BigTV English

Vande Bharat: విశాఖ-సికింద్రాబాద్ మధ్య వందే భారత్ సేవలు రద్దు.. ఈ డీటెయిల్స్ చూసుకోండి

Vande Bharat: విశాఖ-సికింద్రాబాద్ మధ్య వందే భారత్ సేవలు రద్దు.. ఈ డీటెయిల్స్ చూసుకోండి

Indian Railways: రైలు ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ప్రారంభించడానికి ముందు కొన్ని ముఖ్యమైన వివరాలు తెలుసుకోవడం అవసరం. వర్షాలు, వరదల నేపథ్యంలో ట్రైన్లు రద్దయిపోతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సందీప్ కీలక ప్రకటన చేశారు. విశాఖపట్నం – హైదరాబాద్ మధ్య నడిచే వందే భారత్ రైల్వే సర్వీసులను ఈ నెల 6వ తేదీన రద్దు చేస్తున్నట్టు తెలిపారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.


20707 సికింద్రాబాద్ – విశాఖపట్నం సేవలు
20708 విశాఖపట్నం – సికింద్రాబాద్ సేవలు రద్దు చేస్తున్నట్టు సందీప్ వెల్లడించారు. అలాగే..
20833 విశాఖపట్నం – సికింద్రాబాద్
20834 సికింద్రాబాద్ – విశాఖపట్నం సర్వీసులను రద్దు చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. కాబట్టి, ఈ రైలు సేవల రద్దు విషయాన్ని గమనించుకుని తమ ప్రయాణాలను షెడ్యూల్ చేసుకోవాలని, తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

భారత రైల్వే శాఖ ఇటీవలే వందే భారత్ స్లీపర్ ట్రైన్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్లీపర్ ట్రైన్ కంటే ఈ వందే భారత్ స్లీపర్ ట్రైన్‌లో దిమ్మదిరిగే ఫీచర్స్ ఉన్నాయి. వరల్డ్ క్లాస్ ఫీచర్స్‌ను వందే భారత్ స్లీపర్ ట్రైన్ ప్రయాణికులకు అందించనుంది. త్వరలోనే ఈ ట్రైన్ పట్టాలెక్కనుంది.


Also Read: Social Media: రెచ్చగొడితే అరెస్టే..! దిలీప్ అరెస్ట్‌తో రాష్ట్రవ్యాప్తంగా చర్చ

ఈ ఫీచర్స్‌లో ముఖ్యంగా.. ట్రైన్ స్పీడ్, ప్రయాణికుల భద్రత, సౌకర్యాలన ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఫైర్ సేఫ్టీ, క్రాష్ వర్తీ ఎలిమెంట్స్ ఏర్పాటు చేశారు. ఇంటిగ్రేటెడ్ రీడింగ్ లైట్, యూఎస్ బీ చార్జింగ్ పోర్టు, పబ్లిక్ అనౌన్స్‌మెంట్, విజువల్ ఇన్ఫర్మేషన్, డిస్‌ప్లే ప్యానె్లస్, సెక్యూరిటీ కెమెరాలు, మాడ్యులర్ ప్యాంట్రీలు సహా పలు ఫీచర్లను ఈ వందే భారత్ స్లీపర్ ట్రైన్ అందించనుంది. ఇటీవలే కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బెంగళూరులో ఈ ప్రోటోటైప్ మాడల్‌ను ఆవిష్కరించారు.

వందే భారత్ స్లీపర్ ట్రైన్‌లో మొత్తం 16 బోగీలు ఉంటాయి. అందులో 11 ఏసీ థర్డ్ టయర్, నాలుగు సెకండ్ టయర్ ఏసీ కోచ్‌లు, ఒకటి ఫస్ట్ ఏసీ బోగీ ఉంటుంది.

Related News

Protest Against D-Mart: డిమార్ట్ కు వ్యతిరేకంగా ఆందోళన, ఇదేం కొత్త పంచాయితీ సామీ!

Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతో తెలుసా?

పది నిమిషాల్లో ల్యాండ్ కొనేయండి.. వావ్, ఆ యాప్ నుంచి సరికొత్త సర్వీస్!

Tata Sierra SUV: రెండు వెర్షన్లలో టాటా సియెర్రా, ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!

Google Fined: గూగుల్ కు షాక్, రూ. 300 కోట్లు జరిమానా విధించిన ఆస్ట్రేలియా!

Cheques: చెక్కుల వెనుక సంతకం ఎందుకు చేస్తారో మీకు తెలుసా?

Big Stories

×