E-Paper
Advertisement

పోయిన చోట వెతుక్కోవడం.. ఫేమస్‌ అయిన పేరునే ఎంచుకోవడం! రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో నూతన ఒరవడి!

పోయిన చోట వెతుక్కోవడం.. ఫేమస్‌ అయిన పేరునే ఎంచుకోవడం! రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో నూతన ఒరవడి!
Advertisement

ఫేమ్‌ అయిన పాత పార్టీ పేరే కొత్త పార్టీగా అవతారం. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఈ ఒరవడి కనిపిస్తోంది. టీఆర్‌ఎస్‌ పార్టీగా తన పార్టీ పేరును డిక్లేర్‌ చేసిన కవిత కొత్త చర్చకు తెర తీయగా.. చిరంజీవి స్థాపించి, క్లోజ్‌ చేసిన ప్రజారాజ్యం పార్టీ.. పీఆర్పీ వచ్చేలా మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కొత్త పార్టీని ప్రకటించారు. అక్కడ కేసీఆర్‌ ఫ్యామిలీ ఇష్యూగా టీఆర్‌ఎస్‌ పార్టీ పేరు రాజకీయాల్లోచర్చకు తెరతీయగా, ఏపీలో చిరంజీవి తన రాజకీయ ఆరంగేట్రాన్ని పీఆర్‌పీ ద్వారా హైలెట్ చేసుకుని విస్తృతంగా ప్రచారం చేసుకున్న ఆ పేరునే కొత్త పార్టీగా వ్యూహాత్మకంగా విజయసాయిరెడ్డి ఎంచుకున్నారనే  చర్చ జరుగుతోంది.

పార్టీ పేరును ఓన్‌ చేసుకుంటే.. ఆ పాత పేరును కొత్త పార్టీగా ప్రకటించుకుంటే… అంతే ఊపు వస్తుందని కాదు. ఆ పేరు జనాల్లోకి తొందరగా వెళ్తుందని, రీచ్‌ బాగా ఉంటుందని, కొత్త పార్టీగా అడుగులు వేస్తున్న తరుణంలో ఆ పాత ఫేమ్‌ అయిన పేరు అయాచితంగా కలిసివస్తుందని. దాదాపుగా ఇదే ఉద్దేశ్యంతో ఈ పాత పేర్లను కొత్త పార్టీలుగా  ప్రకటించుకున్నారని భావిస్తున్నారు.

Advertisement

కానీ ఇక్కడ టీఆర్ఎస్‌ పార్టీ పేరును కవిత వ్యూహాత్మకంగా దక్కించుకున్నారు. ఇది ఓ రకంగా ఇప్పుడున్న బీఆరెస్‌కు.. దీనికి అధిష్టానంగా ఉన్న కేసీఆర్‌, కేటీఆర్‌కు రాజకీయంగా గట్టి దెబ్బలాంటిదే. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆరెస్‌)కి ఉద్యమ నేపథ్యం ఉంది. మలిదశ తెలంగాణ ఉద్యమ స్పూర్తితో ఇది పురుడుపోసుకున్నది. కేసీఆర్‌ ఆ పరిస్థితుల్లో తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయంగానే దీన్ని చూశారు. గుప్పెడు మందితో ఏర్పాటైన ఈ పార్టీ ఉంటుందా? ఊడుతుందా? అని అంతా ఎద్దేశా చేసేవారని కేసీఆరే స్వయంగా పలు వేదిక మీద చెప్పుకున్నారు.

తెలంగాణ రాష్ట్రం సాకారమైన తరువాత ..తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించింది. ఆ తరువాత కేసీఆర్‌ తన రాజకీయ కొంగొత్త ఆలోచనలకు అంకురార్పణ చేస్తూ వచ్చారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పే పేరుతో, థర్ట్ ఫ్రంట్ ను ముందేసుకుని .. టీఆరెస్‌ను బీఆరెస్‌గా మార్చేశారు. ఇక్కడ ఘోరంగా దెబ్బతిన్నారు కేసీఆర్‌.

Advertisement

తన పార్టీలోని తెలంగాణ అనే పేరునే లేకుండా చేసుకోవడం, రాష్ట్రాన్ని వదిలి దేశ రాజకీయాలకు వెళ్తానని ప్రకటించడంతో ప్రజలు బీఆర్‌ఎస్‌ను ఓడించారు. ఆ తదనంతర పరిణామాలు, కుటుంబ కలహాలతో కవిత బయటకు వచ్చేశారు. తండ్రి చేసిన తప్పిదాన్నే తన ఆయుధంగా మలుచుకునేందుకు వ్యూహాత్మకంగా తెలంగాణ రక్షణ సేన అని టీఆర్‌ఎస్‌ పేరు వచ్చేలా పార్టీ పేరు ప్రకటించుకున్నారు.

