Film Chamber: హైదరాబాదులోని తెలుగు ఫిలిం ఛాంబర్(Telugu Film Chamber) వద్ద గందరగోళ వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. పలువురు తెలంగాణ వాదులు ఫిలిం ఛాంబర్ ఎదుట పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నారు. తెలంగాణ నటుల విషయంలో ఫిలిం ఛాంబర్ ఎంతో పక్షపాతం చూపిస్తోంది అంటూ తెలంగాణ వాదులు నిరసనలు తెలియజేశారు. తెలుగు ఫిలిం ఛాంబర్ లో తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలిలో తెలంగాణకు చెందిన సినీ కళాకారుల ఫోటోలు లేకపోవడంతో తెలంగాణ ఉద్యమకారుడు పాశం యాదగిరి (Paasam Yadagiri)తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు తెలియజేశారు. ఈ క్రమంలోనే పాశం యాదగిరి ఆధ్వర్యంలో పలువురు తెలంగాణ ఉద్యమకారులు ఫిలిం ఛాంబర్ లో తెలంగాణ సినీ కళాకారుల ఫోటోలు లేకపోవడంతో ప్రశ్నించారు.
ఆంధ్ర గో బ్యాక్.. జై తెలంగాణ
ఇలా తెలంగాణ వాదులు పెద్ద ఎత్తున నిరసనలు తెలియచేయడంతో ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో పలువురు ఉద్యమకారుడు పాశం యాదగిరిని తోసివేశారు. దీంతో తెలంగాణ వారిని ఈ విధంగా కించపరుస్తున్నారు అంటూ ఆందోళనలు వ్యక్తం చేశారు. అలాగే ఫిలిం ఛాంబర్ ముందు తెలంగాణవాదులు జై తెలంగాణ (Jai Telangana)అంటూ నినాదాలు చేశారు. నిర్మాత మండలం లోపలికి చొచ్చుకుపోయే ప్రయత్నాలు చేయడంతో వీరిని అడ్డుకున్నారు. అలాగే ఆంధ్రాగో బ్యాక్ (Andhra Go Back)అంటూ నినాదాలు కూడా చేశారు.. ఫిలిం ఛాంబర్ లో పైడి జయరాజ్ (Paide Jayaraj)ఫొటోస్ చాలా చిన్న ఫోటో ఏర్పాటు చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.
పైడి జయరాజ్ కు అవమానం..
ఇక పైడి జయరాజ్ ఫోటో చిన్నది పెట్టడమే కాకుండా ఆయన ఫోటోని ఏకంగా ఒక హీరోయిన్ కింద పెడుతూ తనని అవమానపరిచారు అంటూ ఆందోళన తెలిపారు. అలాగే తెలుగు ఫిలిం ఛాంబర్ లో సినారే ఫోటో ఎందుకు లేదు అంటూ తెలంగాణవాదులు ప్రశ్నిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఇలా ఫిలిం ఛాంబర్ దగ్గర గందరగోల పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో విషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి ఈ వివాదాన్ని అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పాశం యాదగిరి మాట్లాడుతూ.. తెలంగాణకు చెందిన కళాకారుల ఫోటోలు ఎందుకు లేవని ప్రశ్నించినందుకే మమ్మల్ని లాగి పడేస్తున్నారని తెలిపారు. మేము ఎలాంటి దాడులు చేయలేదని వెల్లడించారు.
తెలుగు ఫిలిం ఛాంబర్ లో ఘర్షణ..
ఆంధ్రా గో బ్యాక్ అంటూ నినాదాలు
పైడి జయరాజ్ ఫొటో చిన్నదిగా పెట్టారని, సి.నారాయణరెడ్డి ఫోటో ఎందుకు లేదని గొడవకు దిగిన తెలంగాణ వాదులు
నిర్మాతల మండలి ఛాంబర్ లోకి చొచ్చుకెళ్లే యత్నం
ఫిలిం ఛాంబర్ సెక్రటరీ ప్రసన్నకుమార్ తో పాశం యాదగిరి వాగ్వాదం… pic.twitter.com/eIvpxFz8xI
— BIG TV Breaking News (@bigtvtelugu) July 29, 2025
ఒకవేళ మేము ఫిలిం ఛాంబర్ పై దాడి చేస్తే ఫిలిం ఛాంబర్ ఏమైనా తగలబడిపోయిందా లేదా పగిలిపోయిందా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ వారి విషయంలో ఇలాంటి వివక్షతలు చూపితే దాడి చేయడం కాదు మిమ్మల్ని ఇక్కడ బ్రతకనివ్వమని ఇండస్ట్రీలో కుల తత్వం, ప్రాంతీయ తత్వం ఉంది అంటూ పాశం యాదగిరి మండిపడ్డారు. చంద్రబాబు ఏజెంట్లు తెలంగాణలో ఉండటానికి వీలు లేదు ఆంధ్ర గో బ్యాక్ అంటూ ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మొత్తానికి తెలుగు ఫిలిం ఛాంబర్ కు తెలంగాణ సెగ భారీగా తగిలిందని తెలుస్తోంది. ఫిలిం ఛాంబర్ లో తెలంగాణ కళాకారులు ఫోటోలు లేకపోవడంతోనే ఈ వివాదం చోటు చేసుకుందని స్పష్టమవుతుంది.
Also Read: Coolie Trailer: అయ్యయ్యో లోకేష్ నీకు ఇది తగునా.. పోస్టర్ కూడా కాపీ కొట్టాలా?