Big Stories

Ford Endeavour : ఫోర్డ్ రీ ఎంట్రీ.. ఆ కంపెనీలకు పోటీగా ఎస్‌యూవీ

Ford Endeavour : నష్టాలు రావడంతో ఫోర్డ్ కార్ల తయారీ కంపెనీ దేశం నుంచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఫోర్డ్ దేశంలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతుందని అనేక పుకార్లు షికార్లు కొడుతున్నాయి. తాజాగా ఫోర్డ్ గురించి మరో వార్త హల్‌‌చల్ చేస్తోంది. దీని ప్రకారం.. కంపెనీ మిడ్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో వెహికల్ లాంచ్ చేయనుంది. ఫోర్డ్ ఏ ఫీచర్లతో ఏ వాహనాన్ని తీసుకొస్తుంది. తదితర విషయాలు గురించి తెలుసుకోండి.

- Advertisement -

ఫోర్డ్ టెరిటరీ
కొన్ని మీడియా నివేదికల ప్రకారం ఫోర్డ్ టెరిటరీ ఎస్‌యూవీని భారత మార్కెట్లోకి తీసుకురావడానికి కూడా సన్నాహాలు చేస్తోంది. కంపెనీ ఈ ఏస్‌యూవీ పేరును కూడా ట్రేడ్‌మార్క్ చేసింది. ప్రస్తుతం కంపెనీ అనేక దేశాల్లో ఈ ఎస్‌యూవీని విక్రయిస్తుంది.

- Advertisement -
Ford Endeavour
Ford Endeavour

ఇంజన్
ఫోర్డ్ తన టెరిటరీ ఎస్‌యూవీలో 1.8 లీటర్ కెపాసిటి గల GTDI ఎకోబూస్ట్ ఇంజన్‌ని అందిస్తోంది. ఇది 190 హార్స్ పవర్, 320 న్యూటన్ మీటర్ టార్క్ ఇస్తుంది. ఈ ఇంజన్‌తో కంపెనీ ఏడు స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అందిస్తుంది.

Also Read : జీప్ కంపాస్ కొత్త వేరియంట్ లాంచ్.. కేకపుట్టిస్తున్న స్పీడ్!

ఫీచర్లు 
ఫోర్డ్ టెరిటరీ ఎస్‌యూవీలో చాలా గొప్ప ఫీచర్లు ఉన్నాయి. ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, ఫ్రంట్ సైడ్, కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు, 12.3 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వైర్‌లెస్ ఛార్జింగ్, 12 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ADAS, LED హెడ్‌ల్యాంప్‌లు, 19 అంగుళాల అల్లాయ్ వీల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.

భారతదేశంలో ఎస్‌యూవీ ఎంట్రీకి సంబంధించి ఫోర్డ్ ఇండియా ఇంకా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అయితే ఈ ఎస్‌చయూవీని ఫోర్డ్ రిటర్న్‌తో తీసుకువస్తే అది మిడ్ సైజ్ సెగ్మెంట్‌లో తీసుకురావచ్చు. ఈ ఎస్‌యూవీ టాటా హారియర్, ఎమ్‌జీ హెక్టర్, మహీంద్రా స్కార్పియో, XUV700తో పాటు లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Also Read : ఆటోమేటిక్ ఎస్‌యూవీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా.. తక్కువ ధరలో బెస్ట్ ఇవే!

ఫోర్డ్ మరోసారి భారత్‌లో తన మార్కెట్‌ను పెంచుకునే ప్రయత్రం చేస్తోంది. ఈక్రమంలో కంపెనీ దేశంలోని అనేక విభాగాలలో తన వాహనాలను తీసుకువస్తుంది. సమాచారం ప్రకారం ఫోర్డ్ తన ఫుల్ సైజ్ ఎస్‌యూవీ ఎండీవర్‌ని ఎవరెస్ట్ పేరుతో తీసుకురానుంది. ఇది కాకుండా, రేంజర్ ముస్టాంగ్ మ్యాక్ఇ, ఎమ్‌పివిని కూడా ఆటో మార్కెట్‌లో ప్రవేశపెట్టనుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News