BigTV English

Facts about Warren Buffett: స్టాక్ మార్కెట్ కింగ్ వారెన్ బఫెట్ జీవిత సత్యాలు..

Facts about Warren Buffett: స్టాక్ మార్కెట్ కింగ్ వారెన్ బఫెట్ జీవిత సత్యాలు..

warren buffett success story


Warren Buffett Success Story: వారెన్ బఫెట్.. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. ప్రపంచంలోని టాప్ 10 ధనవంతుల్లో ఈయన ఒకరు. అంతేకాదు బఫెట్ ని ఇన్వెస్ట్ మెంట్ అని కూడా అంటారు. అమెరికాలో ఈయన ఏ కంపెనీ షేర్లైనా కొనుగోలు చేస్తే .. అందులోని మిగతా షేర్లు కొనుగోలు చేయడానికి ప్రజలు ఎగబడతారు. ఈయన పెట్టుబడులు, ఆలోచన విధానంపై వారికి అంత నమ్మకం.

బర్క్ షైర్ అనే దుస్తులు కంపెనీ నష్టాల్లో ఉన్నప్పుడు కొనుగోలు చేసి ఇప్పుడు దాన్ని షేర్స్ కొనే అతి పెద్ద కంపెనీగా మార్చచారు. బఫెట్ ఓటమిని అంగీకరించరు అనడానికి నిదర్సనం ఇది. ఆయనలాగా పెట్టుబడులు పెట్టి జీవితంలో స్థిరపడాలని తన వినూత్న ఆలోచనలతో ప్రభావితం చేశారు. ముఖ్యంగా బఫెట్ మూడు విషయాలను నమ్మి పెట్టుబడులు పెడతానని చెబుతుంచటారు. చదువుకునే రోజుల్లో వారెన్ బఫెట్ పోస్ట్ పేపర్ బాయ్ గా పని చేసి అదే కంపెనీలో షేర్లు కొనే స్థాయికి ఎదగారు. కేవలం పెట్టుబడులతోనే వేల కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఆయన నమ్మిన సూత్రాలేంటో ఇప్పుడు తెలుసుకుందా…


ఆయన నమ్మిన మూడు సూత్రాలు.

మొదటిది:  ఏదైనా కంపెనీ యాజమాన్యాన్ని, అందులోని వ్యక్తులను నమ్మి కాదు అందులో ఉత్పత్తి అయ్యే వస్తువును చూసి పెట్టుబడి పెట్టాలి. జిలెట్ షేవింగ్ బ్లేడ్స్ కంపెనీలో ఆయన పెట్టుబడి పెట్టారు. చాలా మంది అది లాభాల్లో ఉంది కాబట్టి పెట్టారా అని ప్రశ్నించగా.. పురుషులకు గడ్డం ఉన్నంత కాలం బ్లేడ్ తో పని ఉంటుందని నమ్మాను కాబట్టి పెట్టుబడి పెట్టానని సమాధానం ఇచ్చారు.

Also Read: 4 నెలల మనవడికి రూ.240 కోట్ల విలువైన షేర్లు.. నారాయణమూర్తి గిఫ్ట్..

రెండవది: పెట్టుబటులు పెట్టేటప్పుడు ఎమోషన్స్ ని పక్కన పెట్టాలి. ఆయనకు ఎంతో సన్నిహితంగా ఉన్న వాషింగ్టన్ పోస్ట్ అమ్మకానికి వచ్చినప్పుడు ఆయన దాన్ని కొనుగోలు చేయలేదు. ఎమోషన్ కారణంగా ఆయన దాన్ని కొనుగోలు చేస్తే సరైనది కాదని.. ఫ్యూచర్ లో న్యూస్ పేపర్ కి ప్రాచుర్యం తగ్గుతుందని లాజిక్ తో దాన్ని కొనుగోలు చేయలేదని చెప్పారు.

మూడోవది : వేల కోట్ల ఆస్తి ఉన్నా ఆయన తనకు ఎంత అవసరమో అంతే ఇంట్లో  నివసిస్తున్నారు. ఎవరైనా అడిగితే అవసరానికి మించి ఏంచేయడానికని సమాధానం చెబుతారు. దీనికి అర్ధం ఖర్చు తగ్గించు అని.

సాధారణంగా అందరూ జీతం రాగానే ముందు ఖర్చులన్ని అయ్యాక మిగిలిన దాంట్లో నుంచి కాస్తో కూస్తో .. దాచుకుంటారు. దీన్ని ఆయన పూర్తిగా వ్యతిరేకించారు. ముందు జీతం రాగానే ప్రతినెల కొంత మొత్తం అందులోంచి దాచి .. ఆ తర్వాత ఖర్చు పెట్టాలని సూచిస్తుంటారు. పెట్టుబడులు పెట్టేవారు ముందుగా ఇన్వెస్ట్ చేసే కంపెనీ గురించి పూర్తిగా పరిశోధించాలి. ఆ తర్వాతే పెట్టుబడిలోకి దిగాలి. అంతే కాకుండా మార్కెట్ లోని వివిధ కంపెనీల మీద దృష్టి పెట్టాలి. నిత్యం వాటి పనితీరు, వస్తు సేవలను పరిశీలిస్తూ ఉండాలని చెప్పారు.

Also Read: Rs 30,000 Discount on Hyundai Venue: హ్యుందాయ్ హోలీ సేల్.. ఆ క్రేజీ కారుపై ఏకంగా రూ. 30,000 డిస్కౌంట్

ప్రతి ఒక్కరికి కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ముఖ్యం అని చిన్నతనంలో ఆయన ఎదుర్కొన్న పరిస్థితుల ఆధారంగా చెబుతుంటారు. యువత ముందుగా దీన్ని అభివృద్ధి చేసుకుంటే చాలా మేలు జరుగుతుందని అంటారు. అలాగే డబ్బు కన్నా కీర్తి చాలా ముఖ్యం అని పదే పదే చెబుతుంటారు. అందులో ముఖ్యంగా మీడియాకు ఆచి తూచి సమాధానాలు ఇవ్వాలని తమ కంపెనీలో ఉద్యోగులకు చెబుతుంటారు. ఎందుకంటే కీర్తి పోతే దాంతో పాటే డబ్బూ పోతుందని ఆయన భావన.

Related News

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

D-Mart: కొనేది తక్కువ, దొంగతనాలు ఎక్కువ.. డి-మార్ట్ యాజమాన్యానికి కొత్త తలనొప్పి!

JIO Super Plans: జియో నుంచి సూపర్ ఆఫర్లు.. ఏది ఫ్రీ, ఏది బెస్ట్ అంటే?

SEBI – Foreign Funds: భారతీయ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. విదేశీ ఫండ్స్‌కి SEBI గ్రీన్ సిగ్నల్

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Big Stories

×