E-Paper
Advertisement

Upcoming SUVs in India: కార్ లవర్స్‌కు పండగే.. త్వరలో 5 కొత్త ఎస్‌యూవీలు..!

Upcoming SUVs in India: కార్ లవర్స్‌కు పండగే.. త్వరలో 5 కొత్త ఎస్‌యూవీలు..!
Advertisement

Upcoming SUVs in India: ఇండియన్ కార్ ప్రియులు ఆటోమొబైల్ పరిశ్రమ శుభవార్త చెప్పింది. పండుగ సీజన్ సమీపిస్తుండటంతో సరికొత్త కార్లను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఇటీవల కాలంలో ఎస్‌యూవీలకు దేశంలో ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో కొత్తగా విడుదలయ్యే కార్లలో ఎక్కువగా ఎస్‌యూవీలే ఉన్నాయి. ఇవి కొత్త అప్‌డేటెడ్ ఫీచర్లతో రానున్నాయి. మీరు కూడా రాబోయే ఎస్‌యూవీలను కొనుగోలు చేయాలంటే త్వరలో మార్కెట్‌లోకి రానున్న టాప్ -5 ఎస్‌యూవీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Nissan X-Trail
నిస్సాన్ ఇండియా చివరకు తన పోర్ట్‌ఫోలియోను మాగ్నైట్, దాని వివిధ కొత్త వేరియంట్‌లకు విస్తరిస్తోంది. ఎక్స్-ట్రైల్ నేరుగా దేశంలోకి దిగుమతి చేస్తోంది . గ్లోబల్ మార్కెట్లో నిస్సాన్ SUV 5, 7 సీటర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు X-ట్రైల్ వెర్షన్ 12V మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్‌తో 1.5-లీటర్ 3-సిలిండర్ టర్బోతో పెట్రోల్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మొత్తం అవుట్‌పుట్ 161 bhp పవర్, 300 Nm టార్క్ రిలీజ్ చేస్తోంది. ఇది CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లింకై ఉంటుంది.

Advertisement

Also Read: Cheapest Automatic Cars: బడ్జెట్ కార్లు.. అట్రాక్ట్ చేస్తున్న AMT ఫీచర్.. ధర వివరాలు ఇవే!

Mahindra Thar 5 Door
థార్ 5-డోర్ లేదా థార్ ఆర్మడ  ఆగస్టు 15న విడుదల కానుంది. 5-డోర్ల థార్‌లో చిన్న మార్పులు ఉంటాయి. అయితే క్యాబిన్ పూర్తిగా రీడిజైన్ చేసే అవకాశం ఉంది. ఇందులో ట్విన్ 10.25-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్రైవర్ కన్సోల్ ఉంటుంది. ఇది లెవల్ 2 ADAS సేఫ్టీ, 360-డిగ్రీ కెమెరా, XUV700, 3X0 వంటి కొత్త HVAC కంట్రోల్ ఉంటుంది. 2-లీటర్ పెట్రోల్, 2.2-లీటర్ డీజిల్ ఇంజన్లు అలాగే ఉంటాయి. రెండు పవర్‌ట్రెయిన్‌లు 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్‌తో అందుబాటులో ఉంటాయి.

Advertisement

Tata Curvv
టాటా మోటార్స్ కొత్త కూపే ఎస్‌యూవీ ఆగస్ట్ 7న విడుదల కానుంది. కర్వ్ EV దాని IEC వెర్షన్ కంటే ముందుగా అందుబాటులోకి వస్తుంది. దాని కొత్త డిజైన్ ఆకట్టుకుంటుంది.  కర్వ్ EV విస్తృత ఫ్రంట్ ఫాసియా, బోల్డ్ ఫ్రంట్ బంపర్‌తో స్ప్లిట్ హెడ్‌లైట్ క్లస్టర్‌ను కలిగి ఉంది. ఇది ముందు గ్రిల్‌పై టాటా మోటార్స్ సిగ్నేచర్ LED DRLలను కలిగి ఉంటుంది. టాటా మోటార్స్ ఇంకా కర్వ్ EV స్పెసిఫికేషన్‌లను వెల్లడించలేదు. అయితే ఇది 500 కిమీల వరకు డ్రైవింగ్ రేంజ్, 50kW DC ఛార్జింగ్ కెపాసిటిని కలిగి ఉంటుంది.

Citroen Basalt
ఆగస్ట్ 2న సిట్రోయెన్ అధికారికంగా బసాల్ట్‌ను ఆవిష్కరించనుంది. అయితే ధరలను ఈ నెలాఖరున వెల్లడించే అవకాశం ఉంది. C3 హ్యాచ్‌బ్యాక్, C3 ఎయిర్‌క్రాస్ SUV తర్వాత CMP ఆధారంగా బసాల్ట్ మూడవ వెహిరల్ అవుతుంది. ఈ కూపే SUV పెద్ద లోయర్ ఎయిర్ డ్యామ్‌తో అగ్రెసివ్ డిజైన్‌ను కలిగి ఉంది. స్టైలిష్ స్లోపింగ్ రూఫ్‌లైన్‌తో పాటు కూపే SUV కొత్త ర్యాప్-అరౌండ్ LED టెయిల్ లైట్లను పొందుతుంది. ఇది 109 bhp అవుట్‌పుట్‌తో 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ద్వారా పవర్ పొందుతుంది. అయితే మాన్యువల్ వెర్షన్ 190 Nm, టోమేటిక్ 205 Nm టార్క్ రిలీజ్ చేస్తుంది.

Also Read: Tata Punch Discounts: టాటా పంచ్.. ఆ వేరియంట్‌పై ఫస్ట్ టైమ్ భారీ డిస్కౌంట్.. ఇప్పడు ధర ఎంతంటే?

Tata Nexon ICNG
టాటా మోటార్స్ సిఎన్‌జి మార్కెట్‌పై దృష్టి సారించింది. నెక్సాన్ ఐసిఎన్‌జిని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దీన్ని ఇంతకుముందు ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024లో ప్రదర్శించారు. Nexon అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ SUVలలో ఒకటి. ఇది ట్విన్-సిలిండర్ CNG ట్యాంక్‌తో వస్తూనే ఉంటుంది. టాటా మోటార్స్ స్పెసిఫికేషన్‌లను వెల్లడించలేదు కానీ రెండు ఇంధనాల పెట్రోల్‌ను CNGకి మార్చడానికి ఇది ఒకే ECUని కలిగి ఉంటుంది.

Related News

ఆధార్, ఫోన్ నంబర్‌తో.. మీ UAN నంబర్‌ను క్షణాల్లో కనుక్కోండిలా

ఆషాడ వేళ పసిడి షాక్.. ఆశలకి బ్రేక్ వేస్తూ మళ్ళీ పైపైకి బంగారం ధరలు!

ఎల్పీజీ గ్యాస్‌కు చెక్.. ఇకపై ఇథనాల్‌తో కుకింగ్, కేంద్రం సన్నాహాలు మొదలు

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

Big Stories

Advertisement
×