BigTV English
Advertisement

Man Frauds 3 Wives: నిన్నే ప్రేమించా నీకోసం ప్రాణమిస్తా.. 3 యువతులను ఒకే డైలాగ్‌తో దోచుకున్న యువకుడు

Man Frauds 3 Wives: నిన్నే ప్రేమించా నీకోసం ప్రాణమిస్తా.. 3 యువతులను ఒకే డైలాగ్‌తో దోచుకున్న యువకుడు

Man Frauds 3 Wives| ఈ కాలంలో యువత అంతా ఫాస్ట్. త్వరగా డేటింగ్ పేరుతో ప్రేమించుకోవడం. సినిమాలు, షికార్లు అని బాగా తిరగడం. ఇంతలోనే మరొకరు నచ్చడం లేదా ఉన్న పార్ట్‌నర్ తో విభేదాలు రావడం.. లాంటివి జరగడంతో వెంటనే బ్రేకప్ చేసుకుంటారు. మొహమాటాలు ఉండవు. బట్టలు మార్చినంత ఈజీగా ప్రేమికులను మార్చేస్తున్నారు. ఈ సంస్కృతి అమెరికా, బ్రిటన్ లాంటి పాశ్చాత్య దేశాల్లో ప్రారంభమై గత దశాబ్ద కాలంగా ప్రపంచదేశాలన్నింటిలోకి వ్యాపించింది. అయితే అమెరికాలో ఒక యువకుడు మాత్రం డేటింగ్ చేయకుండా సంప్రదాయ బద్దంగా పెళ్లి చేసుకుంటాడు. ఆ తరువాత మరో యువతిపై మోజు పడతాడు. ఆమెను కూడా పెళ్లి చేసుకున్నాడు. అంతటితో ఆగక మరో యువతిని కూడా ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తరువాత వారిని క్రమంగా మోసం చేసి వారి బ్యాంకు అకౌంట్ ఖాళీ చేశాడు. అయితే ఈ ముగ్గురు యువతులను అతను ఎలా మేనేజ్ చేశాడు? అతని బండారం ఎలా బయటపడింది అనేది ఆసక్తి కరంగా మారింది.


వివరాల్లోకి వెళితే.. అమెరికా దేశం ఫ్లోరిడా రాష్ట్రంలోని మూడు వేర్వేరు పట్టణాలకు చెందిన యువతులు తమ భర్తలపై అనుమానంలో విచారణ మొదలుపెట్టారు. అతను తమను మోసం చేస్తున్నాడని వారికి గత కొంతకాలంగా అనిపించింది. అయితే ఈ ముగ్గురు యువతులు కూడా తమ విచారణ కొనసాగిస్తున్న వేళ ఒక షాకింగ్ విషయం బయటపడింది. ఈ ముగ్గురు పెళ్లి చేసుకున్న యువకులు వేర్వేరు కాదు ఒక్కడే అని. సినిమా స్టోరీలా అనిపించినా ఇది నిజంగానే జరిగింది.

Also Read: చోరీ కారును ఓనర్‌కే విక్రయించిన దొంగలు.. కారు నెంబర్ మార్చినా ఎలా గుర్తు పట్టాడంటే?


ఫ్లోరిడాలోని సెమినోల్ కౌంటీ (పట్టణం)కి చెందిన హెన్రీ బెట్సీ జూనియర్ అనే 30 ఏళ్ల యువకుడు బంబల్, టిండర్, మ్యాచ్ డాట్ కామ్ లాంటి అనేక ఆన్ లైన్ ప్లాట్ ఫామ్స్ ద్వారా ముగ్గురు యువతులకు పరిచయమయ్యాడు. వారిలో టోన్యా అనే యువతి డోవల్ కౌంటీలో నివసిస్తోంది. ఆమెను టిండర్ అనే డేటింగ్ యాప్ ద్వారా కలిసి స్నేహంగా నటించాడు. తరువాత తనను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని తాను లేకపోతే చనిపోతానని ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో టోన్యా అతడిని నిజంగానే ప్రేమించింది. అలా నవంబర్ 2020లో టోన్యాని హెన్రీ వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత హెన్రీ మళ్లీ బ్రాండీ అనే యువతిని స్టిర్ అనే డేటింగ్ యాప్ ద్వారా కలిశాడు. ఆమెతో కూడా సేమ్ ప్రేమ డైలాగులు చెప్పి బుట్టలో వేసుకున్నాడు. అతడు తనను సిన్సియర్ గా ప్రేమిస్తున్నాడని నమ్మిన బ్రాండీ ఫిబ్రవరి 2022లో అతడిని పెళ్లి చేసుకుంది. ఆమె మనాటీ కౌంటీలో నివసిస్తోంది. హెన్రీ అంతటితో ఆగకమ్యాచ్ డాట్ కామ్ అనే పోర్టల్ ద్వారా మిచేల్ కు పరిచయమయ్యాడు. ఆమె హర్‌నాన్డో కౌంటీకి చెందిన యువతి.. విచిత్రమేమిటంటే బ్రాండీని పళ్లి చేసుకున్న 9 నెలల తరువాత మిచేల్ ను హెన్రీ పెళ్లి చేసుకున్నాడు.

