ATM New Rules: సామాన్యుల నుంచి డబ్బులు గుంజేందుకు బ్యాంకులు రెడీ అవుతున్నాయా? దీపావళి తర్వాత ఎండీఆర్ వ్యవస్థ రానుండడంతో కొత్త ఆలోచనను తెరపైకి తెచ్చాయా? వన్ షార్ట్ టూ బర్డ్స్ ఫార్ములాను అమలు చేస్తున్నాయా? దీనిపై సామాన్యులు లబోదిబోమంటున్నాడు? ఇంతకీ కొన్ని బ్యాంకులు ఏటీఎంల్లో తీసుకొచ్చిన కొత్త వ్యవస్థ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కేంద్రం తీసుకొస్తున్న కొత్త కొత్త నిర్ణయాల వల్ల చాలామంది కస్టమర్లు బ్యాంకు ఏటీఎంలకు వెళ్లి నగదు తీసుకుంటున్నారు. నగరాల్లో అయితే నెలకు మూడుసార్లు, పల్లెల్లో నెలకు ఐదు సార్లు తమ బ్యాంకుల ఏటీఎంల నుంచి నగదు తీసుకోవచ్చు. దీని తర్వాత జరిగే ప్రతీ లావాదేవీలకు కస్టమర్లపై భారం వేస్తు్న్నాయి బ్యాంకులు. ఇందులో కొత్తదనం ఏమందని అనుకుంటున్నారా? అసలు పాయింట్‌కు వచ్చేద్దాం.
కొన్ని ప్రైవేటు బ్యాంకులు ఏటీఎంల్లో కొత్త సాఫ్ట్‌వేర్‌ని అప్‌గ్రేడ్ చేశాయి. ఒకప్పుడు ఏటీఎంకు వెళ్తే ఎంత కావల్సిస్తే అంత తీసుకునేవాడు సామాన్యుడు. కానీ ఇప్పుడు ఆ పద్దతి పోయింది. కేవలం మూడు ఆప్షన్లు మాత్రమే చూపిస్తుంది. రూ.500, రూ.4000, రూ.6500 అని ఏటీఎం డిస్‌ప్లే బోర్డుపై కనిపిస్తోంది. దీనివల్ల రూ.2000, రూ.5000 వేలు తీసుకునే సామాన్యుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.
రెండు లేదా మూడుసార్లు ఏటీఎం నుంచి మనీ తీసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల ఉచితంగా ఇచ్చిన ఆప్షన్లు అయిపోతున్నాయి. ఫలితంగా నెల వచ్చేసరికి సామాన్యుడి అకౌంట్ నుంచి ఛార్జీల రూపంలో ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి బ్యాంకులు. దీనిపై బ్యాంకు మేనేజర్లను కస్టమర్లు నిలదీస్తే, తమకు ఈ విషయం తెలియదని తప్పించు కుంటున్నారు. లేకుంటే ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తామని అంటున్నారు. మొత్తానికి సామాన్యుడికి తెలియకుండానే జేబుకు చిల్లులు పెడుతున్నాయి బ్యాంకులు.
ALSO READ: సంక్షేమ పథకాలకు ఇకపై ఓటర్ ఐడీ? కేంద్రం కొత్తగా ప్రతిపాదన, మండిపడుతున్న విపక్షాలు
అన్నట్లు దీపావళి తర్వాత ఎండీఆర్ వ్యవస్థ అమల్లోకి రానుంది. దానివల్ల రూ. 2000 దాటిన వ్యాపార లావాదేవీలపై సదరు వ్యాపారస్తునికి ఛార్జీ పడుతుంది. అందుకే చాలామంది క్యాష్ డిమాండ్ చేస్తున్నారు. దీన్ని పసిగట్టిన బ్యాంకులు, ముందుగా ఏటీఎంల్లో కొత్త సాఫ్ట్‌వేర్‌ని అప్‌గ్రేడ్ చేసి సామాన్యుడి నుంచి డబ్బులు గుంజుతున్నారు. మొత్తానికి ప్రభుత్వాల మొదలు అంతా సామాన్యుడి జేబుకు తెలియకుండానే చిల్లు పెడుతున్నారు.