Big Stories

Yamaha Aerox 155 Blue Variant: యమహా ఏరోక్స్ లేటెస్ట్ వెర్షన్ లాంచ్.. పిచ్చెక్కిస్తున్న ఫీచర్లు..!

Yamaha Aerox 155 Blue Variant: దేశీయ ఆటో మార్కెట్‌లో కొత్త కొత్త బైకులు లాంచ్ అవుతున్నాయి. లేటెస్ట్ ఫీచర్లను కంపెనీలు టూ వీలర్లను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే దిగ్గజ బైకుల తయారీ కంపెనీ యమహా ఇటీవలే ఏరోక్స్ 155 వెర్షన్ ఎస్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ స్కూటర్ లైనప్‌కి కొత్త వేరియంట్ యమహా  ‘ది కాల్ ఆఫ్ ది బ్లూ’ వేరియంట్‌ను తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర రూ. 1,50,600గా ఉంది. ఈ బ్లూ స్క్వేర్ షోరూమ్‌లో ఇవి ప్రత్యేకంగా వినియోగదారులకు అందుబాటులో ఉంచింది.

- Advertisement -

యమహా AEROX 155 వెర్షన్ S ప్రధాన హైలైట్‌గా దాని స్మార్ట్ కీ టెక్నాలజీ ఉంటుంది. ఇది పట్టణ ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. ఈ సిస్టమ్ ఆన్సర్ బ్యాక్, అన్‌లాక్, ఇమ్మొబిలైజర్ వంటి ఫీచర్‌లతో అమర్చబడింది. రైడర్లకు సౌకర్యంతో పాటే భద్రత రెండింటినీ అందించడమే దీని లక్ష్యం.

- Advertisement -
Yamaha Aerox 155
Yamaha Aerox 155

Also Read: ఆప్రిలియా నుంచి సూపర్ బైక్ లాంచ్!

ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఆన్సర్ బ్యాక్ ఫంక్షన్ ఉపయోగపడుతుంది. ఇది ఆడియో సిగ్నల్‌లతో స్కూటర్‌ను గుర్తించడంలో సహాయపడుతుంది. కీలెస్ ఇగ్నిషన్ అనేది స్మార్ట్ కీ సిస్టమ్ మరొక బెనిఫిట్. దీంతో కీని ఉపయోగించకుండా స్కూటర్‌ను సులభంగా స్టార్ట్ చేయవచ్చు. ఇమ్మొబిలైజర్ ఫంక్షన్‌తో పాటు ఈ ఫంక్షన్, కీ మన దగ్గర్లో లేనప్పుడు ఇంజన్‌ను స్విచ్ ఆఫ్ చేయవచ్చు.

స్మార్ట్ కీ సిస్టమ్‌తో పాటు, కొత్త Yamaha AEROX 155 వెర్షన్ S, X సెంటర్ మోటిఫ్ ద్వారా హైలైట్ చేయబడిన అథ్లెటిక్ డిజైన్‌ను కలిగి ఉంది. అంతే కాకుండా ఇందులో ట్రాక్షన్ కంట్రోల్‌ ఉంటుంది. ఇది వేరియబుల్ వాల్వ్ యాక్చుయేషన్‌తో కూడిన కొత్త వేరియంట్ 155cc బ్లూ కోర్ ఇంజన్‌తో ఆధారపడి ఉంటుంది. ఇది 8,000rpm వద్ద 15bhp పవర్ రిలీజ్ చేస్తుంది. 6,500rpm వద్ద 13.9Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ అధిక పనితీరు,  సామర్థ్యం కలిగి ఉంటుంది. సిటీ రైడింగ్‌కు ఇది చాలా అనుకూలమైనది.

Also Read: ఫోర్ట్ రీ ఎంట్రీ.. ఆ కంపెనీలకు పోటీగా ఎస్‌యూవీ

స్కూటర్ కూడా E20 ఫ్యూజ్ కంప్లైంట్, స్టాండర్డ్ హజార్డ్ సిస్టమ్‌తో పాటు ఆన్‌బోర్డ్ డయాగ్నోస్టిక్స్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇది డైనమిక్ రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. AEROX 155 వెర్షన్ S వెయిట్ 126 గ్రాములు మాత్రమే. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 145 మిమీ. ఆయిల్ ట్యాంక్ సామర్థ్యం 5.5 లీటర్లుగా ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News