BigTV English

Aprilia india : ఆప్రిలియా నుంచి సూపర్ బైక్ లాంచ్!

Aprilia india : ఆప్రిలియా నుంచి సూపర్ బైక్ లాంచ్!

Aprilia india :  ఇండియా ఆటోమొబైల్ మార్కెట్‌లో ఏప్రిలియా కొత్త సూపర్ బైక్‌ను లాంచ్ చేసింది. ఇంతక ముందు మూడు బైకులను విడుదల చేసింది. ఈ కొత్త బైక్‌ను తీసుకురావడంతో అప్రిలియా ఇండియా ఈ సూపర్ బైక్‌‌కు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహంను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. జాన్ అబ్రహంకు బైకులంటే చాలా ఇష్టం. అతడు ఎన్నో సూపర్ బైకులను కూడా కలెక్ట్ చేస్తుంటాడు. ఇప్పుడు ఈ లిస్ట్‌లో అప్రిలియా RSV4 కూడా చేరింది.


ఆప్రిలియా ఇండియా మూడు సూపర్‌ బైక్‌లు 2024 RSV4, RS660, Tuono 660 ఇప్పటికే భారత్ మార్కెట్‌లో ఉన్నాయి. ఇప్పుడు కంపెనీ తన కొత్త సూపర్ బైక్‌ను విడుదల చేసింది. కొత్త టువరెగ్ 660 ఎడివి భారత మార్కెట్లో విడుదలైంది. ఈ కొత్త బైక్‌ను విడుదల చేయడంతో అప్రిలియా దేశంలో తన వ్యాపారాన్ని మరింత విస్తరించింది. ఈ కొత్త వేరియంట్‌లో రైడర్‌లకు మంచి డ్రైవింగ్ ఫీల్ ఇస్తుంది. ఈ బైక్‌లన్నీ కంప్లీట్ బిల్ట్ అప్ యూనిట్లలో CBU అందుబాటులో ఉన్నాయి. బైక్‌లను దేశంలోని ఏప్రిలియా మోటోప్లెక్స్ డీలర్‌షిప్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Aprilia india
Aprilia india

జాన్ అబ్రహంను బ్రాండ్ అంబాసిడర్‌‌గా నియమించడం అదృష్టమని అప్రిలియా ఇండియా చెబుతోంది. అప్రిలియాకు హృదయపూర్వకంగా అభిమానించే వ్యక్తిని తమ బ్రాండ్ అంబాసిడర్‌గా చేసుకున్నామని అన్నారు. సూపర్ బైకుల పట్ల అబ్రహంకు ఉన్న క్రేజ్ కంపెనీకి సరిపోతుందని అప్రిలియా చెప్పింది. జాన్ కేవలం బ్రాండ్ అంబాసిడర్ మాత్రమే కాదని.. అతను అప్రిలియాకు నిజమైన అభిమాని అని, అప్రిలియా ఇష్టాన్ని ప్రతిబింబించే రైడర్ అని సూపర్ బైక్ తయారీ కంపెనీ చెబుతోంది.


Also Read : ట్రయంఫ్ టైగర్ నుంచి రూ. 16 లక్షల బైక్.. ఒక్కసారి ఎక్కితే ఉంటది మామ!

మీరు పూర్తి అడ్వెంచర్ ప్రేమికులైతే.. ఈ బైక్‌ను తిరస్కరించలేరు. ఈ బైక్‌తో అన్ని రకాల రోడ్లపై సులభంగా ప్రయాణం చేయవచ్చు. కంపెనీ ప్రకారం హిల్స్‌పై కూడా ఈ బైక్‌ను ఇబ్బంది లేకుండా డ్రైవ్ చేయవచ్చు. టువరెగ్ 660 అడ్వెంచర్ రైడర్‌లకు బెస్ట్ ఆఫ్షన్.

Tags

Related News

Provident Fund: పీఎఫ్: అది ఉందని సంతోషించలేం.. అవసరానికి వాడుకోలేం

Instamart’s Discount: స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లపై 90% డిస్కౌంట్, ఇన్‌ స్టామార్ట్ కళ్లు చెదిరే ఆఫర్!

బంగారం మాత్రమే కాదు వెండి కూడా రికార్డులు బద్దలు కొడుతోంది..సిల్వర్ లో ఎలా పెట్టుబడి పెట్టాలి..?

క్రెడిట్ కార్డుతో బంగారు ఆభరణాలు కొనవచ్చా..? కొంటే ఎదురయ్యే లాభనష్టాలు ఏంటి..?

Gold Rate: అమెరికాలో బంగారం ధర తక్కువగా ఉంటుందా..? యూఎస్ నుంచి ఎంత బంగారం తెచ్చుకోవచ్చు..

Personal Finance: రూ. 50 లక్షల హోం లోన్ సైతం…ఈఎంఐ కడుతూ కేవలం 10 సంవత్సరాల్లో అప్పు తీర్చడం ఎలా..?

Airtel Xstream Fiber: ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ ఆఫర్.. నెలకు రూ.250 సేవ్ చేసుకోండి

Vi Business Plus: వ్యాపారానికి ఉత్తమ 5జి ప్లాన్.. విఐ బిజినెస్ ప్లస్ ప్రత్యేక ఆఫర్

Big Stories

×