E-Paper
Advertisement

కాఫీ తాగడానికి వస్తున్నారా? లేక ఆఫీస్ రన్ చేస్తున్నారా? వైరల్ అవుతున్న కెఫే కష్టాలు!

కాఫీ తాగడానికి వస్తున్నారా? లేక ఆఫీస్ రన్ చేస్తున్నారా? వైరల్ అవుతున్న కెఫే కష్టాలు!
Advertisement

Cafe Business: కంప్యూటర్ ముందు కూర్చుని వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి, పని వాతావరణం నుంచి కాస్త ఉపశమనం కోరుకునేవారికి ప్రస్తుత రోజుల్లో కెఫేలు ప్రత్యామ్నాయంగా మారాయి. కెఫేలో కాఫీ తాగుతూ పని చేసుకోవడం వల్ల మైండ్ రిఫ్రెష్ అవుతుందని చాలామంది ఉద్యోగులు భావిస్తున్నారు. ఉద్యోగుల పరంగా చూస్తే ఇది బాగానే ఉన్నప్పటికీ.. కెఫే నిర్వాహకులకు మాత్రం తీవ్ర నష్టాలను తెచ్చిపెడుతోంది. దీనిపై బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి పెట్టిన పోస్ట్.. ప్రస్తుతం వైరల్ గా మారింది. ఉద్యోగుల మూలన కెఫే నిర్వాహకులు ఎదుర్కొంటున్న సమస్యలపై మరోమారు చర్చయను లేవనెత్తింది.

రూ. 150 కాఫీ.. గంటలతరబడి మకాం!

బెంగళూరులోని ఇందిరానగర్‌లో దాదాపు రూ. 60 నుంచి 70 లక్షల భారీ పెట్టుబడితో తన స్నేహితుడు కొత్తగా ఒక కెఫే ప్రారంభించినట్లు విక్రమాదిత్య శుక్లా అనే వ్యక్తి ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. అయితే కొందరు కస్టమర్లు కేవలం రూ. 150 విలువైన కాఫీ ఆర్డర్ చేసి.. గంటలకొద్ది కెఫేలోనే మకాం పెడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ల్యాప్‌టాప్‌లు ఓపెన్ చేసి గంటల తరబడి.. కొన్నిసార్లు రోజంతా అక్కడే కూర్చుండిపోతున్నారని వాపోయారు.

Advertisement

కొత్త కస్టమర్లు వెనక్కి.. రివ్యూల భయం

కెఫేలోని సీట్లన్నీ ఫుల్ అవ్వండ వల్ల కొత్త కస్టమర్లకు ఖాళీ సీట్లు దొరకడం లేదని శుక్లా తన పోస్ట్ లో వివరించారు. లోపలికి వచ్చి సీట్లు లేవని చూసి చాలామంది వెనుతిరిగి వెళ్లిపోతున్నారని దీనివల్ల వ్యాపారం దెబ్బతింటోందని అన్నారు. అలాగని ఎక్కువసేపు కూర్చున్న కస్టమర్లను ఖాళీ చేసి వెళ్లమని చెప్పలేరని.. ఒకవేళ అలా అడిగితే గూగుల్‌లో నెగెటివ్ రివ్యూలు ఇస్తారనే భయంతో యజమానులు ఏమీ అనలేకపోతున్నారని తెలిపారు.

కాఫీ ధరకు తోడు సీటు ‘రెంట్’ కూడా!

Advertisement

ఈ పరిస్థితులను చూస్తుంటే.. పెద్ద కాఫీ చైన్ నెట్‌వర్క్‌ల ధరలపై అవగాహన వచ్చిందని శుక్లా అభిప్రాయపడ్డారు. స్టార్‌బక్స్, కేఫ్ కాఫీ డే, థర్డ్ వేవ్ వంటి ప్రముఖ కెఫేలలో కాఫీలు, స్నాక్స్ ధరలు అంత ఎక్కువగా ఎందుకు ఉంటాయో ఇప్పుడు అర్థమవుతోందన్నారు. అక్కడ కస్టమర్లు కేవలం కాఫీకి మాత్రమే కాకుండా వారు కూర్చునే సీటు రెంట్‌కు కూడా కలిపి చెల్లిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

Also Read: జియో మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. కేవలం రూ.15లకే అన్‌లిమిటెడ్ 5G డేటా!

సోషల్ మీడియా రియాక్షన్స్..

శుక్లా పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కెఫేలో కూర్చునే ప్రతి గంటకు ఒక ఆర్డర్ కచ్చితంగా చేయాలనే నిబంధనను అమలు చేయాలని ఒకరు సూచించారు. ‘బిజినెస్ మోడల్ మార్చేయండి. కాఫీని కాకుండా సమయాన్ని అమ్మండి. ప్రతి గంటకు కాఫీని ఫ్రీగా ఇవ్వండి’ అని మరొకరు ఐడియా ఇచ్చారు. అసలు ల్యాప్ టాప్ తో వచ్చేవారికి కెఫేలో అనుమతి ఇవ్వకపోతే ఏ గోల ఉండదని ఇంకొకరు కామెంట్ చేశారు. ప్రముఖ కెఫేల మాదిరిగానే కస్టమర్ చేసే బిల్లును బట్టి సమయాన్ని కేటాయించాలని చాలా మంది అభిప్రాయపడ్డారు.

Also Read: దీపావళికి అదిరిపోయే స్టైలిష్ డ్రెస్ కావాలా.. ఈ ట్రెండీ అవుట్‌ఫిట్స్ ట్రై చేయండి

Tags

Related News

ఇల్లు షిఫ్ట్ చేస్తుండగా వస్తువులు మాయం.. ఏసీ, టీవీ ధ్వంసం.. మూవర్స్, ప్యాకర్స్‌పై కేసు

నెలకు రూ.24 లక్షల జీతం, క్రెడిట్ స్కోర్ 750.. అయినా హోమ్ లోన్ తిరస్కరించిన బ్యాంక్?

మీ అమ్మానాన్న వయసు 60 ఏళ్లు దాటిందా? పెన్షన్ పొందాలంటే ఈ విషయాలు తెలుసుకోండి

డెయిరీ ఫామ్ బిజినెస్ చేయాలనుకుంటున్నారా? ఈ 5 జాతుల ఆవులే బెస్ట్

అమెరికా ఎన్నికల ఫలితాలు.. స్టాక్‌మార్కెట్లో దీపావళి పండగ.. తారాజువ్వలా ఎగిసిన సెన్సెక్స్-నిఫ్టీ సూచీలు

ఈ ధన త్రయోదశికి బంగారం కొనాలా? వద్దా?

బ్యాంక్ ఎఫ్‌డీల కన్నా ఎక్కువ లాభం కావాలా? రిస్క్ లేకుండా అధిక వడ్డీ ఇచ్చే ప్రభుత్వ పథకాలు ఇవే!

Big Stories

Advertisement
×