దీని కోసం ఇప్పుడు బీఆరెస్‌ పోరు చేస్తున్నది. ‘తూచ్… ఇది తొండి .. టీఆర్‌ఎస్‌ మాకే సొంతం.. ‘ అని ఇప్పుడు కేటీఆర్‌ గగ్గోలు పెడుతున్నాడు. ఆ పార్టీ పేరుతో జనం వద్దకు వెళ్లడం సులభమనే వ్యూహం ఒక భాగమైతే, ఆ పార్టీ స్థాపన వెనుక ఉన్న నేపథ్యం, చరిత్ర కూడా తనకు కలిసి వస్తుందని కవిత భావిస్తున్నారు.

అంతే కాదు.. టీఆర్‌ఎస్‌ పేరును తెరమరుగు చేసిన కేసీఆర్ తప్పిదాలను తాను చేయబోనని, సరిదిద్దుతానని ఆమె జనాలకు నేరుగానే చెబుతూ వస్తున్నారు. జనాల వద్ద ఆమె ఎంత మేర సక్సెసవుతారో భవిష్యత్ తేల్చనుంది. కానీ ఇప్పుడు ఆమె మాత్రం టీఆర్‌ఎస్‌ చీఫ్‌. అక్కడే ఆమె సగం విజయం సాధించినట్టుగా ఆ పార్టీ వర్గీయులు చెప్పుకుంటున్నారు.

ఇక విజయసాయిరెడ్డి కూడా చిరంజీవి పార్టీ పీఆర్‌పీ పేరే వచ్చేలా .. పరివర్తన రాజనీతి పార్టీ.. అని ఎంచుకోవడం వ్యూహాత్మకమే అనుకోవాలి. వాస్తవానికి, పరివర్తన రాజనీతి.. ఈ రెండు పదాలు పొంతన లేకుండా ఉన్నాయనే అభిప్రాయాలు వస్తున్నాయి. పరివర్తన అంటే మార్పు. పీఆర్‌పీ కూడా మార్పు కోసమనే వచ్చింది. మరి రాజనీతిని వెనుకే ఎందుకు పెట్టుకున్నారో తెలియదు. బహుశా ఇంగ్లీష్‌ మొదటి అక్షరాలు పీఆర్‌పీ వచ్చేందుకే విజయ సాయిరెడ్డి ఈ తంటాలు పడినట్టుగా అనిపిస్తోందంటున్నారు.

అయితే విజయసాయిరెడ్డి కూడా.. కవితలా కొత్త పార్టీతో జనం వద్ద ఏ మేర మద్దతు కూడగట్టుకుంటారనేది ఇప్పడే చెప్పలేం. పాత సీసాలో కొత్త సారా ! లాగా పేర్లు ప్రముఖమైనవే. పాతవే. కానీ కొత్త పార్టీగా జనం వద్దకు ఎలా వెళ్తున్నారు? వారిని ఎలా ప్రభావితం చేయగలుగుతారనేది మాత్రం వారు ఎంచుకున్న మార్గాలు, ప్రజలు వారిని విశ్వసించే తీరు మీదే ఆధారపడి ఉంటాయంటున్నారు.

ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పాతపేర్లతో ఉన్న కొత్త పార్టీలు ఏ మేర సక్సెసవుతాయనేది తేలాల్సి ఉంది.

అయితే, టీఆర్ఎస్ నేపథ్యం.. ఉద్యమం, అధికార పార్టీగా ఉంటే.. పీఆర్పీ ఏర్పడిన మూడేండ్ల కాలంలోనే కాంగ్రెస్ లో విలీనం అయ్యింది. 18 సీట్లు గెలుచుకుని .. 18% ఓట్లతో  పర్వాలేదు అనిపించుకున్నా.. పార్టీని నడపడం చిరుతో సాధ్యం కాలేదు.

Tags

Related News

పెంచి ఇవ్వకున్నా.. పింఛన్లు పెంచారు! కొత్తగా 4,50 లక్షల మందికి పింఛన్లు..! రూ. 110కోట్ల అదనపు భారం!

ఏపీ స్థానిక పోరులో కూటమి హవా.. కానీ ఆ ఓక్క జిల్లాలో టీడీపీకి సీన్ రివర్స్?

కాంగ్రెస్ సర్కార్‌ పై బీఆర్‌ఎస్ భారీ స్కెచ్.. ఈ ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..?

రాహుల్‌ గాంధీ.. రైజింగ్‌ స్టార్‌గా ఎదుగుతున్నారా?

స్థానిక నేతలకు బీఆర్ఎస్ ప్రత్యేక బాధ్యతలు.. మారనన్న పొలిటికల్ సీన్?

ఢిల్లీని మింగేస్తున్న అదృశ్య మృత్యువు.. గాలి పీల్చినా విషమే.. అసలు ఏమైంది?

పల్లె పల్లెకూ హైస్పీడ్ ఇంటర్నెట్.. రూ. 3,189 కోట్లతో తెలంగాణలో ‘డిజిటల్ విప్లవం’!

Big Stories

Advertisement
×