BigTV English

Ntr – Neel : ఎన్టీఆర్ ‘ డ్రాగన్’ మూవీలో ఇద్దరు స్టార్ హీరోలు.. నీల్ మామా ప్లాన్ ఏంటబ్బా..?

Ntr – Neel : ఎన్టీఆర్ ‘ డ్రాగన్’ మూవీలో ఇద్దరు స్టార్ హీరోలు.. నీల్ మామా ప్లాన్ ఏంటబ్బా..?

Ntr – Neel : టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ చిత్రంతో వరల్డ్ ఫేమస్ స్టార్ అయిపోయాడు.. ఆ తర్వాత దేవర చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు.. రీసెంట్ గా బాలీవుడ్ లోకి వార్ 2 చిత్రంతో అడుగుపెట్టాడు.. భారీ యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కిన ఈ చిత్రం రీసెంట్గా థియేటర్లోకి వచ్చేసింది.. ఒకవైపు మిక్స్డ్ టాక్ అందుకున్న మరోవైపు మాత్రం బాక్సాఫీస్ ని షేర్ చేసేలా కలెక్షన్స్ ని కొల్లగొట్టేస్తుంది.. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ సలార్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది..


ఎన్టీఆర్ ‘డ్రాగన్ ‘ కోసం ఇద్దరు హీరోలు..? 

ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ యాక్షన్ మూవీ డ్రాగన్… ఇటీవలే రెగ్యులర్ షూట్లో పాల్గొంటున్న ఎన్టీఆర్ ఈ సినిమాని త్వరగా పూర్తిచేయాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.. షూటింగు పూర్తి చేసుకున్న ఈ మూవీ సెట్ లోకి మరో ఇద్దరు స్టార్ హీరోలు రాబోతున్నట్లు ఓ వార్త ఇండస్ట్రీలో షికారు చేస్తుంది.. ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్ ను డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హిందీ వెర్షన్ లో ఈ పాత్రలో ఓ హిందీ హీరోని, తమిళ వెర్షన్ లో ఓ తమిళ హీరోని తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట.. ఈ మూవీ ఎన్టీఆర్ లైఫ్ లో బెస్ట్ మూవీగా నిలుస్తుందని టాక్..


ప్రశాంత్ నీల్ అందుకే ఆలస్యం చేశాడా..? 

ఎన్టీఆర్ లైఫ్ లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా రాబోతున్న ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. సలార్, కేజిఎఫ్ వంటి సినిమాలతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా చేయాలని ప్రశాంత్ నీల్ ప్రయత్నం చేస్తున్నాడట. అందుకే, ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ప్రశాంత్ నీల్ చాలా టైమ్ తీసుకున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. అన్నట్టు ఈ సినిమాలోని ఓ స్పెషల్ యాక్షన్ సీక్వెన్స్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్ ను వేస్తున్నట్లు తెలుస్తోంది..

Also Read: కన్నడ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. KGF నటుడు కన్నుమూత..

అతి త్వరలోనే ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన రాబోతుందని సమాచారం.. ఇక ఎన్టీఆర్ ఇప్పటికే బాలీవుడ్ లో అడుగుపెట్టి స్టార్ ఇమేజ్ ని అక్కడ కూడా సొంతం చేసుకున్నాడు. అటు బాలీవుడ్ లో మరో ప్రాజెక్ట్ లో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాదు తమిళ స్టార్ డైరెక్టర్ తో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. మొత్తానికి ఎన్టీఆర్ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు..

Related News

Ghaati Movie: అనుష్క ‘ఘాటి’ హక్కులు తీసుకున్న స్టార్‌ హీరో..

Actor Yash: డైరెక్టర్‌గా మారిన హీరో యష్.. ఇక థియేటర్లు దద్దరిల్లి పోవాల్సిందే!

War 2 Losses : వార్ 2 మూవీకి 70 కోట్ల నష్టం… బిజినెస్ – కలెక్షన్స్ పూర్తి లెక్కలు

Kollam Thulasi: భార్య, కూతురు ఛీ కొట్టారు.. అనాథలా ఆశ్రమంలో ప్రముఖ నటుడు

Dhanush: ఒక్క లైక్.. ఎట్టకేలకు పెళ్లికి సిద్ధమైన ధనుష్ – మృణాల్.. పోస్ట్ వైరల్!

AA 26× A6: సినీ కార్మికుల సమ్మె.. రోజుకు కోట్లలో నష్టపోయిన బన్నీ నిర్మాతలు!

Big Stories

×