Hair Growth Tips: జుట్టు పెరుగుదల ఒక నిరంతర ప్రక్రియ. జుట్టు నెలకు సగటున అర అంగుళం మాత్రమే పెరుగుతుంది. అయినప్పటికీ.. ఒక వారంలో జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి, దాని పెరుగుదలను ప్రోత్సహించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ఈ చిట్కాలను అనుసరించడం వల్ల మీ జుట్టు బలంగా, ఆరోగ్యంగా మారి, త్వరగా పెరిగే అవకాశం ఉంటుంది. జుట్టు తొందరగా పెరగడానికి ఎలాంటి టిప్స్ పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఆరోగ్యకరమైన ఆహారం:
ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు పోషకాలు చాలా అవసరం. ప్రోటీన్లు, విటమిన్లు , జింక్, ఐరన్ , ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. గుడ్లు, చేపలు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, గింజలు వంటివి మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల జుట్టు కుదుళ్ళు బలపడి, జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.
2. క్రమం తప్పకుండా ఆయిల్ మసాజ్:
జుట్టు కుదుళ్ళకు రక్త ప్రసరణను పెంచడానికి ఆయిల్ మసాజ్ చాలా ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనె, ఆముదం, బాదం నూనె లేదా ఆలివ్ ఆయిల్ ను గోరువెచ్చగా చేసి, తలకు సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా రాత్రి పడుకునే ముందు చేసి, ఉదయం తలస్నానం చేయాలి. ఇది జుట్టును తేమగా ఉంచి, కుదుళ్ళను బలపరుస్తుంది.
3. హెయిర్ కేర్ :
జుట్టు సంరక్షణ అనేది చాలా ముఖ్యం. వారానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే జుట్టుకు షాంపూ చేయండి. ప్రతి రోజు తలస్నానం చేయడం వల్ల జుట్టులోని సహజ నూనెలు తొలగిపోతాయి. అంతే కాకుండా జుట్టు పొడి బారుతుంది. అలాగే.. మీ జుట్టును రసాయనాలతో కూడిన షాంపూలు, కండిషనర్లకు దూరంగా ఉంచడం మంచిది.
4. రాత్రిపూట జడ వేయండి:
రాత్రి పడుకునే ముందు జుట్టు వదులుగా జడ వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టుకు గాలి తగిలి, అది బలంగా ఉంటుంది. జుట్టును వదులుగా వదిలేయడం వల్ల అది తెగిపోయే ప్రమాదం ఉంది. పట్టు దిండు కవర్ వాడటం వల్ల జుట్టు తెగకుండా ఉంటుంది.
Also Read: దోసకాయ తింటే.. నమ్మలేనన్ని లాభాలు !
5. కండిషనర్‌ను వాడండి:
షాంపూ చేసిన ప్రతిసారి కండిషనర్‌ను వాడాలి. ఇది జుట్టును మృదువుగా, తేమగా ఉంచుతుంది. జుట్టు చివరలకు కండిషనర్ అప్లై చేయడం వల్ల చివర్లు కూడా చిట్లకుండా ఉంటాయి.
6. తల దువ్వే పద్ధతి:
జుట్టు తడిగా ఉన్నప్పుడు దువ్వకూడదు. ఎందుకంటే తడిగా ఉన్న జుట్టు బలహీనంగా ఉంటుంది. ఫలితంగా త్వరగా ఊడిపోతుంది. జుట్టు ఆరిన తర్వాత మాత్రమే వెడల్పాటి పళ్ళు ఉన్న దువ్వెనతో నెమ్మదిగా దువ్వాలి.
7. వేడికి దూరంగా ఉండండి:
హెయిర్ డ్రయ్యర్, స్ట్రైటెనర్ వంటి వాటిని వాడటం తగ్గించాలి. ఇవి జుట్టులోని తేమను తొలగించి, దాన్ని పొడిగా, బలహీనంగా చేస్తాయి.