BigTV English

Rahul Ravindran: యాక్టర్ కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ తండ్రి కన్నుమూత.. ఎమోషనల్ పోస్ట్ షేర్..

Rahul Ravindran: యాక్టర్ కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ తండ్రి కన్నుమూత.. ఎమోషనల్ పోస్ట్ షేర్..

Rahul Ravindran: చాలా తక్కువమంది మాత్రమే ఒకవైపు యాక్టర్లుగా, మరొకవైపు దర్శకులుగా కూడా గుర్తింపు తెచ్చుకుంటారు. అలా రెండు పడవల్లో ప్రయాణం చేస్తూ సక్సెస్ అయినవారిలో రాహుల్ రవీంద్రన్ ఒకడు. తాజాగా రాహుల్ రవీంద్రన్ తండ్రి, చిన్మయి మావయ్య కన్నుమూశారు. ఈ విషయాన్ని తానే స్వయంగా ప్రకటిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశాడు రాహుల్ రవీంద్రన్. తన తండ్రి చనిపోయి రెండు రోజులు అయినా కూడా ఇప్పుడు ఈ విషయాన్ని బయటపెట్టాడు. దీంతో ప్రేక్షకులంతా రాహుల్ రవీంద్రన్ తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. తన ఫ్యాన్స్ అంతా తనను ధైర్యంగా ఉండమంటూ కామెంట్స్ పెడుతున్నారు.


నిజాయితీగా బ్రతికారు

‘మా నాన్న రవీంద్రన్ నరసింహన్ రెండు రోజుల ముందు చనిపోయారు. ఎప్పుడూ కష్టపడుతూ నిజాయితీగా ఉంటూ మంచి జీవితాన్ని కొనసాగించారు. మీరు ఎప్పుడూ మా జ్ఞాపకాల్లో ఉంటారు నాన్న. మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. నేను చిలసౌ సినిమాలోని ఒక డైలాగ్‌ను వేరొకరి స్థానంలో ఉండి ఆలోచించి రాశాను. ఇప్పుడు ఆ డైలాగ్ వింటుంటే చాలా భారంగా అనిపిస్తోంది. నాన్న ఉన్నారులే చూసుకుంటారు అనే మాటకు విలువ నాన్నని కోల్పోయిన వారికే తెలుసు. ఇప్పుడు ఆ మాటకు అర్థం తెలుస్తోంది. మీరు లేని లోటును ఎవరూ తీర్చలేరు. ఆ ఫీలింగ్స్‌ను మాటల్లో కూడా చెప్పలేను. థాంక్యూ నాన్న. లవ్ యూ’ అని తన సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్ట్ షేర్ చేశాడు రాహుల్ రవీంద్రన్.


చిన్మయి స్పందించలేదు

తన తండ్రి గురించి చెప్పడంతో పాటు పలు ఫోటోలు కూడా షేర్ చేశాడు రాహుల్ రవీంద్రన్. అందులో తన తండ్రితో పాటు తల్లి ఫోటో కూడా ఉంది. దాంతో పాటు అందరి ఫ్యామిలీ ఫోటో కూడా షేర్ చేశాడు రాహుల్. ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలని చెప్తూ రవీంద్రన్ నరసింహన్ మృతికి సంతాపం తెలియజేస్తున్నారు ఫ్యాన్స్. సినీ సెలబ్రిటీలు సైతం రవీంద్రన్ నరసింహన్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరకుంటున్నారు. కానీ రాహుల్ రవీంద్రన్ భార్య చిన్మయి శ్రీపాద (Chinmayi Sripaada) మాత్రం దీని గురించి ఎలాంటి పోస్ట్ షేర్ చేయకపోవడం, సోషల్ మీడియాలో అసలు స్పందించకపోవడంపై నెటిజన్లు విమర్శిస్తున్నారు. మావయ్య మృతిపై చిన్మయి రియాక్ట్ అవ్వకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

Also Read: ప్రముఖ తెలుగు డైరెక్టర్ తండ్రి కన్నుమూత..

దర్శకుడిగా సక్సెస్

ఇక రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) సినిమాల విషయానికొస్తే.. ముందుగా ఒక నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తను.. మెల్లగా దర్శకత్వం వైపు అడుగులు వేశాడు. దాదాపు 18 ఏళ్ల పాటు నటుడిగా తెరపై ప్రేక్షకులను ఎంటర్‌‌టైన్ చేసిన రాహుల్.. మొదటిసారి ‘చిలసౌ’ అనే సినిమాతో తనలో ఒక దర్శకుడు కూడా ఉన్నాడని నిరూపించుకున్నాడు. ఈ మూవీకి నేషనల్ అవార్డ్ కూడా రావడంతో తనను నటుడిగా కంటే దర్శకుడిగా సెటిల్ అయిపోతేనే బాగుంటుందని ప్రేక్షకులు ఫీలయ్యాడు. ఆ తర్వాత దర్శకుడిగా తను తెరకెక్కించిన ‘మన్మథుడు 2’ మాత్రం డిశాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం రష్మిక మందనా లీడ్ రోల్ చేస్తున్న ‘ది గర్ల్‌ఫ్రెండ్’ను డైరెక్టర్ చేయడంలో రాహుల్ రవీంద్రన్ బిజీగా ఉన్నాడు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×