E-Paper
Advertisement

మారుతి బాలెనో vs టాటా ఆల్ట్రోజ్.. టాప్ వేరియంట్లలో ఏది బెస్ట్?

మారుతి బాలెనో vs టాటా ఆల్ట్రోజ్.. టాప్ వేరియంట్లలో ఏది బెస్ట్?
Advertisement

Maruti Baleno vs Tata Altroz:  ప్రీమియం హ్యాచ్‌ బ్యాక్ కొనాలనుకునేవారికి మారుతి సుజుకి బాలెనో, టాటా ఆల్ట్రోజ్ రెండూ బెస్ట్ ఆప్షన్లుగా కొనసాగుతున్నాయి. రెండు కార్ల టాప్ వేరియంట్లలోనూ ఫీచర్లు బాగానే ఉన్నాయి. అయితే ధర, టెక్నాలజీ, సౌకర్యాలు, భద్రత విషయంలో కొన్ని కీలకమైన తేడాలు కనిపిస్తాయి. ప్రస్తుతం బాలెనో ఆల్ఫా (O), ఆల్ట్రోజ్ అకంప్లిష్డ్+ S వేరియంట్లను పోల్చి చూస్తే ఏ కారులో ఏ ఫీచర్లు ఉన్నాయో తెలుసుకుందాం.

డిజైన్, బయట ఫీచర్లు

రెండు కార్లలోనూ LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, LED DRLs, LED టెయిల్ ల్యాంప్స్, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్, ఫోల్డింగ్ ORVMలు, రియర్ వైపర్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే, ఆల్ట్రోజ్‌లో ఫ్లష్ ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, డ్యూయల్ టోన్ రూఫ్ లాంటి అడిషనల్ డిజైన్స్ కనిపిస్తాయి. బాలెనోలో UV కట్ గ్లాస్, క్రోమ్ గార్నిష్‌ తో కూడిన పుల్ టైప్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. బయట ఫీచర్ల పరంగా రెండింటి మధ్య పెద్ద తేడా కనిపించదు.

క్యాబిన్‌లో లో ఫీచర్లు   

Advertisement

ఇంటీరియర్‌లో మాత్రం రెండు కార్ల మధ్య స్పష్టమైన తేడాలు ఉన్నాయి. ఆల్ట్రోజ్‌లో 10.25-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. దీనికి సన్‌రూఫ్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, వెనుక ఆర్మ్‌ రెస్ట్ కూడా లభిస్తాయి. బాలెనోలో స్క్రీన్ పరిమాణం 9 అంగుళాలే అయినప్పటికీ, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, హెడ్ అప్ డిస్‌ప్లే లాంటి ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. రెండు కార్లలోనూ వైర్‌లెస్ Android Auto, Apple CarPlay, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెనుక AC వెంట్లు, వైర్‌ లెస్ ఛార్జింగ్ అందుబాటులో ఉన్నాయి.

టెక్నాలజీలో కీలక తేడా!

టెక్నాలజీ విషయంలో బాలెనోకు ముఖ్యమైన ప్లస్ ఉంది. ఇందులో లెవెల్ 2 ADAS ప్యాకేజీతో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్, అడ్వాన్స్‌డ్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. ఆల్ట్రోజ్‌లో బ్లైండ్ స్పాట్ మానిటర్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, ఎయిర్ ప్యూరిఫైయర్, SOS కాలింగ్ లాంటి సౌకర్యాలు ఉన్నాయి. రెండు మోడళ్లలోనూ 360-డిగ్రీ కెమెరా, వాయిస్ అసిస్టెంట్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ ఉన్నాయి.

భద్రత విషయంలో..

Advertisement

సేఫ్టీ ఫీచర్ల పరంగా రెండు కార్లలోనూ ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లు, TPMS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, EBDతో ABS, ISOFIX మౌంట్లు ఉన్నాయి. అయితే ADAS విషయంలో బాలెనో ముందుంది. ఆల్ట్రోజ్ టాప్ వేరియంట్‌లో లెవెల్ 2 ADAS అందుబాటులో లేదు.

ధరలో ఎంత తేడా?

ధర విషయానికి వస్తే బాలెనో ఆల్ఫా (O) సుమారు రూ.9.50 లక్షల నుంచి రూ.9.99 లక్షల వరకు ఉండగా, ఆల్ట్రోజ్ అకంప్లిష్డ్+ S ధర సుమారు రూ.10.75 లక్షలు. అంటే వేరియంట్, ట్రాన్స్‌మిషన్‌ను బట్టి బాలెనో  తక్కువ ధరలో లభిస్తుంది. బాలెనోలో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో మాన్యువల్, AMT ఎంపికలు ఉన్నాయి. ఆల్ట్రోజ్ టాప్ వేరియంట్ మాత్రం 1.2-లీటర్ టర్బో పెట్రోల్‌తో 6-స్పీడ్ DCA గేర్‌బాక్స్‌ను పొందుతుంది.

Read Also: థార్ To డస్టర్.. దీపావళికి ముందే రాబోతున్న 5 అదిరిపోయే SUVలు!

Tags

Related News

థార్ కొనాలనుకుంటున్నారా? కాస్త ఆగండి.. కొత్త ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది!

అపాచీ బైక్‌లకు బిగ్ అప్‌డేట్.. కొత్త వేరియంట్లు, అదిరిపోయే ఫీచర్లు ఇవే!

థార్ To డస్టర్.. దీపావళికి ముందే రాబోతున్న 5 అదిరిపోయే SUVలు!

మహీంద్రా BE 6 vs టాటా కర్వ్ EV.. రెండింటిలో ఏది తోప్ అంటే?

సీటు కింద ఏకంగా 70 లీటర్ల స్టోరేజ్.. ఎక్కువ బూట్ స్పేస్ కావాలంటే వీటిని కొనండి!

ఎర్టిగా To ఇన్నోవా.. ఆగస్టులో ఎక్కువగా అమ్ముడైన 7-సీటర్ కార్లు ఇవే!

సింగిల్ ఛార్జ్ తో 400 కి.మీ రేంజ్.. కళ్లు చెదిరే ఈవీ స్కూటర్లు ఇవే!

Big Stories

Advertisement
×