E-Paper
Advertisement

భారత్‌లో ఫాస్టెస్ట్, స్లోయెస్ట్ వందే భారత్ రైళ్లు ఇవే.. స్పీడ్ ఎంతో తెలుసా?

భారత్‌లో ఫాస్టెస్ట్, స్లోయెస్ట్ వందే భారత్ రైళ్లు ఇవే.. స్పీడ్ ఎంతో తెలుసా?
Advertisement

Fastest vs Slowest Vande Bharat Trains: భారతీయ రైల్వేలో వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ రైళ్లు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి. అత్యాధునిక సౌకర్యాలు, వేగవంతమైన ప్రయాణంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. ప్రస్తుతం దేశంలోని పలు ప్రధాన నగరాల మధ్య ఈ రైళ్లు నడుస్తున్నాయి. అయితే, అన్ని వందే భారత్ రైళ్లు ఒకే వేగంతో ప్రయాణించవు. కొన్ని రైళ్లు తక్కువ సమయంలోనే వందల కిలోమీటర్ల దూరాన్ని చేరుకుంటే, మరికొన్ని రైళ్లు మాత్రం మార్గంలోని పరిస్థితుల కారణంగా నెమ్మదిగా ప్రయాణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే వందే భారత్ రైలు ఏది? అత్యంత నెమ్మదిగా వెళ్లే రైలు ఏదో తెలుసుకుందాం.

దేశంలోనే అత్యంత వేగవంతమైన వందే భారత్ రైలు ఇదే!

న్యూఢిల్లీ – వారణాసి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ దేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే వందే భారత్ రైళ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ రైలు 22435 / 22436 నంబర్లతో నడుస్తుంది. సుమారు 759 నుంచి 771 కిలోమీటర్ల దూరాన్ని దాదాపు 8 గంటల్లో చేరుకుంటుంది.ఈ మార్గంలో రైలు సగటు వేగం గంటకు 95 నుంచి 96.37 కిలోమీటర్ల వరకు ఉంటుంది. తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం ఉండటంతో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ మధ్య ప్రయాణించే వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

అత్యంత నెమ్మదిగా ప్రయాణించే వందే భారత్ రైలు ఏది?

Advertisement

మరోవైపు యశ్వంత్‌పూర్ (బెంగళూరు) – మడ్గావ్ (గోవా) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అత్యంత నెమ్మదిగా ప్రయాణించే వందే భారత్ రైళ్లలో ఒకటిగా నిలుస్తోంది. ఈ రైలు 26655 / 26556 నంబర్లతో నడుస్తుంది. సుమారు 670 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవడానికి ఈ రైలుకు 12 నుంచి 13 గంటల సమయం పడుతుంది. దీని సగటు వేగం గంటకు 53 నుంచి 54 కిలోమీటర్లు మాత్రమే.

పశ్చిమ కనుమలే ప్రధాన కారణమా?

ఈ రైలు ప్రయాణించే మార్గంలో పశ్చిమ కనుమలు ఉన్నాయి. ముఖ్యంగా సకలేశ్‌పుర – సుబ్రహ్మణ్య రోడ్ మధ్య ప్రాంతంలో కొండలు, ఎత్తుపల్లాలు ఎక్కువగా ఉంటాయి. ఈ మార్గంలో రైలును వేగంగా నడపడం సాధ్యం కాదు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని రైల్వే అధికారు స్పీడ్ లిమిట్ పెట్టారు. రూట్ లోని గ్రేడియంట్, ట్రాక్ పరిస్థితులు కూడా రైలు వేగంపై ప్రభావం చూపుతాయి.

రెండు రైళ్ల మధ్య వేగంలో ఇంత తేడా ఎందుకు?

Advertisement

న్యూఢిల్లీ – వారణాసి మార్గంలో వేగంగా ప్రయాణించడానికి అనుకూలమైన రైల్వే మార్గాలు ఉండగా, యశ్వంత్‌పూర్ – మడ్గావ్ మార్గంలో కొండ ప్రాంతాలు, వంపులు, ఎత్తుపల్లాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే రెండు రైళ్ల ప్రయాణ సమయాల్లో చాలా తేడా కనిపిస్తోంది. వందే భారత్ రైళ్ల వేగం వాటి సాంకేతిక సామర్థ్యంపైనే కాకుండా ప్రయాణించే రైల్వే మార్గం, భద్రతా పరిమితులు, ట్రాక్ పరిస్థితులపై కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే అన్ని వందే భారత్ రైళ్లు ఒకే వేగంతో ప్రయాణించవు.

Read Also: ఇక దేశవ్యాప్తంగా వందే భారత్ స్లీపర్ రైళ్ల పరుగులు.. ఏకంగా 250 ట్రైన్స్..

Tags

Related News

ముంబై ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆటోమేటిక్ డోర్లతో కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ఇక దేశవ్యాప్తంగా వందే భారత్ స్లీపర్ రైళ్ల పరుగులు.. ఏకంగా 250 ట్రైన్స్..

ఈ ఫ్యామిలీ నిర్వాకం చూశారా? రైలులోని 3AC కోచ్‌లో వంటలు.. నెటిజన్ల ఫైర్!

ఇకపై 72 గంటల ముందే టికెట్ క్యాన్సిల్ చేయాలా? లేదంటే రీఫండ్ రాదా?

మొదటి రైలు ఆలస్యమై కనెక్టింగ్ ట్రైన్ మిస్ అయ్యిందా? మీ టికెట్ రిఫండ్ ఇలా పొందండి

దీపావళి పటాకులతో రైళ్లకు బ్రేక్.. 35 ట్రైన్స్ రద్దు, 150 రైళ్లు ఆలస్యం!

అస్సాంలో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన కోల్‌కతా-సైరంగ్ ఎక్స్‌ ప్రెస్!

Big Stories

Advertisement
×