BigTV English

Zomato: జొమాటో కీలక నిర్ణయం.. ఇక బాదుడు మొదలు, కస్టమర్లు షాక్

Zomato: జొమాటో కీలక నిర్ణయం.. ఇక బాదుడు మొదలు, కస్టమర్లు షాక్

Zomato: జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఆర్డర్‌పై వసూలు చేసే ఫీజును అమాంతంగా పెంచేసింది. ప్రతీ ఆర్డర్‌పై గతంలో  రూ.10 మాత్రమే వసూలు చేసింది. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.12 పెంచేసింది. జమాటో నిర్ణయంపై కస్టమర్లు ఒక్కసారిగా షాకయ్యారు. దేశంలో ధరలు తగ్గించేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తుంటే జమాటో పెంచడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.


ఫీజు పెంచడానికి గల కారణాలు వివరించింది జొమాటో. పండగ సీజన్‌లో ఆర్డర్లు భారీగా పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది. దీనివల్ల డెలివరీ చేసేవారికి ఎక్కువ చెల్లింపులు చేయాల్సి వస్తుందని పేర్కొంది. దీనికితోడు నిర్వహణ ఖర్చులు పెరగడం లాంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

గతేడాది పండుగ సీజన్‌కు ముందు జొమాటో తన రుసుము రూ.6 నుండి రూ.10కి పెంచింది. ఇప్పుడు రూ. 12 లకు పెంచేసింది.  జొమాటో అందుబాటులో ఉన్న నగరాల్లో కస్టమర్లకు ఈ పెంపు వర్తిస్తుందని వెల్లడించింది. డిమాండ్ తగ్గిన తర్వాత ఈ పెంపు వెనక్కి తీసుకోవచ్చని కొందరు అంటున్నారు.


ఇప్పటికే ఎంపిక చేసిన కొన్ని సిటీల్లో ప్రతి ఆర్డర్‌పై ఫీజును స్విగ్గీ రూ.12 నుంచి రూ.14కు పెంచింది. వినియోగదారులకు రెండు రూపాయల పెంపును మొదట్లో లైటుగా తీసుకున్నారు. ప్రతి రోజూ లక్షల ఆర్డర్లను సప్లై చేసే ఈ కంపెనీకి అదనపు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నాయి మార్కెట్ వర్గాలు.

ALSO READ: రైల్వే టికెట్ బుకింగ్ బిజినెస్.. నెలకు లక్షలు సంపాదించే సీక్రెట్ ఇదే

జొమాటో మాతృ సంస్థ ఎటర్నల్‌కు ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికానికి లాభంలో 90 శాతం క్షీణించింది. ఆదాయం 70 శాతం పెరిగినప్పటికీ, గతేడాది రూ.253 కోట్ల రాగా, ప్రస్తుతం అది రూ.25 కోట్లకు పడిపోయింది.  మరో ఫుడ్ డెలివరీ స్విగ్గీ సంస్థ కూడా ఫీజు పెంచింది. ఆర్డర్ల పెరుగుతున్న నేపథ్యంలో ఎంపిక చేసిన నగరాల్లో ఫీజు రూ.12 నుండి రూ.14కి పెంచింది.

ఈ పెంపు తాత్కాలికమేనని తర్వాత వెనక్కి తీసుకోవచ్చని అంటున్నారు. జొమాటో, స్విగ్గీ సంస్థలు ఇటీవల క్విక్ కామర్స్ విభాగాల్లో పెట్టుబడులు పెడుతున్నాయి. స్విగ్గీకి ఇదే కాలంలో రూ.1,197కోట్ల నష్టం వాటిల్లింది. ఆ కంపెనీ ఇన్‌స్టా మార్ట్ వ్యాపారంలో భారీ నష్టాలను చవిచూసింది.

ఈ సేవలో నిరంతరం పెరుగుతున్న ఖర్చులు, పెట్టుబడుల కారణంగా ఈ త్రైమాసికంలో రెట్టింపు అయి రూ.1,197 కోట్లకు చేరింది.  జొమాటో, స్విగ్గీలకు ఇప్పుడు కొత్త సవాలు ఎదురైంది. రైడ్-హెయిలింగ్ కంపెనీ రాపిడో తన కొత్త ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ ఓన్లీని ప్రారంభించింది.

ప్రస్తుతం బెంగళూరులోని కోరమంగళ, హెచ్‌ఎస్‌ఆర్, బీటీఎం లేఅవుట్ వంటి ప్రాంతాలలో సేవలు అందిస్తోంది. దీని ప్రత్యేకత ఏమిటంటే జొమాటో-స్విగ్గీలు రెస్టారెంట్ల నుండి 16 శాతం నుండి 30 శాతం కమీషన్ తీసుకుంటున్నాయి. ఓన్లీ 8 నుంచి 15 శాతం కమీషన్ తీసుకుంటోంది. దీనివల్ల రాబోయే కాలంలో ఆ రెండు కంపెనీలకు కష్టాలు తప్పవని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

Related News

OYO Offers: ఓయో హోటల్స్‌పై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. 75% తగ్గింపు మిస్ కాకండి!

JioMart Offers: జియోమార్ట్ కొత్త ఆఫర్.. మొదటి ఆర్డర్‌పై అదిరిపోయే తగ్గింపు

Air India Offers: ఎయిరిండియా కొత్త డిస్కౌంట్‌.. 25 శాతం తగ్గింపు, ప్రయాణికులకు పండగే

IRCTC business ideas: రైల్వే టికెట్ బుకింగ్ బిజినెస్.. నెలకు లక్షలు సంపాదించే సీక్రెట్ ఇదే!

Tata New Curvv: టాటా నుంచి సరికొత్త కారు.. రూ.10 లక్షలకే అదిరిపోయే లుక్‌తో!

Big Stories

×