BigTV English

రిటైర్ అయ్యాక ప్రతి నెలా 1 లక్ష రూపాయల పెన్షన్ కావాలా..అయితే ఇలా ఇన్వెస్ట్ చేయండి..?

రిటైర్ అయ్యాక ప్రతి నెలా 1 లక్ష రూపాయల పెన్షన్ కావాలా..అయితే ఇలా ఇన్వెస్ట్ చేయండి..?

ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల గవర్నమెంట్ పెన్షన్ అందిస్తుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అయితే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి పే రివిజన్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా పెన్షన్ అందిస్తారు. అది కూడా ప్రతి పే రివిజన్ కమిషన్ లోనూ పెరుగుతూ వస్తుంది. తద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్ అయ్యాక తమ జీవితాలను కాపాడుకునేందుకు ఈ మొత్తం చాలా ఉపయోగపడుతుంది. అయితే ప్రైవేటు ఉద్యోగులకు మాత్రం పెన్షన్ అనేది ఉండదు. రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ లేకపోయినట్లయితే వృద్ధాప్యంలో రిటైర్ అయిన వారు తమ జీవితాలను కొనసాగించడం అనేది చాలా కష్టతరం అవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని వివిధ పథకాల ద్వారా సర్వీస్ లో ఉన్నప్పుడే ప్రైవేటు ఉద్యోగులు మదుపు చేసినట్లయితే ఆ మొత్తం రిటైర్మెంట్ అనంతరం పెన్షన్ రూపంలో పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ప్రతినెలా ఒక లక్ష రూపాయల వరకు పెన్షన్ పొందగలిగే ఫైనాన్షియల్ ప్లాన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మీరు సర్వీస్ లో ఉన్నప్పుడే ఎలాంటి ప్లాన్ ఎంపిక చేసుకున్నట్లయితే రిటైర్మెంట్ అనంతరం సంవత్సరానికి 12 లక్షల రాబడి పొందగలిగే స్కీం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.


రిటైర్మెంట్ నాటికి ఎంత కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలి..
స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ద్వారా మీరు ప్రతి నెల రిటైర్మెంట్ అనంతరం లక్ష రూపాయలు పొందగలిగే ఒక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసుకోవచ్చు ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. . ముందుగా అసలు కార్పస్ ఫండ్ ఎంత ఏర్పాటు చేసుకున్నట్లయితే రిటైర్మెంట్ అనంతరం ఉదాహరణకు మీ వయసు 60 సంవత్సరాలు ఉన్నప్పుడు సంవత్సరానికి 12 లక్షల రావాలంటే ఎంత కార్పస్ ఫండ్ పోగు చేయాల్సి ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కనీసం రెండు కోట్ల రూపాయలను కార్పస్ ఫండ్ రూపంలో మీరు పోగు చేయగలిగితే రిటైర్మెంట్ అనంతరం ప్రతినెలా లక్ష రూపాయల వరకు పెన్షన్ రూపంలో ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఈ రెండు కోట్ల రూపాయలను మీరు కార్పస్ ఫండ్ కింద పోకు చేసుకోవాలి అనుకున్నట్లయితే, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మదుపు చేయాల్సి ఉంటుంది. కనీసం మీ సర్వీసులో 30 సంవత్సరాల పాటు నెలకు 5000 నుంచి పదివేల రూపాయల వరకు మ్యూచువల్ ఫండ్స్ లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ రూపంలో (SIP) పెట్టుబడి పెట్టినట్లయితే కనీసం రెండు కోట్ల రూపాయలు మీరు పొందే అవకాశం ఉంటుంది. అయితే సంవత్సరానికి 12 నుంచి 13% రాబడి కలిగినప్పుడు మాత్రమే ఈ మొత్తం మీరు పొందగలరు.

1 లక్ష పెన్షన్ పొందే మార్గాలు ఇవే..
>> ఇందుకోసం కనీసం 6% రాబడి ఇవ్వగలిగే యాన్యుటి ప్లాన్స్, డెట్ ఫండ్స్, ఫిక్స్ డిపాజిట్ స్కీముల్లో సుమారు రెండు కోట్ల రూపాయలను మదుపు చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీరు రిటైర్మెంట్ అనంతరం ప్రతినెల 1 లక్ష రూపాయల వరకు పెన్షన్ పొందగలరు.


>> మీ వద్ద ఉన్న రూ. 2 కోట్ల కార్పస్ ఫండ్ ను ఎనిమిది శాతం రాబడి ఇవ్వగలిగే సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీం, బ్యాలెన్స్ హైబ్రిడ్ ఫండ్స్, ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్ లాంటి స్కీముల్లో పెట్టుబడి పెట్టినట్లయితే, మీరు ప్రతి నెల లక్ష రూపాయలకు పైగా రాబడి పొందవచ్చు. అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్, లార్జ్ క్యాప్ ఫండ్స్, లార్జ్ మిడ్‌క్యాప్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం వల్ల కూడా మీ పెట్టుబడిపై చక్కటి ఆదాయం పొందవచ్చు.

అయితే మీ వద్ద ఉన్న కార్పస్ ఫండ్ కేవలం ఒకే తరహా స్కీముల్లో పెట్టుబడి పెట్టడం వల్ల రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ మొత్తాన్ని మీరు వివిధ రకాలుగా డైవర్సిఫై చేయాల్సి ఉంటుంది. మీ వద్ద ఉన్న రెండు కోట్ల రూపాయలను కేవలం మ్యూచువల్ ఫండ్స్ లో మాత్రమే కాకుండా, ఫిక్స్ డిపాజిట్ లలో ఉంచాల్సి ఉంటుంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు ఎక్కువ వడ్డీ చెల్లించే అవకాశం ఉంటుంది. అలాగే పోస్ట్ ఆఫీస్ కి కూడా ఈ డబ్బులు ఇన్వెస్ట్ చేయవచ్చు. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలను కూడా ఇందులో చేర్చుకోవాల్సి ఉంటుంది. హెల్త్ ఇన్సురెన్స్ లేకపోతే మీరు ఆసుపత్రిపాలైనప్పుడు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చవుతుంది. అలాగే ఈ మధ్యకాలంలో బంగారం పైన ఎక్కువగా రాబడి లభిస్తోంది కనుక గోల్డ్ ఈటీఎఫ్ స్కీముల్లో కూడా మీ డబ్బులు మదుపు చేయడం ద్వారా మంచి రాబడి పొందవచ్చు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. దీన్ని పెట్టుబడి సలహాగా భావించకూడదు. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటాయి. బిగ్ టీవీ తెలుగు పోర్టల్ ఎటువంటి పెట్టుబడి సలహాలు ఇవ్వదు. మీ పెట్టుబడులకు, ఆర్థిక లావాదేవీలకు మీరే బాధ్యులు. ఏదైనా పెట్టుబడి చేసే ముందు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోవడం మంచిది.

Related News

Tesla Sales: ఇండియాలో ఫస్ట్ టెస్లా కార్ ఓనర్ ఆయనే.. ఆ కారు ఫీచర్లు ఇవే

BSNL Offer: 72 రోజుల వ్యాలిడిటీ, డైలీ 2GB డేటా.. BSNL నుంచి మరో అదిరిపోయే ప్లాన్!

Today Gold Price: తగ్గినట్టే తగ్గి మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు..

Flipkart Offer: ఎంత షాపింగ్ చేసినా సేవింగ్స్ గ్యారెంటీ.. ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ డీల్

Jio Special Offers: ఫ్రీ డేటా.. OTT యాక్సెస్.. జియో బర్త్ డే గిఫ్ట్ అదిరిందిగా!

Big Stories

×