E-Paper
Advertisement

Sujeeth: సుజీత్ కరుడుగట్టిన కళ్యాణ్ అభిమాని.. ఏం చేశాడంటే?

Sujeeth: సుజీత్ కరుడుగట్టిన కళ్యాణ్ అభిమాని.. ఏం చేశాడంటే?

Sujeeth: ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలలో చాలామంది మోస్ట్ ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్న ప్రాజెక్టు ఓజి. పవన్ కళ్యాణ్ నటిస్తున్న స్ట్రైట్ ఫిలిం. ముఖ్యంగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్స్ చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సుజిత్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. స్వతహాగా సుజిత్ ఎంత పెద్ద అభిమానం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ సినిమా చేస్తున్నాడు అని అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు, గబ్బర్ సింగ్ సినిమాకు సుజిత్ చేసిన హడావిడి వీడియోలు వైరల్ గా మారాయి.

అక్కడితో సుజిత్ పవన్ కళ్యాణ్ కు ఎంత పెద్ద అభిమాని అని చాలామందికి ఒక క్లారిటీ వచ్చింది. అందుకే సుజిత్ తో పవన్ కళ్యాణ్ సినిమా అనౌన్స్ చేయగానే, చాలామందికి క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఇక ప్రస్తుతం ఓ జి సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమాలో చాలా అందంగా కనిపిస్తుండటం ఫ్యాన్స్ కు ఉత్సాహాన్ని ఇచ్చింది.

కరుడుగట్టిన కళ్యాణ్ అభిమాని..

పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో సుజిత్ కు బాగా ఇష్టమైన సినిమా జానీ. జానీ సినిమా విడుదలైనప్పుడు సుజిత్ ఆ బ్యాండేజ్ తలకు కట్టుకొని ఆ సినిమాకి వెళ్ళాడు. సినిమా ఊహించని స్థాయిలో సక్సెస్ కాలేదు. చాలామంది అప్పట్లో సుజిత్ ను ట్రోల్ చేశారు. అయితే వారం రోజులు పాటు సుజిత్ ఆ తలకి ఉన్న బ్యాండేజ్ ఇవ్వలేదు. అలానే స్నానం చేయటం. ఆ బ్యాండేజ్ వేసుకొని పడుకోవటం లాంటివి చేసేవాడు.

కొన్ని రోజుల క్రితం సుజిత్ తలకు ఓజి సినిమా పేరుతో ఒక బ్యాండేజ్ కనిపించింది. సుజిత్ ఈ బ్యాండేజ్ కట్టుకోవడం వెనక కారణం జానీ సినిమా రోజులు. గతంలో కూడా ఒక ఇంటర్వ్యూలో ఈసారి ఓ జి సినిమాకు బ్యాండేజ్ కట్టుకుని వెళ్తా అని సుజీత్ చెప్పాడు. చెప్పిన మాదిరిగానే బ్యాండేజ్ లు రెడీ చేశాడు. దీన్నిబట్టి సుజిత్ పవన్ కళ్యాణ్ కి ఎంత పెద్ద అభిమాని అని మరోసారి రుజువు అవుతుంది.

భారీ అంచనాల మధ్య 

ఇక ఓజి సినిమా విషయానికి వస్తే ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించుకోలేకపోయాయి. అయితే వాటన్నిటికంటే డిఫరెంట్ గా ఈ సినిమా సక్సెస్ సాధించింది అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు పండుగ అని చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ప్రోపర్ గా హిట్ సినిమా వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది. గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది లాంటి సక్సెస్ పవన్ కెరియర్ కి ఇప్పుడు పడితే పవన్ అభిమానులకు ఇంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు.

Also Read: Ram Pothineni: ఆమెతో ప్రేమలో పడ్డాక కొత్త కొత్త పనులన్నీ చేస్తున్నాడు

Related News

నెట్టింట వైరల్ అవుతున్న మృణాల్ ‘ఐస్‌క్రీమ్ రైస్’.. అంతలా అడిక్ట్ అయిపోయిందా?

అర్ధరాత్రి ఆ వీడియో డిలీట్ చేయడానికి కారణం అదే….. నిజం చెప్పేసిన బాలీవుడ్ బ్యూటీ!

‘రైరై రారా’ సాంగ్‌కు థియేటర్లోనే పూనకాలు.. ‘పెద్ది’ లేడీ ఫ్యాన్ మాస్ అరాచకం!

సడన్‌గా కాంట్రవర్సీలో ఇరుక్కున్న అనుష్క శర్మ.. ఆ ఒక్క పోస్టే కారణమా?

ఆమిర్ ఖాన్ కెరీర్ బెస్ట్ క్లాసిక్ ‘లగాన్’.. 25 ఏళ్ల వేడుకగా థియేటర్లలోకి రీ రిలీజ్!

‘డాన్ 3’ వివాదం.. రణ్‌వీర్ సింగ్‌పై ఆర్డర్ ఉపసంహరణ.. ఇంకా ముగియని గొడవ!

మెగా పవర్ స్టార్ బాక్సాఫీస్ జాతర.. ఊళ్లో సంబరాలు మామూలుగా లేవుగా..

దీపికా పదుకొణె డిప్రెషన్‌పై ప్రకాష్ పదుకొణె ఎమోషనల్.. ఏం జరిగిందంటే?

Big Stories

×