Today Gold Rate: రోజు రోజుకి బంగారం ధరలు పెరిగి గోల్డ్ లవర్స్‌ను కంగారు పెట్టిస్తున్నాయి. పెళ్లిల్లు, పండుగల సమయంలో పసిడి ధరలు ఆకాశాన్ని తాకుతుండడంతో కొనుగోలుదారులు వెనకడుగు వేస్తున్నారు. గత కొద్దిరోజుల నుంచి పెరుగుతూ వస్తున్న పుత్తడి ధరలు ఈరోజు మళ్లీ పెరిగాయి. మళ్లీ అదే జోరు చూపిస్తున్నాయి. 22 క్యారెట్ల తులం బంగారానికి రూ. 450 పెరిగి, 80,650కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారానికి రూ. 490 పెరిగి, 87,980కి చేరుకుంది. పసిడి ధరలు పెరగడానికి ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెరలేపిన వాణిజ్య యుద్ధమే కారణం అని తెలుస్తోంది. చైనా మెక్సికో, కెనడాలపై సుంకాలు పెంచారు. ఈ నేపథ్యంలో వరుసగా బంగారం ధరలు పెరుగుతున్నాయి.
అదే విధంగా స్టాక్ మార్కెట్ల పతనం అవడంతో బంగారం ధరలు అమాంతం పెరిగాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. యాపిల్, గుగూల్, మైక్రోసాఫ్ట్, టెస్లా, గూగుల్, అమెజాన్, మెటా.. ఇలా అమెరికన్ టెక్నాలజీ కంపెనీలన్నీ భారీ నష్టాలను చవి చూశాయి. అధికారికంగా ఈ కంపెనీలన్ని కలిపి ఒకే రోజు 750 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూశాయి. ఇందులో ఒక్క యాపిల్ కంపెనీనే 174 బిలియన్ డాలర్లు నష్టపోయింది. మన ఇండియన్ కరెన్సీలో చెప్పుకోవాలంటే దాదాపు 15 లక్షల కోట్ల సంపద ఒక్క రోజులోనే ఆవిరైంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రస్తుతం రూ.90 వేలకు చేరువలో ఉన్న పసిడి ధరలు త్వరలోనే రూ.లక్షకు చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్స్ ఇలా ఉన్నాయి..
ఢిల్లీలో గోల్డ్ రేట్స్ చూస్తే.. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.88,130కి చేరుకుంది. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.80, 800 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
చెన్నైలో గోల్డ్ రేట్స్ చూస్తే.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.80,650 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.87, 980 పలుకుతోంది.
బెంగళూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.80,650 ఉండగా.. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.87, 980కి చేరుకుంది.
ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.80,650 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.87, 980 పలుకుతోంది.
కేరళ, కోల్‌కత్తాలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.80,650 వద్ద ట్రేడింగ్‌లో ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.80,650 ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు ఇలా..
హైదరాబాద్, తెలంగాణలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.80,650 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.80,650 పలుకుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.80,650 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.80,650 వద్ద కొనసాగుతోంది.
వైజాగ్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.80,650 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.80,650 పలుకుతోంది.
వెండి ధరలు పరిశీలిస్తే..
గోల్డ్ రేట్స్ రోజు రోజుకి పరుగులు పెడుతున్న నేపథ్యంలో.. వెండి ధరలు కూడా అమాంతం పెరిగాయి. నేడు హైదరబాద్, వైజాగ్, చెన్నై, కేరళలో కిలో వెండి ధర రూ.1,09,000కి చేరుకుంది.
బెంగళూరు, కోల్‌కత్తా, ఢిల్లీ, ముంబైలో కిలో వెండి ధర రూ.1,00,000 పలుకుతోంది.