హెన్రీ గురించి ఎలా తెలిసిందంటే..
హెన్రీ తన మొదటి భార్య టోన్యాని పెళ్లి జరిగిన ఏడాది తరువాత నుంచే చిత్రహింసలు పెట్టేవాడు. ఆమెతో అసభ్యంగా మాట్లాడేవాడు. ఆ తరువాత తనకు ఉద్యోగం పోయిందని.. అందుకే తాను మానసికంగా బాధపడుతున్నానని ఎమోషనల్ గా లొంగదీసుకునేవాడు. అయితే హెన్రీ తన ముగ్గురు భార్యలను దోచుకోవడానికి ఒక ప్లాన్ వేశాడు. వారి ముగ్గురితో తనకు బ్యాంకులో జాయింట్ అకౌంట్ల పెట్టుకున్నాడు. అలా వారి ఖాతాల నుంచి తనక ఇష్టం వచ్చినంత తీసుకునేవాడు. ముగ్గురు భార్యలు ఉద్యోగం చేస్తుంటే తాను మాత్రం వారి ఆదాయం ద్వారా ఎంజాయ్ చేసువాడు. కానీ 2023 నుంచి తన మొదటి భార్య టోన్యాను కొట్టేవాడు. భర్తను ఎంతో ప్రేమగా చూసుకునే టోన్యా అంతా మౌనంగా సహించేది. కానీ క్రమంగా హెన్రీ ఇంటి నుంచి దూరంగా ఉండేవాడు. ఎప్పుడూ తనకు పని ఉందని చెప్పి ప్రయాణాలు చేసేవాడు. దీంతో టోన్యాకు అనుమానం వచ్చింది.

మరోవైపు అతని మూడో భార్య మిచేల్ కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. అందుకే ఇద్దరూ వేర్వేరుగా తమ భర్తకు మరో యువతితో అక్రమ సంబంధ ముందని అనుమానించి డిటెక్టివ్స్ ద్వారా దర్యాప్తు చేయించారు. అయితే టోన్యాకు అందరి కంటే ముందుగా ఆమె హైర్ చేసిన డటెక్టివ్ ఒక షాకింగ్ వార్త చెప్పాడు. ఆమె భర్త పేరుతో కౌంటీలో మూడు మ్యారేజ్ రికార్డ్స్ ఉన్నాయని.. అంటే హెన్రీకి మొత్తం ముగ్గురు భార్యలు ఉన్నారని చెప్పాడు. మరోవైపు మిచేల్ హైర్ చేసిన డిటెక్టివ్ హెన్రీని ఫాలో చేస్తూ హెన్రీ రెండో భార్య బ్రాండీ గురించి తెలుసుకున్నాడు. ఆ తరువాత టోన్యా కూడా అక్కడికే చేరుకుంది. అలా ముగ్గురు భార్యలు మనాటీ కౌంటీలో కలుసుకున్నారు. దీంతో హెన్రీ బండారం బయటపడింది.

టోన్యా అందరికంటే ముందుగా పోలీసులకు తన భర్త ఒక మోసగాడని ఫిర్యాదు చేసింది. అయితే తన ముగ్గురు భార్యలకు తన గురించి మొత్తం తెలిసిపోయిందని పసిగట్టిన హెన్రీ పరారయ్యాడు. పోలీసులు అతని ఆరు నెలల పాటు గాలించి సెమినోల్ కౌంటీలో పట్టుకున్నారు. కోర్టులో అతడి నుంచి టోన్యా విడాకులు తీసుకుంది. మిగతా ఇద్దరు భార్యలు కూడా విడాకుల కోసం కేసు ఫైల్ చేశారు.

Related News

Man Wins Rs 240 Cr Lottery: తెలంగాణ బిడ్డకు రూ.240 కోట్ల లాటరీ.. ఇదిగో ఇలా చేస్తే మీరూ కోటీశ్వరులే!

Hanumakonda: కోయ్.. కోయ్.. కొక్కొరొక్కో.. కోళ్ల కోసం జనం పరుగుల వేట

Orange Shark: అరుదైన ఆరెంజ్ షార్క్.. భలే బాగుంది, కానీ చాలా డేంజర్ సుమా!

Safety Pin: ఈ పిన్నీసు కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే, మరీ అంత ధర ఏంట్రా అయ్యా?

Uber Driver Story: పగటిపూట రూ.1,500 కోట్ల వ్యాపారాన్ని నడుపుతున్న వ్యక్తి, రాత్రిపూట ఉబర్ డ్రైవర్‌గా మారుతున్నాడు.. ఎందుకంటే?

World’s Largest Spider Web: ప్రపంచంలోనే అతి పెద్ద సాలీడు గూడు.. 1,11,000 సాలెపురుగుల నైపుణ్యం.. వీడియో వైరల్

Viral Video: ‘మిషన్ ఇంపాజిబుల్’ సీన్ రీ క్రియేట్, భారత సంతతి యువతి వీడియో నెట్టింట వైరల్!

Viral Video: తెల్లజాతి మహిళకు నల్ల కవలలు, తన పిల్లలు కారంటూ తండ్రి రచ్చ, నెట్టింట వీడియో వైరల్!

Big Stories

×