాష్ట్ర 58.7 భద్రతా సూచికతో 9వ స్థానంలో నిలిచింది.
⦿ చండీగఢ్ 57.4 భద్రతా సూచికతో 10వ స్థానంలో నిలిచింది.
పగటిపూట ప్రజలు ఎంత సురక్షితంగా భావిస్తున్నారో నంబియో విశ్లేషించింది. రాత్రిపూట దోపిడీలు, కారు దొంగతనాలు, భౌతిక దాడులు, బహిరంగ ప్రదేశాల్లో వేధింపులు, జాతి, మతపరమైన దాడుల ఆధారంగా ఈ జాబితాను రూపొందించింది. విధ్వంసం, దోపిడీ, దాడి, హత్యల లాంటి హింసాత్మక నేరాలను కూడా పరిగణలోకి తీసుకుంది.
ప్రపంచంలో అత్యంత సురక్షితమైన నగరాలు
మిడిల్ ఈస్ట్ లోని అనేక నగరాలు భద్రత ప్రపంగా ప్రపంచ గుర్తింపు పొందాయి. టాప్ 10 వరల్డ్ సేఫ్ సిటీల్లో ఐదు ఆ ప్రాంతం నుంచే ఉన్నాయి. ఈ జాబితాలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అగ్రస్థానంలో నిలిచింది. దోహా, దుబాయ్, షార్జా, తైపీ, మనామా,మస్కట్, ది హేగ్, ట్రోండ్‌హీమ్, ఐండ్ హోవెన్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
Read Also: ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ఆఫర్.. ఒకే ట్రిప్‌లో సింగపూర్, మలేసియా చూసే ఛాన్స్!