BigTV English

Mahindra 5 Door Thar Top Features: మహీంద్రా థార్ రోక్స్.. ఆగస్టు 15న లాంచ్.. టాప్ ఫీచర్లు ఇవే!

Mahindra 5 Door Thar Top Features: మహీంద్రా థార్ రోక్స్.. ఆగస్టు 15న లాంచ్.. టాప్ ఫీచర్లు ఇవే!

Mahindra 5 Door Thar Top Features: ఆటోమొబైల్ మార్కెట్‌లో ఆఫ్ రోడింగ్ ఎస్‌యూవీలకు ఫుల్ క్రేజ్ ఉంది. ఈ జాబితాలో మహీంద్రా థార్ కూడా ఒకటి. ఈ క్రమంలోనే కంపెనీ థార్ 5  డోర్ వేరియంట్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ రాబోయే కొత్త వేరియంట్ పేరు థార్ రోక్స్. కంపెనీ దీని లాంచ్ తేదీని కూడా ప్రకటించింది. ఇది ఆగస్టు 15న విడుదల కానుంది. ఇప్పటికే కంపెనీ దీనికి సంబంధించిన టీజర్ విడుదల చేసింది.


ఈ టీజర్ మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టించింది. 5 డోర్ల థార్‌ను 3 డోర్ల థార్‌తో పోల్చినట్లయితే.. అది పొడవాటి వీల్ బేస్, ఇంటీరియర్‌ని కలిగి ఉంటుంది. అలానే ఈ కొత్త 5 డోర్ల థార్‌లో లేటెస్ట్ ఫీచర్లు ఉంటాయి. ఇవి చాలా అప్‌డేటెడ్‌గా ఉంటాయి. అయితే ఇప్పుడు 5 డోర్ మహీంద్రా థార్ టాప్ ఫీచర్లు, పవర్‌ట్రెయిన్, ధర గురించి వివరంగా తెలుసుకుందాం.

ఎస్‌యూవీ డ్యూయల్ స్క్రీన్ సెటప్‌తో వస్తుంది. డ్యూయల్ స్క్రీన్ సెటప్ కస్టమర్లకు బాగా అట్రాక్ట్ చేస్తోంది. అటువంటి పరిస్థితిలో కంపెనీ రాబోయే మహీంద్రా రాక్స్ 5 డోర్‌లో కూడా వినియోగదారులకు డ్యూయల్ స్క్రీన్ సెటప్‌ను అందించబోతోంది. కస్టమర్‌లు SUV లోపలి భాగంలో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ చూస్తారు. ఇది మీకు లేటెస్ట్ కనెక్టివిటీ, చాలా ఎంటర్‌టైన్మెంట్ ఫీచర్లు అందిస్తోంది.


ఇది కాకుండా SUV 10.25 అంగుళాల ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను సపోర్ట్ చేసే అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ కలిగి ఉంటుంది. మహీంద్రా రాక్స్‌లో ఇటీవలే పనోరమిక్ సన్‌రూఫ్‌ కూడా తీసుకొచ్చారు. కంపెనీ తన లేటెస్ట్ లాంచ్ మహీంద్రా XUV 3X0 లో మొదటిసారిగా ఈ సెక్షన్‌లో కనిపించింది. అటువంటి పరిస్థితిలో రాబోయే మహీంద్రా రాక్స్ 5-డోర్‌లో కూడా కస్టమర్‌లు పనోరమిక్ సన్‌రూఫ్‌ను పొందవచ్చు. అయితే తాజాగా లీకైన ఫోటోలు దీన్ని నిర్ధారించాయి.

Also Read: New Renault Duster Launched: కొత్త డస్టర్ లాంచ్.. పిచ్చెక్కిస్తున్న ఫీచర్లు!

5 డోర్ల థార్ అడాస్ ఉంటుంది. మరోవైపు రాబోయే మహీంద్రా థార్ రాక్స్‌లో కస్టమర్‌లు లెవల్ 2 అడాస్ టెక్నాలజీని చూస్తారు. ఇంతకుముందు కంపెనీ మహీంద్రా XUV 3X0 లో అధునాతన డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్‌ను కూడా అందించింది.  ప్రస్తుతం SUVలో 360-డిగ్రీ కెమెరా అందుబాటులో ఉంటుంది. సేఫ్టీ పరంగా ఇప్పుడు వస్తున్న అన్ని కార్లలో కంపెనీలు  360-డిగ్రీ కెమెరాల వంటి ఫీచర్లను అందిస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో రాబోయే మహీంద్రా థార్ రాక్స్‌లో కస్టమర్‌లు 360-డిగ్రీ కెమెరానును చూసే అవకాశం ఉంది.

Related News

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Jio Offers: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?

Big Stories

×