ఈ మధ్యకాలంలో యూత్ ఎక్కువగా ఫ్యాషన్ ట్రెండీ దుస్తులను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా జూడియో షోరూంలో షాపింగ్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. టాటా గ్రూప్ కు చెందినటువంటి ఈ సంస్థ ఎక్కువగా మధ్యతరగతి ప్రజలను ఆకర్షించడంతోపాటు యూత్ ను టార్గెట్ గా చేసుకొని రండి డిజైన్లను అందుబాటులో ఉంచుతుంది. నిజానికి జుడియో షోరూమ్ చూడటానికి చాలా క్లాసీ గా ఉంటుంది. ప్రీమియం దుస్తుల షోరూమ్ లకు ఏమాత్రం తీసిపోకుండా ఉంటుంది. అయినప్పటికీ ఇందులో ధరలు మాత్రం ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ఎక్కువగా రూ. 199 నుంచి రూ. 999 రేంజ్ లోనే దుస్తులు లభిస్తూ ఉంటాయి.
ఈ బిజినెస్ మోడల్ సక్సెస్ అవడానికి ఇదే ప్రధాన కారణం అని చెప్పవచ్చు. కాలేజీ యూత్, కొత్తగా కెరీర్ ప్రారంభించినటువంటి యువతను దృష్టిలో ఉంచుకొని డిజైన్స్ అందుబాటులో ఉంటున్నాయి. అసలు జుడియో చక్కటి క్వాలిటీ ఉన్నటువంటి ఈ దుస్తులను అంత తక్కువ ధరకు ఎందుకు విక్రయిస్తుంది దీని వెనుక ఉన్నటువంటి బిజినెస్ సీక్రెట్ గురించి తెలుసుకుందాం.
>> ముఖ్యంగా పిల్లలు, టీనేజీ యువతీ యువకులు, పెద్దలనుంచి అన్ని వయసుల వారికి ట్రెండీ ఫ్యాషన్ డిజైన్స్ తక్కువ ధరలో అందుబాటులో ఉంచడం ద్వారా అన్ని వర్గాలకు రీచ్ అవడం మే లక్ష్యంగా పెట్టుకొని జుడియో బిజినెస్ మోడల్ తయారు చేశారు.
>> తక్కువ ధరతో ఉండటంతో పాటు చక్కటి క్వాలిటీ మెయింటైన్ చేయడం కూడా జూడియో సక్సెస్ వెనక ఒక కారణంగా చెప్పవచ్చు.
>> జూడియో షో రూమ్ లో దుస్తుల ధరలు తక్కువగా ఉండటానికి కారణం.. బల్క్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక రీజన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే జూడియో సంస్థకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా ఉండటంతో వీరికి దుస్తుల తయారీకి తక్కువ ధరకు ఎండ్ కస్టమర్ కు అందించేందుకు వీలు దక్కుతుంది. దీనికి తోడు ఇతర బ్రాండ్స్ కోసం థర్డ్ పార్టీ నుంచి కాకుండా నేరుగా తయారీదారుల నుంచే వీరు దుస్తులను సేకరిస్తారు దీనివల్ల ధర తగ్గుతుంది.
>> డిజైన్స్ విషయంలో సింపుల్ గా ఉండే ఆప్షన్స్ ఎంపిక చేసుకోవడం కూడా ధర తగ్గడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. అలాగే పబ్లిసిటీ విషయంలో కూడా ఎక్కువగా ప్రమోషన్స్ జోలికి వెళ్లకుండా కేవలం మౌత్ పబ్లిసిటీ మీదనే ఆధారపడటం కూడా జూడియో సక్సెస్ వెనుక ఉన్న ఒక కారణంగా చెప్పవచ్చు.
>> హై వాల్యూమ్ ప్రొడక్షన్ వల్ల మార్జిన్ తక్కువగా ఉంచుకొని దుస్తులను విక్రయిస్తుంటారు. ఇది కూడా జూడియో షోరూం సక్సెస్ వెనక ఒక కారణం అని చెప్పవచ్చు. షోరూమ్స్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎక్కడ ఏ డిజైన్స్ కు డిమాండ్ ఉందో గుర్తించి, అమ్ముడుపోని సరుకును మరోచోటికి తరలిస్తూ ఉంటారు. ఇది కూడా జూడియో సక్సెస్ వెనక ఉన్న ఒక కారణంగా చెప్పవచ్చు.
>> జూడియో షోరూంలు 765 స్టోర్లు, 235 నగరాల్లో Zudio విస్తరించింది. ప్రధానంగా నాన్ మెట్రో సిటీలలో షోరూంలో విస్తరించి, తక్కువ ధరలో దుస్తులను ఉంచడం ద్వారా సేల్స్ పెరిగి రాబడి పెరిగింది.గత ఆర్థిక సంవత్సరంలో జూడియో రూ. 8,537 కోట్ల రికార్డ్ రాబడి సాధించింది. అంతేకాదు గడిచిన 4 ఏళ్లలో 1200% వృద్ధి సాధించింది.