Allu Arjun – Pawan kalyan : టాలీవుడ్ స్టార్ హీరో ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అలా వైకుంఠపురంలో సినిమా వరకు క్లాస్ హీరోగా ప్రేక్షకులను అలరించేవాడు. అప్పటివరకు ఆయన చేసిన పాత్రలన్నీ కూడా లవ్ అండ్ ఎమోషన్ కథలతో ఉండేవి. ఆ తర్వాత వచ్చిన పుష్ప మూవీతో ఒక్కసారిగా మాస్ హీరోగా మారిపోయాడు అల్లు అర్జున్. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడంతో అతని క్రేజ్ పెరిగింది. మలయాళ అభిమానులు బన్నిని మల్లు స్టార్ అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. ఇక ఈ మూవీకి సీక్వెల్ గా గత ఏడాది పుష్ప 2 వచ్చింది. ఒకవైపు సినిమాకు విమర్శలు అందుతున్న సరే మరోవైపు కలెక్షన్ల వర్షం కురిసింది. అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది.. అయితే సీక్వెల్స్ గా మూవీలలోని లుక్ ను చాలా మంది కాపీ కొట్టారని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా కాపీ కొట్టినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..
అల్లు అర్జున్ ను పవన్ కళ్యాణ్ కాపీ కొట్టాడా..?
అల్లు అర్జున్ ని పవన్ కళ్యాణ్ కాపీ కొట్టాడా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. అంత పెద్ద స్టార్ హీరో అయినా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ని కాపీ కొట్టడం ఏంటి అనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. కానీ ఇది నిజమని తెలుస్తుంది. ఈమధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ మూవీ నుంచి పోస్టర్లు రిలీజ్ అయ్యాయి.. ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్లు అచ్చం అల్లు అర్జున్ పుష్ప సినిమాను దించేసినట్టే కనిపిస్తున్నాయంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ట్రెండ్ సెటర్, ట్రెండ్ ఫాలోవర్ అంటూ అల్లు అర్జున్ పుష్ప సినిమాలోని ఫోటోలతో పవన్ కళ్యాణ్ ఓజీ పోస్టర్లను యాడ్ చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరి దీనిపై ఆ హీరోలు ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.. ఇద్దరు హీరోలు సేమ్ గా అనిపిస్తున్న ఫోటోలేవో ఒకసారి ఇక్కడ చూసేయండి..
Trend Setter : Trend Follower: https://t.co/KBwAGmQ2Wh pic.twitter.com/pAaacX3pbZ
— – के -🇳🇵🗡️ (@Corleoneei) September 2, 2025
పవన్ కళ్యాణ్ సినిమాలు..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ చిత్రం హరిహర వీరమల్లు. ఈ మూవీ ఇటీవల రిలీజ్ అయింది. భారీ అంచనాల తో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టింది. ఇప్పుడు ఆయన నటించిన మరో యాక్షన్ మూవీ ఓజీ ఈనెల 25న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ మూవీ కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటుగా తెలుగు అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ తర్వాత హరీష్ శంకర్ కాంబినేషన్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమాను కూడా మరో మూడు నెలల్లో అంటే సంక్రాంతికి థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read : బయటకొచ్చిన శ్రీకర్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్.. అవనికి నిజం తెలుస్తుందా..?
అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే… ప్రస్తుతం ఈయన తమిళ డైరెక్టర్ అట్లీతో కలిసి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో దాదాపు ముగ్గురు హీరోయిన్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇందులో మలయాళ యాక్టర్లతో పాటుగా తమిళ కమెడియన్ యోగి బాబు కూడా నటించబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చే ఏడాది థియేటర్లో లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు..