BigTV English

Supreme Court: సుప్రీం సంచలన తీర్పు.. 30 వారాల గర్భవిచ్ఛితికి అనుమతి..!

Supreme Court: సుప్రీం సంచలన తీర్పు.. 30 వారాల గర్భవిచ్ఛితికి అనుమతి..!

Supreme Court Allows Medical Termination of 30 Weeks Pregnancy: సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక కేసులో ప్రధాన న్యాయమూర్తి డీ వై చంద్రచూడ్, జే బీ పార్థీవాలాతో కూడిప ధర్మాసనం అసాధారణ తీర్పిచ్చింది. 30 వారాల గర్భాన్ని విచ్ఛితికి అనుమతినిచ్చింది.


భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీం ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఈ నెల 4న బొంబై హైకోర్టు గర్భ విచ్ఛితికి నిరాకరిస్తూ తీర్పును వెలువరించింది. దీంతో బాలిక తల్లి సుప్రీంను ఆశ్రయించింది. కాగా బాలిక మానసిక, శారీరక శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఈ తీర్పును ఇస్తున్నట్లు సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

కాగా ఈ కేసులో సుప్రీం కోర్టు ఏప్రిల్ 19న ముంబై సియోన్ హాస్పిటల్‌ మెడికల్ బోర్డును గర్భ విచ్ఛితికి సంభందించి నివేదిక కోరింది. కాగా ప్రస్తుత బాలిక వయస్సు దృష్టిలో ఉంచుకుని తన గర్భాన్ని తొలగించాలని.. లేకపోతే తన మానసిక, శారీరక శ్రేయస్సుపై ప్రభావం పడుతుందని మెడికల్ బోర్డు అభిప్రాయపడ్డట్టు సుప్రీం ధర్మాసనం తెలిపింది. డెలివరీ కంటే గర్భ విచ్ఛితి ప్రమాదం కాదని బెంచ్ పేర్కొంది. మైనర్ బాలిక గర్భనాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఇక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని సియోన్ ఆసుపత్రి డీన్‌ను కోరింది. ఈ విషయంలో తన ఉత్తర్వులను రిజర్వ్ చేసిన ధర్మాసనం ప్రభుత్వ ఖర్చులతో గర్భ విచ్చితి జరగాలని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.


Also Read: కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల అనర్హత కేసు.. స్టేకు సుప్రీం నో!

లైంగిక వేధింపులకు గురైన మైనర్ బాలిక గర్భాన్ని దాల్చిన ఘటనలో మార్చి 20, 2024న నవీ ముంబైలో ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. కాగా మెడికల్ మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం కింద నిర్దేశించిన 24 వారాల పరిమితికి మించి ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు కోర్టు గుర్తించింది. కాగా ఈ చట్టం కింద గర్భ విచ్ఛితిపై కేవలం 24 వారాల పరిమితి మాత్రమే ఉంటుంది. కొన్ని అసాధారణ పరిస్థితులో మాత్రమే 24 వారాల పైబడి గర్భాల టెర్మినేషన్‌కు పర్మిషన్ ఇస్తుంది.

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×