E-Paper
Advertisement

పారడైజ్‌లో బాబుమోహన్‌కు అవమానం? గెటప్ టెస్ట్ చేసి పక్కన పెట్టేశారా?

పారడైజ్‌లో బాబుమోహన్‌కు అవమానం? గెటప్ టెస్ట్ చేసి పక్కన పెట్టేశారా?
Advertisement

Babu Mohan:బాబుమోహన్.. పరిచయం అక్కరలేని పేరు.తనదైన కామెడీతో కోట్లాది ఆడియన్స్ ని అలరించిన ఈ క్రేజీ వెటరన్ కమెడియన్ ఇపుడు సినిమాలు తగ్గించిన సంగతి తెల్సిందే.అయితే వచ్చిన సినిమాలు కాదు నచ్చిన సినిమాలు అంటూ చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసుకుపోతున్న బాబు మోహన్ తాజాగా ప్యారడైజ్ మీద చేసిన కామెంట్స్ ఇపుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.

టెస్ట్ షూట్ కి మాత్రమే సరిపెట్టారు

Advertisement

ప్యారడైజ్ సినిమా గురించి మాట్లాడుతూ ఆ సినిమా కోసం తనని పిలిచి ఫోటో షూట్ చేశారని తెలిపాడు.ఇక గెటప్ వేశాక ఆహ, ఓహో అంటూ అద్భుతంగా ఉందని ఆకాశానికి ఎత్తేశారని అయితే కారణాలు ఏంటో తెలీదు కాని కేవలం తనని టెస్ట్ షూట్ కి మాత్రమే సరిపెట్టారని,సినిమా షూట్ కి మాత్రం తనని పిలవలేదని, ఆ రకంగా తనని అవమానించారని వాపోయాడు.

మరి నాకన్నా బెటర్ యాక్టర్ దొరుకుతాడని నన్ను వద్దన్నారా లేక నేను చేయలేననుకొని నన్ను పక్కన పెట్టారా లేక శని ఆ సినిమా వెంబడి పడి,ఆ సినిమా హిట్ అవ్వకూడదని రాసి పెట్టి ఉంది కాబట్టే లక్కీ హ్యాండ్ అయిన నన్ను ఆ సినిమాలో సెలెక్ట్ చేయకుండా ఉన్నారా తెలీదు అని చెప్పుకొచ్చారు.

Advertisement

తనని పెట్టి తీస్తే వంద రోజులు

తాను ఏ సినిమాలో ఉంటే ఆ సినిమా సూపర్ హిట్ అని,కాని ప్యారడైజ్ సినిమా ఒక్క రోజు మాత్రమే ఆడాలని ఉంది కాబట్టే తనని ఆ సినిమాలో సెలెక్ట్ చేసుకోలేదేమో అంటూ హాట్ కామెంట్స్ వదిలారు.ఇలాగే ఈవీవీ కూడా చెవిలో పువ్వు అనే సినిమా తను లేకుండా చేశాడని,కానీ సినిమా అట్టర్ ప్లాప్ అయిందని,అదే తర్వాతి సినిమా ప్రేమ ఖైదీ అనే సినిమా తనని పెట్టి తీస్తే వంద రోజులు ఆడిందని గుర్తు చేసుకున్నాడు .

సినీ జర్నీ గురించి మాట్లాడుతూ

ఇక ఈ సందర్భంగా తన సినీ జర్నీ గురించి మాట్లాడుతూ తాను చేసిన ప్రతి సినిమాలోనూ డిఫరెంట్ పాత్రలే చేశానని, ‘మామగారు’, ‘మాయలోడు’, ‘చిన్నరాయుడు’, ‘పెద్దరాయుడు’, ‘బావ బావమరిది’ వంటి సినిమాల్లో ఒక్కో పాత్ర ఒక్కో రకంగా ఉంటుందని గుర్తుచేసుకున్నాడు.ముఖ్యంగా ఒక సినిమాలో చేసినట్టుగా మరో సినిమాలో చేయకుండా ప్రతి క్యారెక్టర్‌కు ఒక స్పెషల్ బాడీ లాంగ్వేజ్, మాడ్యులేషన్, నటన ఉండేలా చూసుకున్నానని వివరించాడు.అలా తనకు దాదాపు 2,000 సినిమాల్లో నటించే అవకాశం రావడం దేవుడిచ్చిన వరమని చెప్పుకొచ్చాడు ఈ క్రేజీ కమెడియన్.

బాబు మోహన్ చెప్పినట్టుగా శ్రీకాంత్ ఓడెల దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో వచ్చిన ప్యారడైజ్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి తెల్సిందే.మొత్తంగా ప్యారడైజ్ సినిమా కోసం పిలిచి లుక్ టెస్ట్ చేసి తనని పిలకవడం వల్లే సినిమా పోయిందంటూ బాబు మోహన్ ఇన్ డైరెక్ట్ గా చేసిన కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి !

ALSO READ :ఒక్కో పాట ఒక్కో సెన్సేషన్.. సింగర్ కనకవ్వ టాప్ 5 ఫోక్ సాంగ్స్ ఇవే !

Tags

Related News

అలా బ్రతకడం కంటే విడాకులే బెటర్…డైరెక్టర్ సంచలన వ్యాక్యాలు!

కోట్లు విలువ చేసే ఇల్లు..అన్నా పిల్లలకు రాసిచ్చిన పవన్…ఎవరికి ఎంతంటే!

20 ఏళ్ల క్రితమే శ్రీరాముడిగా సల్మాన్ ఖాన్ మూవీ ప్రకటన.. మరెందుకు పట్టాలెక్కలేదు?

సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ప్రియా భవాని శంకర్!

రణవీర్ సింగ్ ఇంట్లో విషాదం.. అసలేం జరిగిందంటే?

నేడే ఘనంగా కావ్య – అనిరుధ్ పెళ్లి.. ప్రత్యేకతలు ఇవే!

విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ఆ మూవీ లేనట్టేనా..?

Big Stories

Advertisement
×