Voter ID to replace Aadhaar: ఎన్నికల సంఘం తీసుకొచ్చిన ‘సర్’ విషయంలో ముందుకు వెళ్లాలని కేంద్రం డిసైడ్ అయ్యిందా? అందుకే విపక్షాలు ఆందోళనలు, ధర్నాలు చేసినా వెనక్కి తగ్గలేదా? ఆధార్ స్థానంలో సంక్షేమ పథకాలకు ఓటర్ ఐడీని లింక్ చేయాలని భావిస్తోందా? ఈ వ్యవహారంపై కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలపై భగ్గుమంటున్నాయి విపక్షాలు. అసలు ఏం జరిగింది?
కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన ‘సర్’ విషయంలో ముందుకు వెళ్లాలని భావిస్తోంది కేంద్రం. ఈ క్రమంలో తెరపైకి కొత్త అంశాలను తీసుకొస్తోంది. ఇప్పటివరకు సంక్షేమ పథకాలకు ఆధార్ స్థానంలో ఓటర్ ఐడీ లింకు చేయాలని భావిస్తోంది. ఓటర్ ఐడీ బయోమెట్రిక్ వివరాలను ప్రామాణికంగా తీసుకుంటామని కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ ప్రకటన చేశారు. మంత్రి ప్రకటనపై విపక్షాలు భగ్గుమన్నాయి. సర్ పేరుతో కోట్లాది మంది ఓట్లను తొలగించాలని ఆరోపిస్తున్నాయి విపక్షాలు. ఇప్పుడు సంక్షేమానికి దూరం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం కొత్త కుట్రకు తెరలేపిందని కాంగ్రెస్ కూటమి పక్షాలు ఆరోపించాయి.
ఆధార్ గురించి చెప్పనక్కర్లేదు. బయటకు వెళ్లాలంటే కచ్చితంగా ఆధార్ ఉండాల్సిందే. అది లేకుంటే ఏ పని కావడం లేదు. బస్సు ట్రావెలింగ్ మొదలు, పథకాలు, బ్యాంకు అకౌంట్లు ఇలా ఏది చూసినా అన్నింటికీ ఆధార్‌తో లింకు అయి వున్నాయి. చివరకు సంక్షేమ పథకాలు సైతం ఆధార్ ఆధారంగానే ఇస్తున్నాయి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు. ఇటీవల జరిగిన పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ 2026-27 జాతీయ వర్క్‌షాప్‌లో కేంద్రమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆధార్ నమోదు కేంద్రాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయన్నారు. కేవలం ఐదు నిమిషాల్లో ఆధార్ జారీ చేసే అవకాశం ఉందన్నారు. ఇకపై సంక్షేమ ఫలాల లబ్దిదారులకు ఇవ్వడానికి ఓటరు ఐడీ ప్రామాణికంగా తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.
ALSO READ: బ్యాంకు కస్టమర్లకు శుభవార్త.. వడ్డీ రేట్లు పెంపు, ఆనందంలో సీనియర్ సిటిజన్లు