E-Paper
Advertisement

బడ్జెట్‌లో అదిరిపోయే సౌండ్ క్వాలిటీ కావాలా? ఈ ఇయర్ బడ్స్‌ ట్రై చేయండి!

బడ్జెట్‌లో అదిరిపోయే సౌండ్ క్వాలిటీ కావాలా? ఈ ఇయర్ బడ్స్‌ ట్రై చేయండి!
Advertisement

HOPPUP AirDoze S40: రోజురోజుకు టెక్నాలజీ మారుతున్న కొద్దీ.. మన గ్యాజెట్స్ కూడా స్టైలిష్‌గా , అడ్వాన్స్‌డ్‌గా మారుతున్నాయి. ముఖ్యంగా వైర్‌లెస్ ఇయర్ బడ్స్ వాడకం విపరీతంగా పెరిగింది. అయితే.. ఎక్కువ ధర పెట్టి కొంటేనే.. మంచి సౌండ్ వస్తుందనే అపోహను తొలగిస్తూ, ప్రముఖ బ్రాండ్ మార్కెట్లోకి తీసుకొచ్చిన “HOPPUP AirDoze S40” ఇయర్ బడ్స్ ఇప్పుడు ట్రెండింగ్‌లో నిలిచాయి. కేవలం రూ. 649 ధరకే లభిస్తున్న ఈ బడ్స్ గురించి యూత్ సోషల్ మీడియాలో విపరీతంగా చర్చించుకుంటున్నారు. ఇంతకీ.. దీని ఫీచర్లు ఏంటి ? ధరకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

వైన్ కలర్ డిజైన్, లుక్:

ఈ ఇయర్ బడ్స్ చూడటానికి చాలా ప్రీమియం లుక్‌లో ఉంటాయి. ముఖ్యంగా దీని వైన్ కలర్ వేరియంట్ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఎర్గోనామిక్ డిజైన్‌తో.. రావడం వల్ల చెవుల్లో పెట్టుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది కలగదు. ఎక్కువ సేపు వాడినప్పటికీ.. చెవులు నొప్పి పుట్టకుండా వీటిని డిజైన్ చేశారు.

సౌండ్ ,ఆడియో పర్ఫామెన్స్:

Advertisement

ధర తక్కువగా ఉన్నప్పటికీ.. సౌండ్ క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడలేదు. ఇందులో పవర్ ఫుల్ 13MM డ్రైవర్లను వాడారు. కాబట్టి దీనివల్ల పాటలు వింటున్నప్పుడు క్లియర్ అయిన వాయిస్‌తో పాటు డీప్ బేస్ ఫీల్ పొందొచ్చు. మ్యూజిక్ లవర్స్‌కు ఇది నిజంగా ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.

బ్యాటరీ బ్యాకప్, ప్లేటైమ్:

ఈ బడ్స్ మెయిన్ హైలైట్ వీటి బ్యాటరీ లైఫ్ అనే చెప్పాలి. కేవలం రూ. 649 ధరకే ఇవి దాదాపు 40 గంటల పాటు టోటల్ ప్లేటైమ్‌ను అందిస్తాయి. అంటే ఒక్క సారి ఫుల్ ఛార్జ్ చేస్తే రోజంతా మ్యూజిక్, కాల్స్ లేదా మూవీస్ ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మోడర్న్ టైప్-సి (Type-C) ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల త్వరగా ఛార్జ్ ఎక్కుతుంది. తక్కువ ధరలో బెస్ట్ బ్యాటరీ కావాలనుకునే వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.

Advertisement

Also Read: చేయి ఊపితే చాలు ఆన్ అయిపోయే చిమ్నీలు! ఇండియన్ కిచెన్స్‌కు ఇవి పర్ఫెక్ట్!

గేమింగ్, కాల్ క్వాలిటీ :

గేమ్‌లు ఆడే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. ఇందులో.. ప్రత్యేకంగా ‘Rage Mode’ (లో-లేటెన్సీ గేమింగ్ మోడ్) ఇచ్చారు. దీని వల్ల గేమింగ్ ఆడేటప్పుడు ఆడియో లాగ్ సమస్య ఉండదు. అలాగే.. ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీ కారణంగా బయట ఎంత సౌండ్ ఉన్నా.. కాల్ మాట్లాడేటప్పుడు అవతలి వారికి మీ గొంతు స్పష్టంగా వినిపిస్తుంది. కాల్ క్వాలిటీ కూడా బాగుండటంతో ఎలాంటి ఇబ్బంది ఉండది. ఆఫీస్ కాల్స్ కూడా ఈజీగా మాట్లాడొచ్చు.

మొత్తంగా చూస్తే.. తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారికి ఈ మోడల్ ఒక అద్భుతమైన ఛాయిస్. రూ.649 ధరలో లభిస్తున్న ఈ బడ్స్ ప్రస్తుతం మార్కెట్లో హాట్ కేకులా.. అమ్ముడవుతున్నాయి. మీరు కూడా తక్కువ ధరలో మంచి బడ్స్ కొనాలని చూస్తున్నట్లయితే .. దీన్ని హ్యాపీగా ట్రై చేయొచ్చు!

Related News

జస్ట్ రూ.1,000కే బెస్ట్ ఇయర్ బడ్స్.. త్వరలో మార్కెట్లోకి రాబోతున్న టాప్ బ్రాండ్స్ ఇవే!

రూ.1,004కే 750W పవర్‌ఫుల్ మిక్సర్ గ్రైండర్..ఈ ఆఫర్ అస్సలు మిస్ కావద్దు!

పెన్,బ్లూటూత్ కీబోర్డ్ ఫ్రీ! రూ.42,999కే ట్రెండింగ్ ఆండ్రాయిడ్ ట్యాబ్

కాల్స్, మ్యూజిక్, హెల్త్ ట్రాకింగ్ అన్నీ ఈ ఒక్క ఉంగరంతోనే.. Rogbid ZenRing ప్రత్యేకతలు ఇవే!

48MP కెమెరా, A19 చిప్‌ కలిగిన iPhone 17eపై భారీ తగ్గింపు.. ఈ డీల్ మిస్ కావద్దు మామా!

స్పామ్ కాల్స్, రోబో కాల్స్‌కు చెక్ పెట్టేలా TRAI మాస్టర్ ప్లాన్.. ఇకపై ఆ తప్పు చేస్తే అంతే సంగతులు!

చేయి ఊపితే చాలు ఆన్ అయిపోయే చిమ్నీలు! ఇండియన్ కిచెన్స్‌కు ఇవి పర్ఫెక్ట్!

Big Stories

Advertisement
×