BigTV English

Dangerous App’s: అలర్ట్.. ఈ యాప్ మీ ఫోన్‌లో ఉందా..? అయితే వెంటనే డిలీట్ చేసేయండి.. ప్రభుత్వం హెచ్చరిక!

Dangerous App’s: అలర్ట్.. ఈ యాప్ మీ ఫోన్‌లో ఉందా..? అయితే వెంటనే డిలీట్ చేసేయండి.. ప్రభుత్వం హెచ్చరిక!

Indian Government Warned to Android & IOS Users Regarding this App: ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్ స్కామ్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు సైబర్ నేరగాళ్లు తరచూ డబ్బు కొట్టేయాలనే పనిలోనే ఉంటున్నారు. సామాన్యులు, ప్రముఖులు అని తేడా లేకుండా ఒక్క మెసెజ్ క్లిక్‌తో వారి ఖాతాలోని డబ్బును ఈజీగా లూటీ చేస్తున్నారు. అయితే ఇలాంటి ఘటనలు ఇప్పటికి చాలానే జరిగాయి.


గత ఏడాది చివర్లో ప్రభుత్వ వాస్తవ తనిఖీ విభాగం (PIB ఫాక్ట్ చెక్) నకిలీ SMS స్కామ్ గురించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులందరినీ హెచ్చరించిన విషయం తెలిసిందే. మీరు SMSలో ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా మీ పాన్ కార్డ్‌ని అప్‌డేట్ చేయకపోతే, మీ SBI YONO ఖాతా బ్లాక్ చేయబడుతుందని గతంలో ఓ మెసెజ్ వచ్చింది.

అయితే ఈ SMS SBI బ్యాంక్ ద్వారా పంపబడినట్లు చాలామంది అనుకున్నారు. కానీ అది SBI బ్యాంక్ నుంచి రాలేదని.. అది నకిలీ మెసెజ్ అని తెలియడంతో అంతా షాక్ అయ్యారు. అయితే ఫోన్లలో ప్రమాదరకమైన యాప్‌లను డౌన్‌లోడ్ చేయడం వల్లనే ఇలాంటి మెసెజ్‌లు వస్తాయని భారత ప్రభుత్వం హెచ్చరించింది.


Also Read: ఈ పది నెంబర్ల నుంచి వచ్చిన ఫోన్లు ఎత్తారా.. మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీనే!

అయితే మరోసారి భారత ప్రభుత్వం ప్రమాదకరమైన యాప్‌ల గురించి ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులను హెచ్చరించింది. ప్రజల బ్యాంకు ఖాతాల నుండి డబ్బును దొంగిలించే యాప్‌లు ఉన్నాయని.. ఈ యాప్‌ల గురించిన సమాచారం భారత ప్రభుత్వంలోని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న సైబర్ సెక్యూరిటీ అవగాహన ప్లాట్‌ఫామ్ ‘సైబర్ దోస్త్’లో అందించబడిందని తెలిపింది.

ఈ మేరకు ‘సైబర్ దోస్త్’ ట్వీట్ చేసింది. అందులో యూనియన్ బ్యాంక్‌కి సంబంధించిన నకిలీ యాప్‌ల పట్ల జాగ్రత్త వహించాలని భారత ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది. ఈ నకిలీ యాప్ పేరు ‘Union-Rewards.apk.’ అని తెలిపింది. ఈ యాప్ నిజమైన యూనియన్ బ్యాంక్ యాప్‌లా ఉంటుంది.

Also Read: Smriti Irani comment: బావ కన్నేశాడు, ఆయన పరిస్థితి ఏంటి?

ఈ యాప్ బహుమతులు ఇచ్చేలా ప్రజలను మోసగిస్తుందని తెలిపింది. భారత ప్రభుత్వానికి చెందిన సైబర్ సెక్యూరిటీ ఖాతా అయిన సైబర్‌డోస్త్ ఫేక్ యాప్‌ల పట్ల జాగ్రత్త వహించాలని ప్రజలను హెచ్చరించింది. అంతేకాకుండా ఫేక్ స్టాక్ ట్రేడింగ్ యాప్‌లు ప్రజలను ఎక్కువగా మోసం చేయడం ఆందోళన కలిగిస్తోంది.

ఈ యాప్‌ల వల్ల దేశవ్యాప్తంగా ఎంతో మంది అమాయకులు లక్షల రూపాయల మేర నష్టపోయారు. అటువంటి ఫేక్ స్టాక్ ట్రేడింగ్ యాప్ ‘గ్రూప్-ఎస్’ గురించి భారత ప్రభుత్వ సైబర్ సెల్ ఐఫోన్ వినియోగదారులను హెచ్చరించింది. ఈ యాప్ మీ డబ్బును లూటీ చేస్తుందని హెచ్చరించింది.

Tags

Related News

Personal Finance: 45 సంవత్సరాలకే రిటైరయ్యి పెన్షన్ పొందుతూ లైఫ్ హాయిగా గడపాలని ఉందా..అయితే ఇలా ప్లాన్ చేసుకోండి..

Central Govt Scheme: విదేశాల్లో చదవాలని ఉందా… అయితే కేంద్ర ప్రభుత్వం అందించే రూ. 40 లక్షల లోన్ కోసం ఇలా అప్లై చేసుకోండి.

Mobile Recharge: ఎయిర్ టెల్ లోని ఈ ఆఫర్ తో రీచార్జ్ చేస్తే Netflix, Prime Video, Zee5, JioHotstar ఫ్రీగా చూసే ఛాన్స్..

Real Estate: రెంటల్ అగ్రిమెంట్ 11 నెలలు మాత్రమే ఎందుకు చేయించుకుంటారు..దీని వెనుక ఉన్న అసలు మతలబు ఇదే..

Real Estate: క్లియర్ టైటిల్ ల్యాండ్ కొనాలి అంటే తప్పనిసరిగా చూడాల్సిన డాక్యుమెంట్స్ ఇవే…లేకపోతే భారీ నష్టం తప్పదు..

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Big Stories

×