BigTV English

PM Modi Car Collection: భారత ప్రధానిగా మోదీ ఉపయోగించే కార్లు ఇవే.. ఫీచర్లు తెలిస్తే గూగుల్‌లో వెతికేస్తారు!

PM Modi Car Collection: భారత ప్రధానిగా మోదీ ఉపయోగించే కార్లు ఇవే.. ఫీచర్లు తెలిస్తే గూగుల్‌లో వెతికేస్తారు!

PM Modi Car Collection: భారతదేశంలో ప్రధాని భద్రత చాలా ముఖ్యం. సాధారణ కార్లకు బదులుగా వారికి చాలా ప్రత్యేకమైన PM ఆర్మర్డ్ కార్లను ఉపయోగిస్తారు. దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనితో మోదీ భద్రతకు ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన కార్లను ఆయన కలెక్షన్స్‌లో జోడించనున్నారు. ప్రధాని మోదీ భద్రత కోసం ఎటువంటి కార్లను ఉపయోగిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.


Range Rover Sentinel
PM ఎక్కువగా రేంజ్ రోవర్ సెంటినల్‌ను ఉపయోగిస్తారు. ఈ SUVని టాటా యాజమాన్యంలోని బ్రిటిష్ వాహన కంపెనీ అందిస్తోంది. భద్రత దృష్ట్యా ఇందులో పలు కీలక మార్పులు చేశారు. టైర్ పంక్చర్ అయిన తర్వాత కూడా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో 50 కిలోమీటర్ల వరకు నడపవచ్చు. ఇది ఐదు లీటర్ సూపర్ఛార్జ్‌డ్ V8 ఇంజన్ కలిగి ఉంది. ఇది దాదాపు 375 హార్స్ పవర్‌ని రిలీజ్ చేస్తుంది . ఇది కేవలం 10.4 సెకన్లలో 0-100 kmph స్పీడ్ అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 193 కిలోమీటర్ల వరకు ఉంటుంది. సమాచారం ప్రకారం ఈ SUV ధర దాదాపు రూ.10 కోట్లు.

Toyota Land Cruiser
PM మోడీ కార్ కలెక్షన్‌లో టయోటా ల్యాండ్ క్రూయిజర్ వంటి పవర్‌ఫుల్ SUV ఉంది. ఇది చాలా పవర్‌ఫుల్ ఇంజన్, బాడీతో వస్తుంది. అయితే PM భద్రత కారణంగా దీనిలో అనేక మార్పులు చేయబడ్డాయి. ఇందులో ప్రత్యేక రకమైన రక్షణ కవచం ఉంటుంది. కారులో 4.5 లీటర్ కెపాసిటి గల ఇంజన్ ఉంది. ఇది 260 హార్స్ పవర్, 650 న్యూటన్ మీటర్ టార్క్ రిలీజ్ చేస్తుంది.


Also Read: Rs 1.35 Lakhs Discounts On Tata EVs In June: లక్షకు పైగా డిస్కౌంట్స్.. టాటా ఆఫర్లు భలే ముద్దొస్తున్నాయ్..!

Mercedes-Benz Maybach S 650
జర్మన్ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ అందించే మేబ్యాక్ S650 కూడా ప్రధాని భద్రత కోసం ప్రత్యేకంగా రూపొందించారు. 2021లో రష్యా అధ్యక్షుడిని కలవడానికి వెళ్తున్నప్పుడు ప్రధాని మోదీ ఈ కారులో కనిపించారు. ఈ కారు ఆరు లీటర్ ట్విన్ టర్బో ఇంజన్‌తో వస్తుంది. ఇది 630 హార్స్ పవర్ ఇస్తుంది. ఇది అత్యుత్తమ భద్రతా అప్‌గ్రేడ్‌లతో కంపెనీ అప్‌గ్రేడ్ చేసింది. సమాచారం ప్రకారం దీని భద్రత VR-10 స్థాయిని కలిగి ఉంది. ఇది ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా నిలిచింది. సమాచారం ప్రకారం దీని ధర దాదాపు రూ.12 కోట్లు.

BMW 7 Series
మెర్సిడెస్‌తో పాటు BMW నుండి 7 సిరీస్ LI కూడా PM భద్రత కోసం అందుబాటులో ఉంది. 2001లో పార్లమెంట్‌పై దాడి జరిగిన తర్వాత ప్రధానికి రక్షణగా ఈ కారును తీసుకొచ్చారు. ఈ కారు 2002 నుండి అటల్ బిహారీ వాజ్‌పేయి, డాక్టర్ మన్మోహన్ సింగ్ సేవలో ఉంది. AK-47 బుల్లెట్లతో పాటు ఈ కారు గ్రెనేడ్ దాడి నుండి కూడా PMని రక్షించగలదు. దీనితో పాటు రసాయన ఆయుధాల నుండి రక్షించడానికి ఆక్సిజన్ ట్యాంక్‌ను కూడా ఏర్పాటు చేశారు. దాడి సమయంలో ఈ కారు పంక్చర్ అయినప్పటికీ చాలా కిలోమీటర్లు సులభంగా నడపవచ్చు.

Tags

Related News

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Big Stories

×