BigTV English

Hero Next-Gen Xpulse: ఎన్‌ఫీల్డ్‌తో యుద్ధానికి సిద్ధమైన హీరో.. ఆ బైక్ కొత్త ఇంజన్‌తో వస్తుంది!

Hero Next-Gen Xpulse: ఎన్‌ఫీల్డ్‌తో యుద్ధానికి సిద్ధమైన హీరో.. ఆ బైక్ కొత్త ఇంజన్‌తో వస్తుంది!

Hero Next-Gen Xpulse: దేశంలో అతిపెద్ద ద్విచక్రవాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ మార్కెట్‌లో ఎంట్రీ లెవల్ బైక్‌ల నుంచి ప్రీమియం సెగ్మెంట్ వరుకు అన్ని రకాల బైక్‌లను విక్రయిస్తోంది. ఇది మాత్రమే కాకుండా హీరో ఎక్స్‌పల్స్ పేరుతో ఆఫ్ రోడింగ్ బైకలును కూడా కలిగి ఉంది. ప్రస్తుతం ఇది 200 సీసీ ఇంజన్‌తో ఉంది. అయితే ఇప్పుడు ఈ బైక్ పెద్ద అప్‌గ్రేడ్‌తో రానుంది. దీని ఇంజన్‌‌లో ఛేంజస్ చేయనున్నారు. దీంతో ఈ ఎక్స్‌పల్స్ బైక్ నేరుగా రాయల్ ఎన్‌ఫీల్డ్‌‌తో పోడీపడుతుంది. ఈ బైక్ ప్రత్యేకత ఫీచర్లు గురించి ఇప్పుడు చూద్దాం.


2024 హీరో ఎక్స్‌పల్స్ అతిపెద్ద ఇంజన్‌తో రానుంది. హీరో ఎక్స్‌పల్స్‌ను అప్‌డేట్ చేస్తుంది. దానిలో కొత్త 210 సీసీ ఇంజన్‌ను ఇన్‌స్టాల్ చేయనున్నారు. కొత్త ఇంజన్ ఆన్‌రోడ్, ఆఫ్ రోడింగ్‌లో మంచి పర్ఫామెన్స్ అందిస్తోంది. ఇదే ఇంజన్ కరిజ్మాలో కూడా ఉంటుంది. ప్రస్తుతం ఈ బైక్‌లో 199.6 ఇంజన్ ఉంది. ఈ బైక్ గరిష్టవేగం గంటకు 135 కిలో మీటర్లు. బైక్ 32.92 కిమీ మైలేజ్ అందిస్తోంది.

Also Red: Anant Radhika Car Collection: కాస్ట్‌లీ పెళ్లి.. కోట్ల రూపాయల కార్లు.. ఎన్నేసి ఉన్నాయంటే!


హీరో ప్రస్తుతం ఉన్న ఎక్స్‌పల్స్ బైక్ ఆ సీసీ బెస్ట్ బైక్. ఇది 825 ఎన్ఎమ్ సీట్ హైట్ కలిగి ఉంటుంది. ఈ బైక్‌ను అన్ని రకాల రోడ్లపై సులభంగా డ్రైవ్ చేయవచ్చు. అంతేకాకుండా దీన్ని పూర్తిగా కంట్రోల్ చేయవచ్చు. బ్రేకింగ్ కోసం ఇందులో బైక్‌లో డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. దీనిలో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఇది రెండు వేరియంట్లలో, ఏడు కలర్ ఆప్షన్స్‌లో వస్తుంది.

ఈ బైక్ ఆన్‌రోడ్ ప్రైస్ ధర రూ. 1.72 లక్షలు. టాప్ మోడల్ ఆన్ రోడ్ ప్రైస్ 1.80 లక్షలు. బైక్‌లో ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, టెయిల్ లైట్లు ఉన్నాయి. ఫీచర్లలో బ్లూటూత్ కనెక్టవిటీ, స్పీడో మీటర్, 21 ఇంచ్ ఫ్రంట్ టైర్, 18 అంగుళాల రియల్ టైర్ స్పోర్క్ వీల్స్, ముందు టెలిస్కోపిక్ ఫోర్క్స్, మోనోషాక్ సస్పెన్షన్, డబుల్ డిస్క్ బ్రేక్, సింగిల్ పీస్ సీట్ ఉంది.

Also Read: New Car Buying Tips: కార్లపై డిస్కౌంట్లు.. భారీ స్కామ్.. ఇవి తెలుసుకోండి!

కొత్త ఎక్స్‌ప్లస్ 210 4V నేరుగా రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450తో పోటీపడుతుంది.ఇందులో 40 bhp పవర్ 40Nm టార్క్ ఉత్పత్తి చేసే 451.65cc సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంది. ఇందులో 6 స్పీడ్ గేర్‌బాక్స్ సౌకర్యం ఉంది. ఇదొక అడ్వెంచర్ టూరర్ బైక్. ఎకో, పెర్ఫార్మెన్స్ వంటి రైడింగ్ మోడ్‌లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ 230ఎమ్ఎమ్. ఈ బైక్‌లో 21 అంగుళాల ముందు, 17 అంగుళాల వెనుక టైర్లు ఉన్నాయి. ఇవి వైర్ స్పోక్ రిమ్‌తో ఉంటాయి. ఇందులో 17 లీటర్ ఇంధన ట్యాంక్, డిస్క్ బ్రేక్, డ్యూయల్ ఛానల్ ABS, కలర్ TFT డిస్‌ప్లే, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, అన్ని LED లైట్లు వంటి ఫీచర్లు ఉన్నాయి.

Related News

Gold Rate: అమ్మ బాబోయ్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..

Amazon Offers: అమెజాన్ గ్రేట్ ఇండియన్ పండగ సేల్ ప్రారంభం.. భారీ ఆఫర్ల వర్షం

WhatsApp: ఒకే ఫోన్‌లో 2 వాట్సప్ అకౌంట్లు.. లాగ్అవుట్ లేకుండా వాడే కొత్త ట్రిక్..

Amazon Great Indian Festival: బ్రాండెడ్ ఫ్రిజ్‌లపై 55 శాతం తగ్గింపు.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో భారీ ఆఫర్స్

Flipkart SBI Offers: ఫ్లిప్‌కార్ట్ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్.. ఎస్‌బిఐ క్రెడిట్ కార్డ్‌తో ఇన్ని లాభాలా?

Gold Rate Increase: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..!

Gold: ఈ దేశాల్లో టన్నులకొద్ది బంగారం.. మన దేశం ఏ స్థానంలో ఉందంటే?

Recharge offer: విఐ బిజినెస్ నుండి మెగా మాన్సూన్ ఆఫర్.. 449 రూపాయల ప్లాన్ ఇప్పుడు 349కే

Big Stories

×