Justice Suryakanth: సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు. నవంబర్ 24న ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. 2027 ఫిబ్రవరి 9 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టబోతున్న ఫస్ట్ హర్యానా రాష్ట్ర వాసిగా సూర్యకాంత్ రికార్డ్ సృష్టించబోతున్నారు. ప్రస్తుత సీజేఐ బీఆర్ గవాయ్ పదవీ కాలం నవంబర్ 23న ముగిస్తుండడంతో.. నవంబర్ 24న జస్టిస్ సూర్యకాంత్ సీజేఐ బాధ్యతలు చేపట్టనున్నారు.