Today Gold Rate February 14th: మన ఇండియాలో గోల్డ్ అంటే.. ఎంత ప్రత్యేకత ఉందో చెప్పనవసరం లేదు. ముఖ్యంగా భారతీయ మహిళలకు పండుగలు, శభకార్యాలు సమయాల్లో గోల్డ్ కొనుగోలు చేసేందుకు ఆశక్తి చూపిస్తుంటారు. రకరకాల ఆభరణాలు ధరిస్తూ ఉంటారు. ఇది వారి అందాన్ని మరింత పెంచుతుంది. అలాగే బంగారం కేవలం కొనుగోలు చేయడమే కాదు.. పెట్టుబడులకు కూడా పసిడి మంచి సాధనంగా చెప్పవచ్చు. గోల్డ్‌కి మంచి డిమాండ్ ఉంది కూడా. ఇక ఈ మధ్యకాలంలో గోల్డ్ రేట్స్ భారీగా పెరుగుతూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి.
ఓ వైపు గోల్డ్ కొనుగోలు చేసేవారికి చుక్కలు చూపిస్తుంటే.. మరోవైపు పెట్టుబడుదారులు పండగ చేసుకుంటున్నారు. ఇక నిన్న, మొన్నటి వరకు తగ్గినట్టే తగ్గి కాస్త ఊరటనిచ్చిన బంగారం ధరలు.. మళ్లీ పెరిగాయి. ఈరోజు(ఫిబ్రవరి 14)న బంగారం ధరలు చూస్తే.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 100 పెరిగి, రూ.79,900 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.110 రూపాయలు పెరిగి, రూ. 87,160 వద్ద కొనసాగుతోంది. ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.
ప్రధాన నగరాల్లో గోల్డ్ ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
ఢిల్లీలో పసిడి ధరలు తగ్గేదేలా అంటూ దూసుకుపోతున్నాయి. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 80,050 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.87,310 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 79,900 పలుకుతోంది. 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 87,160 వద్ద కొనసాగుతోంది.
బెంగళూరులో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 79,900 చేరగా.. 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 87,160కి చేరుకుంది.
ముంబైలో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 79,900కి చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 87,160 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
కేరళలో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 79,900 పలుకుతోంది. 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 87,160 వద్ద కొనసాగుతోంది.
Also Read: ఎన్ఆర్ఐలకు ఆదాయపు పన్ను ఎలా వర్తిస్తుంది?.. పెట్టుబడులు, స్థిరాస్తిపై పన్ను ఉంటుందా?
తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ ఇలా..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 79,900 ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 87,160 పలుకుతోంది.
వైజాగ్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 79,900 చేరగా.. 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 87,160 ఉంది.
విజయవాడ, గుంటూరులో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 79,900 వద్ద ట్రేడింగ్‌లో ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 87,160 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు..
పసిడి ధరలు మాదిరిగా వెండి ధరలు కూడా తగ్గేదేలే అనేలా దూసుకుపోతున్నాయి. హైదరాబాద్, చెన్నై, వైజాగ్‌లో కిలో వెండి ధర రూ. 1,08,000 పలుకుతోంది.
ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు ఇతర నగరాల్లో కిలో వెండి ధర రూ.1,00,500 ఉంది.