BigTV English

Regina Cassandra: మళ్లీ బాలీవుడ్ పై బాంబ్ పేల్చిన రెజీనా.. అందుకే అవకాశాలు కోల్పోయాను అంటూ..?

Regina Cassandra: మళ్లీ బాలీవుడ్ పై బాంబ్ పేల్చిన రెజీనా.. అందుకే అవకాశాలు కోల్పోయాను అంటూ..?

Regina Cassandra.. రెజీనా కసాండ్రా (Regina Cassandra).. తమిళనాడుకు చెందిన రెజీనా కసాండ్రా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటిగా రాణించింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ బాలీవుడ్ లో కూడా రెండు మూడు సినిమాల్లో నటిస్తోంది. ఒకప్పుడు తెలుగులో చేతినిండా అవకాశాలు ఉన్న రెజీనా కసాండ్రా.. ప్రస్తుతం అవకాశాల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. అయితే రీసెంట్ గా అజిత్(Ajith) హీరోగా వచ్చిన ‘విడాముయర్చి’ సినిమాలో రెజీనా కసాండ్రా కూడా నటించింది. ఈ సినిమాలో త్రిష(Trisha) మెయిన్ హీరోయిన్ గా చేయగా రెజీనా కూడా కీ రోల్ పోషించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రెజీనా కసాండ్రా తనకి అవకాశాలు ఎందుకు రావడం లేదో బయటపెట్టింది.


భాష రాకపోవడం వల్లే బాలీవుడ్లో అవకాశాలు రావడం లేదు..

రెజీనా (Regina) మాట్లాడుతూ.. దక్షిణాది ఇండస్ట్రీలో ఎక్కడినుండి వచ్చిన అమ్మాయిలనైనా సరే సినిమాలో హీరోయిన్ గా తీసుకుంటారు. కానీ హిందీలో మాత్రం దక్షిణాది నుండి వచ్చిన హీరోయిన్లు కొనసాగడం చాలా కష్టం. ముఖ్యంగా నాకు హిందీ భాష రాకపోవడం వల్ల బాలీవుడ్ లో చాలా సినిమాలు మిస్ అయ్యాను. నేను ఒక పంజాబీ మూవీ లో నటించలేను. కానీ ఒక పంజాబీ హీరోయిన్ ని మాత్రం ఎలాంటి క్వాలిటీస్ లేకుండానే దక్షిణాదిలో హీరోయిన్ గా తీసుకుంటారు. దక్షిణాది ఇండస్ట్రీలో ఉండే దర్శక నిర్మాతలు, హీరోలు వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు.. వాళ్లకు ఈ భాష వస్తుందా? రాదా? అనేది అస్సలు పట్టించుకోరు. కానీ బాలీవుడ్ లో ఉండే దర్శక నిర్మాతలు మాత్రం దక్షిణాది నుండి వచ్చే హీరోయిన్లకు భాష వస్తుందా? రాదా? అనేదే ముందుగా చూస్తారు. అలా నాకు హిందీ భాష రాకపోవడం వల్ల ఎన్నో అవకాశాలను కోల్పోవాల్సి వచ్చింది. కానీ టాలీవుడ్ లో, కోలీవుడ్లో ఇలాంటివన్నీ పట్టించుకోరు.అందుకే నార్త్ నుండి వచ్చిన ఎంతో మంది హీరోయిన్లు సౌత్ లో సెటిల్ అయ్యారు. కానీ సౌత్ హీరోయిన్లు నార్త్ లో రాణించడం చాలా కష్టం. నాకు 9 సంవత్సరాల వయసు ఉన్నప్పటినుండి నేను ఇండస్ట్రీలో రాణిస్తున్నాను. బాల నటిగా ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పటికి కూడా సినిమాల్లో చేస్తున్నాను. నేను సినిమాల్లోనే కాదు పలు ప్రకటనల్లో కూడా చేశాను.అందుకే నాకు ఇండస్ట్రీపై,నటనపై మంచి అవగాహన ఉంది.


సౌత్ లో నటన మాత్రమే చూస్తారు..

కానీ బాలీవుడ్ లో రాణించడం మాత్రం చాలా కష్టం. నార్త్ లో స్టార్లుగా ఉన్న చాలామంది హీరోయిన్లు సౌత్ లో కూడా టాప్ పొజిషన్లో ఉన్నారు. కానీ సౌత్ హీరోయిన్ల పరిస్థితి నార్త్ లో అలా లేదు. సౌత్ హీరోయిన్ కేవలం సౌత్ లో మాత్రమే రాణించాలి. నార్త్ లో వాళ్లను తీసుకోరు అంటూ రెజినా కసాండ్రా(Regina Cassandra) బాలీవుడ్ ఇండస్ట్రీలో సౌత్ హీరోయిన్లకు జరిగే అన్యాయం గురించి ఓపెన్ గానే చెప్పేసింది. కేవలం భాష రాకపోవడం వల్లే హిందీ సినిమాల్లో అవకాశాలు కోల్పోయాను అంటూ రెజినా మాట్లాడిన మాటలు ప్రస్తుతం బీటౌన్ లో వైరల్ గా మారాయి. ఇక రెజీనా సినిమాల విషయానికొస్తే..ప్రస్తుతం రెజినా చేతిలో ఒక తమిళ సినిమా,రెండు హిందీ సినిమాలు ఉన్నాయి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×