BigTV English

Holi Discount on Hyundai Venue: హ్యుందాయ్ హోలీ సేల్.. ఆ క్రేజీ కారుపై ఏకంగా రూ. 30,000 డిస్కౌంట్!

Holi Discount on Hyundai Venue: హ్యుందాయ్ హోలీ సేల్.. ఆ క్రేజీ కారుపై ఏకంగా రూ. 30,000 డిస్కౌంట్!
Hyundai Cars
Hyundai Cars

Get Rs 30,000 Instant Discount on Hyundai Venue on Holi Sale: ప్రస్తుత కాలంలో కార్ల వినియోగం బాగా పెరిగింది. మిడిల్ ‌క్లాస్ ప్రజలు కూడా కార్లను కొనుగోలు చేస్తున్నారు. ప్రతి ఇంట్లో కూడా కారు కామన్‌గా ఉంటుంది. ఇంట్లో ఇద్దరు ఉంటే రెండేసి కార్లు కూడా తీసుకుంటున్నారు. కార్ల తయారీ కంపెనీలు కూడా ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకుంటున్నాయి. మిడిల్ క్లాస్ ప్రజలను టార్గెట్ చేస్తూ.. తక్కువ ధరతో కార్లను మార్కెట్‌లోకి తీసుకొస్తాయి. పండగలు, పబ్బాలు వచ్చినప్పుడల్లా భారీ ఆఫర్లు ప్రకటించి సేల్స్ పెంచుకుంటున్నాయి.


ఈ నేపథ్యంలో రానున్న హోలీ పండుగను క్యాష్ చేసుకొనే ప్రయత్నం చేస్తున్నాయి కార్ల తయారీ కంపెనీలు. తాజాగా ప్రముఖ కార్ల కంపెనీ హ్యుందాయ్ హోలీ సందర్భంగా అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. ఎస్‌యూవీ కార్ల తయారీలో కంపెనీ అగ్రస్థానంలో ఉంది. ఇప్పటి వరకు ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో లాంచ్ అయిన కార్లు మొత్తం వినియోగదారులను ఆకట్టుకున్నాయి. హ్యుందాయ్ కంపెనీ కార్లను డిమాండ్ ఉన్నప్పటికి సేల్స్ పెంచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్న వెల్లడించింది. ఏ యే కార్లపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో చూసేయండి.

Also Read: మన మిడిల్ క్లాస్‌కి బెస్ట్ బడ్జెట్ కార్స్.. ఫీచర్లు తగ్గేదేలే!


హ్యుందాయ్ నుంచి మార్కెట్‌లోకి వచ్చిన వెన్యూ కాంపాక్ట్ ఎస్ యూవీకి ఫుల్ క్రేజ్ ఉంది. ఇందులో పెట్రోల్, డీజిల్ రెండు వేరియంట్లు ఉన్నాయి. పవర్‌ఫుల్1197 సీసీ ఇంజిన్ తో పనిచేస్తుంది. పెట్రోల్ వేరియంట్ 61 బీహెచ్ పీ పవర్, 113.8 ఎన్‌ఎం టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. దీనిలో5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంది. డీజిల్ వేరియంట్‌లో 84.6 బీహెచ్ పీ పవర్ 250 ఎన్ ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 6 స్పీడ్ గేర్ బాక్స్‌ ఉంటుంది. డైనమిక్ డిజైన్‌తో ఆకట్టుకునే ఈ కారు ప్రారంభ ధర. రూ.7.62 లక్షలు. అయితే హోలీ సందర్బంగా వెన్యూపై రూ.20,000 క్యాష్ డిస్కౌంట్, 10,000 ఎక్చేంజ్ బోనస్ అందిస్తుంది హ్యుందాయ్. మొత్తంగా రూ.30,000వరకు ప్రైజ్ తగ్గుతుంది.

హ్యుందాయ్ కంపెనీకి చెందిన ఆరా మోడల్‌కు మార్కెట్‌లో ఫుల్ డిమాండ్ ఉంది. ఈ కారు లుక్ చాలా అట్రాక్ట్‌గా ఉంటుంది. ఆరా 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌లో 82 బీహెచ్ పీ పవర్, 114 ఎన్ ఎం టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. ఇందులో 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంది. ఆరా ఆరు కలర్స్‌లో లభిస్తుంది.
దీని ప్రారంభ ధర రూ. రూ.6.49 లక్షలు. హోలీ సందర్భంగా ఈ కారు పెట్రోల్ వెర్షన్ పై రూ.5,000 తగ్గింపు, ఎక్చేంజ్ బోనస్ కింద రూ.10,000, కార్పొరేట్ తగ్గింపుగా రూ.5,000 డిస్కౌంట్ ప్రకటించారు. ఆరా సీఎన్ జీ పై రూ.20,000 తగ్గింపు ఉంది. అలానే రూ.10,000 ఎక్చేంజ్ బోనస్, రూ.3,000 కార్పొరేట్ తగ్గింపుపై లభిస్తుంది.

Also Read: స్టాక్ మార్కెట్ కింగ్ జీవిత సత్యాలు..

అయితే ఈ ఆఫర్ మార్చి 31 వరకు ఉంటుంది. అంతేకాకుండా ఈ డిస్కౌంట్లు లోకేషన్‌ను బట్టి మారుతాయి. కాబట్టి కారు కొనాలనుకునే వారు దగ్గరలోని షోరూం‌లో రేట్ల వివరాలు తెలుసుకోండి. మార్కెట్‌లో లభించే మిడ్ రేంజ్ కార్లలో ఇప్పటికే హ్యుందాయ్ క్రెటాకు మంచి సేల్స్ ఉన్నాయి. ఈ ఆఫర్ల కారణంగా హ్యుందాయ్ లాభాలు పెరుగుతాయని మార్కెట్ వర్గాల అభిప్రాయం.

Related News

SEBI – Foreign Funds: భారతీయ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. విదేశీ ఫండ్స్‌కి SEBI గ్రీన్ సిగ్నల్

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Big Stories

×