Income Tax Residential Status| చాలా మంది భారతీయులు సంవత్సరంలో ఎక్కువ రోజులు విదేశాల్లో గడుపుతున్నారు. కొందరు అక్కడే స్థిరపడిన వారు, మరికొందరు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే.. అలాంటి వ్యక్తులు భారతదేశంలో పన్నులు చెల్లించాల్సిన అవసరం ఉందా? అనే ప్రశ్నకు సమాధానం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.
1961లో రూపొందించిన భారత ఆదాయపు పన్ను చట్టం.. దేశంలో నివసించే వారికి మాత్రమే కాకుండా, విదేశాల్లో ఆదాయం సంపాదించే వారికి కూడా వర్తిస్తుంది. అయితే, దేశంలో నివసించే సాధారణ ప్రజలకు, ప్రవాస భారతీయులకు (NRIలు) పన్ను నియమాలు, ప్రయోజనాలు భిన్నంగా ఉంటాయి.
భారతదేశంలో ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ప్రవాస భారతీయుడిగా (NRI) ఎవరిని పరిగణిస్తారు?
ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, ఒక సంవత్సరంలో భారతదేశంలో నిర్ణీత కాలం కంటే తక్కువ సమయం మాత్రమే నివసించే వ్యక్తిని ప్రవాస భారతీయుడిగా (NRI) పరిగణిస్తారు. ఈ నిర్వచనం ప్రకారం.. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి భారతదేశంలో ఎంత కాలం ఉన్నాడు అనేది ఆధారంగా అతని నివాస స్థితి నిర్ణయించబడుతుంది.
భారతదేశ నివాసిగా పరిగణించబడేందుకు, ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 182 రోజులు భారతదేశంలో ఉండాలి. లేదా ఒక ఆర్థిక సంవత్సరంలో 60 రోజులు ఉండి, మునుపటి నాలుగు సంవత్సరాలలో కనీసం 365 రోజులు దేశ భూభాగంలో నివసించిన వ్యక్తిని కూడా భారతదేశ నివాసిగా పరిగణిస్తారు.
అదనంగా విదేశాల్లో ఉద్యోగం కోసం లేదా భారతీయ నౌకలో సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయ పౌరులు కూడా నివాసులుగా పరిగణించబడతారు. వారు ఆర్థిక సంవత్సరంలో 182 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం భారతదేశంలో ఉన్నట్లే.
Also Read: సొంతింటి కల నిజం చేసుకోవాలంటే ఈ టిప్స్ పాటించండి..
నాన్-రెసిడెంట్ (NRI) స్థితి:
పైన పేర్కొన్న నివాస పరిస్థితులలో దేనినీ తీర్చకపోతే, ఆ వ్యక్తిని ప్రవాస భారతీయుడిగా (NRI) పరిగణిస్తారు. అంటే విదేశాల్లో నివసించే వ్యక్తి భారతదేశానికి వచ్చి ఒక సంవత్సరంలో 182 రోజుల కంటే తక్కువ రోజులు మాత్రమే గడిపితే అతనికి ప్రవాసిగా హోదా తక్కుతుంది.
NRIలు విదేశాల్లో సంపాదించే ఆదాయంపై పన్ను ఉంటుందా?
NRIలు విదేశాల్లో సంపాదించే ఆదాయంపై భారతదేశంలో పన్ను విధించబడదు. అయితే, భారతదేశంలో సంపాదించిన లేదా భారతదేశంలోని ఆస్తులు, పెట్టుబడులు, లేదా సేవల ద్వారా వచ్చే ఆదాయంపై మాత్రమే పన్ను విధించబడుతుంది.
NRIలు ఈ కింద మార్గాల ద్వారా సంపాదించిన ఆదాయంపై పన్ను చెల్లించాలి..
రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ (RNOR) స్థితి:
మీరు RNOR గా అర్హత సాధించాలంటే, గత 10 సంవత్సరాలలో కనీసం 9 సంవత్సరాలు భారతదేశంలో ప్రవాసిగా ఉండాలి.
లేదా.. గత 7 సంవత్సరాలలో భారతదేశంలో 729 రోజులు లేదా అంతకంటే తక్కువ కాలం మాత్రమే ఉండాలి.
PIO(పర్సన్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్) లు లేదా భారతీయ పౌరులు RNOR కేటగిరీకి అర్హత సాధించాలంటే, విదేశీ ఆదాయం మినహా వారి మొత్తం ఆదాయం ₹15 లక్షల కంటే ఎక్కువ ఉండాలి, గత సంవత్సరంలో భారతదేశంలో 120 రోజుల కంటే ఎక్కువ, కానీ 182 రోజుల కంటే తక్కువ ఉండాలి. PIO(పర్సన్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్) అంటే ఆ వ్యక్తి తల్లిదండ్రులు లేదా పూర్వీకులు అవిభాజిత భారతదేశ నివాసులు అయి ఉండాలి.
NRIలు విదేశాల్లో సంపాదించే ఆదాయంపై భారతదేశంలో పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, భారతదేశంలో సంపాదించిన లేదా భారతదేశంలోని ఆస్తులు, పెట్టుబడులు, లేదా సేవల ద్వారా వచ్చే ఆదాయంపై మాత్రమే పన్ను విధించబడుతుంది. ఈ నియమాలు NRIలకు, RNORలకు వర్తిస్తాయి.