America: అమెరికాలో మధ్యంతర ఎన్నికల ఫలితాలు జరుగుతున్న పరిణామాలు పెట్టుబడిదారులను వెంటాడుతున్నాయి. ఫలితాల రోజు భారీగా ఎగిసిన అమెరికా స్టాక్ మార్కెట్, మరుసటి రోజు ఊహించని విధంగా భారీగా పతనమైంది. డెమోక్రాట్స్ సభ్యులు చేసిన వ్యాఖ్యలు మదుపరుల్లో భయాలను రేకెత్తించాయి. దీంతో ఏఐ స్టాక్స్ అమ్మకాలకు దిగడంతో పతనమైంది.
అమెరికాలో మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో డెమోక్రాట్స్ ఘన విజయం సాధించడంతో పెట్టుబడుదారులు హ్యాపీగా ఫీలయ్యారు. కానీ ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. గంటల వ్యవధిలో ఆనందం కాస్త ఆవిరైపోయింది. ఎన్నికల్లో విజయం తర్వాత డెమోక్రాట్స్ సభ్యులు కీలక ప్రకటన చేశారు. ఏఐ డేటా సెంటర్ల విస్తరణను వ్యతిరేకించారు. దీనివల్ల పర్యావరణం దెబ్బతింటుందని, విద్యుత్ వినియోగం అధికంగా పెరుగుతుందని చెప్పుకొచ్చారు. సభ్యుల వాదనలు మార్కెట్‌ని దెబ్బ తీశాయి.
తాజా పరిణామాలు కొత్త డేటా సెంటర్ ప్రాజెక్టులపై కఠినతరం కావచ్చని పెట్టబడిదారులు భయపడ్డారు. ఈ క్రమంలో వాటికి సంబంధించి వివిధ కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. అమెరికాలో స్టాక్ మార్కెట్ దాదాపు ఆరేళ్ల తర్వాత భారీగా పతనమైంది. 2020లో ఈ స్థాయి పతనం అక్కడి మార్కెట్ చూసింది. ఏఐ భయాల కారణంగా పెట్టుబడుదారులు ఆ స్టాక్స్ అమ్మకాలకు పాల్పడ్డారు. దీంతో అక్కడి మార్కెట్ నుంచి దాదాపు 3 ట్రిలియన్ డాలర్ల సంపద ఆవిరైపోయింది. డౌ 1800 పాయింట్లు, నాస్‌డాక్ 5.5 శాతం సూచీలు కుప్పకూలాయి. గత 19 నెలల్లో అతి పెద్ద పతనాన్ని నమోదు చేసింది. ఇండెక్స్ కరెక్షన్ జోన్‌లోకి నెట్టివేసిందని రాయిటర్స్ పేర్కొంది.