Diwali Business Idea| దీపావళి వచ్చిందంటే చాలు.. మార్కెట్లన్నీ రంగురంగుల దీపాలు, కొవ్వొత్తులు, అలంకరణ వస్తువులతో కళకళలాడుతుంటాయి. ఈ పండుగ సమయంలో కొవ్వొత్తులకు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మీరూ సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా? అయితే మీ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు ఉండాల్సిన అవసరం లేదు. కేవలం రూ.10,000 నుంచి రూ.15,000 పెట్టుబడితో ఇంటి నుంచే కొవ్వొత్తుల తయారీ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. తక్కువ పెట్టుబడితో సొంతంగా సంపాదించాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.
దీపావళి సమయంలో చాలామంది తమ ఇళ్లు, దుకాణాలు, కార్యాలయాలను అందంగా అలంకరించుకుంటారు. ఇందుకోసం వివిధ రకాల కొవ్వొత్తులను కొనుగోలు చేస్తుంటారు. సాధారణ కొవ్వొత్తులతో పాటు రంగురంగుల, సువాసన వెదజల్లే, ఆకర్షణీయమైన డిజైనర్ క్యాండిల్స్‌కు కూడా ఆదరణ ఉంటుంది.
అంతేకాదు, పుట్టినరోజులు, పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఇతర వేడుకల్లో కూడా వీటిని ఉపయోగిస్తారు. గిఫ్ట్ ప్యాక్‌ల రూపంలో విక్రయిస్తే కస్టమర్లను మరింత ఆకర్షించవచ్చు. అందువల్ల ఈ వ్యాపారానికి పండుగల సమయంలోనే కాకుండా ఏడాది పొడవునా అవకాశాలు ఉంటాయి.
కొవ్వొత్తుల తయారీకి ప్రారంభంలో ఖరీదైన యంత్రాలు కొనాల్సిన అవసరం లేదు. చిన్న స్థాయిలో చేతులతోనే వివిధ డిజైన్ల క్యాండిల్స్ తయారు చేయవచ్చు. ఇందుకోసం కొన్ని ప్రాథమిక వస్తువులు అవసరమవుతాయి.
ఈ వస్తువులను హోల్‌సేల్ మార్కెట్లు లేదా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. మొదట తక్కువ మొత్తంలో ముడిసరుకు తెచ్చుకుని వ్యాపారాన్ని ప్రారంభించడం మంచిది.
Also Read: దీపావళి వేళ జాగ్రత్త.. టపాసులు కాల్చే ముందు పిల్లలకు ఈ 6 విషయాలు నేర్పించండి
మీరు తయారుచేసిన కొవ్వొత్తులను స్థానిక షాపులు, గిఫ్ట్ స్టోర్లు, డెకరేషన్ దుకాణాల్లో విక్రయించండి. హోల్‌సేల్ ధరలకు టోకు దుకాణదారులకు కూడా సరఫరా చేయవచ్చు. అలాగే వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా ఆర్డర్లు వచ్చేందుకు యాడ్స్ ఇవ్వండి. వివిధ రంగులు, ఆకారాలు, సువాసనలతో గిఫ్ట్ ప్యాక్‌లు తయారు చేసి అమ్మవచ్చు. పెళ్లిళ్లు, ఈవెంట్లు నిర్వహించే వారిని కూడా సంప్రదించవచ్చు.
Also Read: దీపావళికి ఇల్లంతా మెరిసిపోవాలా? ఇదిగో తక్కువ శ్రమతో ఈ హోమ్ క్లీనింగ్ టిప్స్
ఈ వ్యాపారంలో వచ్చే లాభం అమ్మకాలపై, తయారీ ఖర్చులపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, ఒక బ్యాచ్ కొవ్వొత్తుల తయారీ, ప్యాకింగ్ కోసం మొత్తం రూ.5,000 ఖర్చయిందనుకుందాం. వాటిని విక్రయించడం ద్వారా రూ.8,000 ఆదాయం వస్తే, ఖర్చులు పోను కేవలం ఒక్క బ్యాచ్ విక్రయంతోనే రూ.3,000 మిగులుతుంది. అయితే రవాణా, విద్యుత్, మార్కెటింగ్, పాడైన ఉత్పత్తుల ఖర్చులను కూడా లెక్కలోకి తీసుకోవాలి. మంచి నాణ్యత, ఆకర్షణీయమైన డిజైన్లు, సరైన ధరలతో కస్టమర్లను సంపాదించుకోవచ్చు.