BigTV English

Curd Benefits: వర్షాకాలంలో పెరుగు తింటే ఏం అవుతుంది.. ఆరోగ్యానికి మంచిదేనా.?

Curd Benefits: వర్షాకాలంలో పెరుగు తింటే ఏం అవుతుంది.. ఆరోగ్యానికి మంచిదేనా.?

Curd Benefits: వర్షాకాలం వచ్చిందంటే చాలా రకాల వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. ఈ తరుణంలో సరైన ఆహారం తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఇలా ఎన్ని ఉన్నా కూడా చాలా మంది భోజనం తర్వాత పెరుగు తినడకుండా అస్సలు ఉండలేరు. పెరుగు లేకుండా కొంత మంది భోజనం చేయకపోతే.. మరికొంత మంది మాత్రం పెరుగు తినడానికే ఇష్టపడరు. పెరుగును ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల చాలా మేలు చేస్తుంది. పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా ఎముకలు, కండరాలను బలోపేతం చేసేందుకు సహాయపడతాయి. అయితే పెరుగు సాధారణంగా ఏ సీజన్‌లో అయినా తీసుకోవచ్చు. కానీ చాలా మందికి కొన్ని అపోహాలు ఉంటాయి. కాలానుగుణంగా పెరుగును తీసుకుంటే మంచిది అని నమ్ముతారు. ఈ తరుణంలో వర్షాకాలంలో పెరుగును తీసుకోవాలా లేదా అని చాలా మంది ఆలోచిస్తుంటారు. పెరుగును వర్షాకాలంలో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదేనా కాదా అని ఆలోచిస్తుంటారు. దీనికి నిపుణులు ఏం సలహా ఇస్తున్నారు తెలుసుకుందాం.


వర్షాకాలంలో పెరుగును తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. తరచూ 200 గ్రాముల పెరుగును తీసుకోవడం వల్ల మలబద్ధకం వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అంతేకాదు జీర్ణక్రియ, మలబద్ధకం వంటి సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. గుండె ఆరోగ్యానికి పెరుగు తినడం వల్ల చాలా మేలు జరుగుతుంది. పెరుగులో ఉండే విటమిన్లు, ప్రోటిన్, కాల్షియం వంటి పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడతాయి. ముఖ్యంగా మధ్యాహ్న భోజనంలో పెరుగును తీసుకోవడం వల్ల చాలా మంచి లాభాలు ఉంటాయి.

రాత్రి వేళ పెరుగును తినకూడదని నిపుణులు అంటున్నారు. అయితే వర్షాకాలంలో పెరుగును తిసుకునే వారు పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. రాత్రిపూట పెరుగు ఎక్కువగా తీసుకుంటే జీర్ణసమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. రాత్రి వేళ పెరుగు కాకుండా దానిని మజ్జిగ రూపంలో తీసుకోవడం మంచిది. ఎందుకంటే రాత్రివేళ పెరుగును తీసుకుంటే అది జీర్ణం కావడానికి సమయం పడుతుంది. ఏ సమయంలోనైనా పెరుగును మజ్జిగ రూపంలో తీసుకోవాలి.


పెరుగును తినాలని అనిపించని సమయంలో మజ్జిగ రూపంలో తరచూ రోజుకు రెండు గ్లాసుల మజ్జిగ తాగడం మంచిది. ముఖ్యంగా మధ్యాహ్నం వేళ భోజనం తర్వాత మజ్జిగ తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉంటాయి. పెరుగులో ఉండే బ్యాక్టీరియా కడుపు సంబంధింత రోగాలను నయం చేసేందుకు తోడ్పడతాయి. అంతేకాదు జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరిచి, మలబద్ధకం సమస్యను కూడా దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×