Sundarakanda Collections : నారా రోహిత్ మంచి బ్యాగ్రౌండ్ ఉన్న ఇంటి నుంచే ఇండస్ట్రీకి వచ్చాడు. సెటిల్డ్ ఫర్మామెన్స్ కూడా ఇవ్వగలడు. స్టోరీ సెలక్సన్ కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. ఇప్పుడు వచ్చిన సుందరకాండ మూవీకి కూడా మంచి సెలక్షనే. కానీ, ఏం చేస్తాం… మూవీ భారీ డిజాస్టర్ అయి కూర్చుంది. ఈ హీరోను నమ్మిన నిర్మాతలకు దాదాపు 5.5 కోట్ల నికార నష్టం వచ్చిందట.
ఆ కథ ఏంటి ? సినిమాపై నిర్మాత పెట్టిన పెట్టుబడి ఎంత ? ఓటీటీ నుంచి వచ్చిందేంత ? థియేటర్స్ నుంచి వచ్చిన కలెక్షన్లు ఎంత ? మొత్తంగా ఈ సినిమా లెక్క ఎంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం…
ఇండస్ట్రీకి కాస్త గ్యాప్ ఇచ్చిన తర్వాత నారా రోహిత్ ఈ మధ్య వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. ప్రతినిధి 2 తో రీ ఎంట్రీ ఇచ్చిన నారా రోహిత్ ఈ 2025 ఒక్క ఏడాదిలోనే భరవంతో పాటు లెటెస్ట్‌గా రిలీజ్ అయన సుందరకాండ మూవీ చేశాడు. ఈ మూవీ ఆగష్టు 27న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయింది.
ఫస్ట్ డే 50 లక్షలు కూడా రాలే ?
మొదటి షోకు ఈ మూవీకి డిసెంట్ టాక్ వచ్చింది. కుటుంబంతో చూడాల్సిన మంచి ఎంటర్‌టైనర్ అంటూ కొంత మంది రివ్యూలు ఇచ్చారు. మరికొంత మంది నుంచి నెగిటివ్ టాక్, నెగిటివ్ రివ్యూలే వచ్చాయి. ఏది ఏమైనా… ఫైనల్‌గా నారా రోహిత్ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది అనే అనుకోవచ్చు.
టాక్ వరకు ఇలా ఉంటే.. ఆ మూవీకి ఫస్ట్ డే అన్నీ ఏరియాల్లో కలుపుకుని 50 లక్షల నెట్ కలెక్షన్లు కూడా రాలేదట. అర కోటి కూడా సంపాదించలేదు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
బడ్జెట్ లెక్కలు…
నారా రోహిత్ సుందరకాండ మూవీని సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్‌పై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మించారు. ఈ సినిమా నిర్మాణానికి దాదాపు 12 కోట్లు ఖర్చు అయినట్టు తెలుస్తుంది. ప్రమోషన్స్ కోసం మరో కోటి రూపాయల వరకు ఖర్చు చేశారు. అంటే సినిమాకు ఓటీటీ, థియేటర్ నుంచి 13 కోట్లకుపైగా రావాలి.
ఇప్పటి వరకు కలెక్షన్లు..
ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్లు అన్నీ ఏరియాల్లో కలుపుకుని 2 కోట్ల 36 లక్షల నెట్ కలెక్షన్లే వచ్చాయట. ఆరు రోజుల్లో కలెక్షన్లు ఇంత తక్కువ వచ్చాయంటే, ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎంత బలహీనంగా ఉందో అర్థమవుతుంది.
నిర్మాతకు 5.5 కోట్ల నష్టం ?
ఈ సినిమాను ఓటీటీ డీల్ హాట్‌స్టార్‌తో చేసుకున్నారు. ఆ డీల్‌తో నిర్మాతలకు దాదాపు 7 కోట్లు వచ్చాయట. అంటే ఇప్పుడు నిర్మాతకు థియేటర్ రన్ నుంచి 6 కోట్లు రావాలి. ఇప్పుడు 6 రోజుల్లో 2.36 కోట్ల వచ్చాయి.
ఈ 2.36 కోట్ల కలెక్షన్లలో నిర్మాతకు వచ్చే షేర్ 20 శాతం. అంటే నిర్మాత చేతికి వచ్చేది కాస్త అటు ఇటుగా.. 50 లక్షలు. నిర్మాత సేఫ్ అవ్వాలంటే, 6 కోట్లు థియేటర్ నుంచి రావాలి. ఇప్పుడు కేవలం 50 లక్షలు మాత్రమే వచ్చాయి. అంటే ఇప్పుడు సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్‌కు వచ్చిన 5.5 కోట్ల నికార నష్టం వచ్చిందని తెలుస్తుంది.