E-Paper
Advertisement

Kaveri Travels Bus Accident: బస్సు ప్రమాదం పాపం ఎవరిది? స్పాట్‌లో 50 మంది

Kaveri Travels Bus Accident: బస్సు ప్రమాదం పాపం ఎవరిది? స్పాట్‌లో 50 మంది
Advertisement

Kaveri Travels Bus Accident: రాజమండ్రి సమీపంలో అర్థరాత్రి ఓ ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒకరు మృత్యువాత పడగా, 18 మంది గాయపడ్డారు. మరో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది. ఘటన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇంతకీ ప్రమాదం వెనుక అసలేం జరిగంది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

విశాఖ నుంచి హైదరాబాద్‌కు 50 మంది ప్రయాణికులతో కావేరి ట్రావెల్ కి చెందిన బస్సు బయలుదేరింది. విశాఖలో రాత్రి బయలుదేరిన ఈ బస్సు, అర్థరాత్రి అయ్యేసరికి రాజమండ్రి సమీపంలో ప్రమాదానికి గురైంది. రాజమండ్రి రూరల్ కాతేరు-కొంతమూరు మధ్య బస్సు బోల్తా పడింది. ఆ ప్రాంతంలో రోడ్డు మరమ్మతు పనులు జరుగుతున్నాయి.

Advertisement

డైవర్షన్ ఇచ్చిన విషయాన్ని డ్రైవర్ గమనించలేదు. వేగంగా వెళ్తున్న బస్సుకు ఒక్కసారి బోర్డు కనిపించింది. వెంటనే దాన్ని టర్న్ చేసే క్రమంలో బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 20 ఏళ్ల యువతి స్పాట్‌లో మృతి చెందింది. మరో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.

ప్రమాదం విషయం తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఓ వైపు అంబులెన్స్, మరోవైపు క్రేన్ వచ్చింది. రోడ్డుపైనున్న బస్సును క్రేన్‌తో పక్కకు తప్పించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. గాయపడినవారిని సమీపంలో ఆసుపత్రికి తరలించారు. కొంతమంది అక్కడ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు.

Advertisement

ALSO READ: చంపిన తర్వాత శవాన్ని కుక్కర్లో ఎందుకు ఉడికించాడు.. ఆనవాళ్లు లేకుండా ఏం చేశాడు?

గాయపడిన వారిలో కొందర్ని డిశ్చార్జ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ప్రయాణికుల నుంచి సమాచారం సేకరించారు. మృతి చెందిన యువతి విశాఖకు చెందినదిగా గుర్తించారు. టెక్కీ కంపెనీలో జాబ్ కోసం విశాఖ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. అంతలోనే యువతి ఈ లోకాన్ని విడిచిపెట్టింది.

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×