BigTV English

Bride Kidnap Attempt: సినిమా స్టయిల్‌లో కారం చల్లి.. పెళ్లి కూతురు కిడ్నాప్‌కు యత్నం.. అక్కడే అసలు ట్విస్ట్ బాబు!

Bride Kidnap Attempt: సినిమా స్టయిల్‌లో కారం చల్లి.. పెళ్లి కూతురు కిడ్నాప్‌కు యత్నం.. అక్కడే అసలు ట్విస్ట్ బాబు!

Parents Tried to Kidnap Their Daughter in Filmy Style on Her Marriage: కాసేపట్లో పెళ్లి.. బంధుమిత్రులు, మంగళ వాయిద్యాలతో మ్యారేజ్ ఫంక్షన్ కలకలలాడుతోంది. సడన్‌గా కారం చల్లుతూ ఫంక్షన్ హాలులోకి ఎంట్రీ ఇచ్చారు కొంతమంది వ్యక్తులు. ఈ క్రమంలో వరుడికి గాయాలయ్యాయి. అమ్మాయిని ఆమె బంధువులు తీసుకెళ్లడం జరిగిపోయింది. సినిమా స్టయిల్‌లో జరిగిన ఈ ఘటన రాజమండ్రిలోని కడియంలో జరిగింది.


తూర్పుగోదావరి జిల్లా కడియంలో ఈ ఘటన జరిగింది. కడియం గ్రామానికి చెందిన బత్తిన వెంకటనందు ఉమ్మడి గుంటూరు జిల్లా నరసరావుపేటలోని ఓ కళాశాలలో డిప్లొమా చదివాడు. అదే సమయంలో కర్నూలు జిల్లా చాలగమర్రి మండలం గొడిగనూరు గ్రామానికి చెందిన గంగవరం స్నేహ అక్కడే చదువు తోంది. నందు-స్నేహ మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారింది. చదువు తర్వాత మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కాకపోతే పెద్దలు ఏమంటారని భయం మాత్రం ఇరువురిని వెంటాడింది.

అనుకున్నట్లుగానే ఈనెల 13న విజయవాడలోని దుర్గగుడిలో పెళ్లి చేసుకున్నారు నందు-స్నేహ. అనంతరం కడియం వచ్చిన వెంకటనందు ఇంట్లో పెద్దలకు చెప్పడం, వాళ్లు అంగీకరించడం చకచకా జరిగిపోయింది. బంధువుల సమక్షంలో మరోసారి వివాహం చేసుకునేందుకు ఈనెల 21న ఆదివారం ముహూర్తం పెట్టుకున్నారు. ఇదే విషయాన్ని వధువు తన పేరెంట్స్‌కి తెలిపింది. అందుకు సంబంధించి అడ్రస్ కూడా ఇచ్చింది.


Also Read: 38 మందితో కాంగ్రెస్ జాబితా విడుదల..

కడియంలోని ఓ ఫంక్షన్ హాలులో ఆదివారం ఎర్లీ మార్నింగ్ వివాహం జరుగుతోంది. వధువు తరపు బంధువులు అక్కడికి చేరుకుని పెళ్లికొడుకు, వాళ్ల బంధువులపై కారం చల్లారు. స్నేహను అపహరించేందు కు ప్రయత్నించారు. దీంతో పెళ్లికొడుకు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో నందు బంధువులకు తీవ్రగాయాలయ్యాయి. అక్కడి నుంచి పెళ్లికూతుర్ని తీసుకొని వెళ్లిపోయారు వాళ్ల బంధువులు. ఈ ఘటనపై బత్తిన ఫ్యామిలీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

Tags

Related News

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Big Stories

×