Tesla Car: టెస్లా కార్లకు భారత్ మార్కెట్లో ఎలాంటి స్పందన ఉంది? వినియోగదారులు దానిపై మొగ్గు చూపడం లేదా? అందుకు ధర కారణమా? అందుకోసమే బుకింగ్స్ తగ్గుతున్నాయా? ఇవే ప్రశ్నలు మార్కెట్ వర్గాలను ప్రశ్నిస్తోంది. ఇండియా మార్కెట్లోకి టెస్లా కారు అడుగుపెట్టేసింది. ఇప్పటివరకు నిరాశాజనకమైన ఫలితాలను అందించినట్టు తెలుస్తోంది.
బుకింగ్‌లు మందకొడిగా ఉండటంతో కొత్త సందేహాలను రేకెత్తిస్తోంది. జూలై మధ్యలో అమ్మకాలు ప్రారంభించినప్పటి నుండి ఇప్పటివరకు కేవలం 600 బుకింగ్స్ ఆర్డర్‌లను అందుకుందట. కంపెనీ సొంత అంచనాలకు తగ్గట్టుగా లేదన్నది మార్కెట్ వర్గాల మాట.
వాస్తవానికి టెస్లా కంపెనీ ప్రపంచవ్యాప్తంగా కేవలం నాలుగు గంటల్లో 500 నుంచి 600 మధ్య కార్ల బుకింగులు రావడం జరుగుతోంది. బుకింగ్స్ ఆధారంగా టెస్లా ఈ ఏడాది 350 నుంచి 500 కార్ల వరకు మాత్రమే పంపించాలని ప్లాన్ చేస్తున్నట్లు ఆయా వర్గాలు చెబుతున్నాయి. షాంఘై నుంచి సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో వాహనాలు భారత్‌కు చేరుకోవచ్చని చెబుతున్నాయి.
ఆయా వాహనాల డెలివరీలు ముంబై, ఢిల్లీ, పుణే, గురుగ్రామ్ నగరాలకు పరిమితం చేయాలన్నది కంపెనీ ఆలోచనగా చెబుతున్నారు. పూర్తిస్థాయి చెల్లింపులు తర్వాతే వాటిని హ్యాండోవర్ చేయనున్నట్లు సమాచారం. తొలుత టెస్లా మోడల్-3 కారును భారత్‌లో ప్రవేశపెట్టాలని భావించింది. 100 శాతం పన్నులు ఉండటంతో తీవ్ర జాప్యం జరిగింది.
ALSO READ: జస్ట్ వన్ రుపీ.. డైలీ 2 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్
భారత్‌లో సగటు ఎలక్ట్రిక్ కారు ధర రూ.22 లక్షలు ఉంటే, ఏకంగా టెస్లా మోడల్ రూ.60 లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు. ఆర్‌డబ్ల్యూడీ వెర్షన్ బేస్ ధర రూ.61.07 లక్షలుగా నిర్ణయించింది. లాంగ్-రేంజ్ వెర్షన్ రూ.69.15 లక్షలుగా ఉంది. బేస్ మోడల్ ధర అమెరికాలో రూ.38.63 లక్షలు కాగా, చైనాలో రూ.31.57లక్షలుగా ఉంది.
దిగుమతి సుంకాల నేపథ్యంలో భారత్‌లో ధర ఎక్కువగా ఉందని అంటున్నాయి. ఈ విషయాలను బ్లూమ్ బెర్గ్ ఓ కథనాన్ని ప్రచురించింి. దీనిపై టెస్లా నోరు ఎత్తలేదు. ఎలన్ మస్క్.. అమెరికా అధ్యక్షుడితో కొన్ని అంశాలపై విభేదించడంతో వీరి మధ్య సంబంధాలు క్షీణించాయి.
అమెరికాతో భారత్ వాణిజ్య చర్చల సమయంలో 110 శాతం వరకు ఉన్న దిగుమతి సుంకాలు తగ్గుతాయని టెస్లా భావించింది. కానీ ట్రంప్.. భారత ఎగుమతులపై 50 శాతం సుంకాలను విధించిన తర్వాత అది కాస్త జఠిలమైంది. టెస్లా తన షోరూమ్‌లకు వినియోగదారులను ఆకర్షించినప్పటికీ ఊహించిన స్థాయిలో అమ్మకాలు జరగడం లేదని అంటున్నారు.